రోజుకు రూ.200తో రూ.10 లక్షలు మీ సొంతం.. కేంద్రం ఆఫర్..

Venkatrao Lella

Images: Pinterest

04 OCT 2026

పోస్టాఫీస్ స్మాల్ సేవింగ్స్ స్కీముల్లో చాలామంది చేరుతూ ఉంటారు. అధిక వడ్డీతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలు కావడంతో ఎక్కువమంది పొదుపు స్కీముల్లో చేరతారు. పోస్టాఫీసుల్లో పెట్టే పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వ హామీ ఉంటుంది.

కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వడం వల్ల మీ డబ్బులు సురక్షితంగా ఉంటాయి. అధిక రాబడితో పాటు మీ డబ్బులు సురక్షితంగా ఉంటాయి. దీంతో ఇటీవల కాలంలో పోస్టాఫీస్ స్కీమ్స్ బాగా పాపులర్ అయ్యాయి.

పోస్టాఫీసుల్లో ఉన్న అద్బుతమైన పథకాల్లో రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ఒకటి. ప్రతీ రోజు రూ.200 పొదుపు చేసుకుంటే రూ.10 లక్షలు మీరు పొందవచ్చు. వడ్డీ రూపంలో రూ.3 లక్షల పొందే ఛాన్స్ ఉంది.

పోస్టాఫీస్ ఆర్డీ స్కీములో ప్రస్తుతం వడ్డీ రేటు 6.7 శాతం ఉంది. కేవలం రూ.100తో పెట్టుబడి ప్రారంభించవచ్చు. గరిష్టంగా ఎంత అయినా  ఇన్వెస్ట్ చేయవచ్చు. మొత్తం ఒకేసారి కాకుండా విడతల వారీగా జమ చేయవచ్చు.

భార్యభర్తలు కలిసి జాయింట్ అకౌంట్ కూడా తెలిసి డబ్బులు పొదుపు చేసుకోవచ్చు.  ఇందులో  ఐదు సంవత్సరాల మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. ఈ కాలపరిమితి తర్వాత వడ్డీతో సహా మొత్తం ఒకేసారి విత్ డ్రా చేసుకోవచ్చు.

అవసరమైతే పెట్టుబడిని మీరు మరో ఐదేళ్లు పొడిగించుకోవచ్చు. ప్రతీ నెలా మీరు వాయిదాను జమ చేయాల్సి ఉంటుంది. లేకపోతే నెలకు 1 శాతం చొప్పున జరిమానా విధిస్తారు.

వరుసగా నాలుగు నెలల పాటు మీరు డబ్బులు జమ చేయకపోతే ఖాతా క్లోజ్ అవుతుంది. దీంతో ప్రతీ నెలా నిర్ణీత సమాయానికి డబ్బులు జమ చేయాలి. మర్చిపోతే సమస్యలు రావొచ్చు.

మీరు రోజూ రూ.200 ఆదా చేస్తే నెలకు రూ.6 వేలు అవుతుంది. ఐదేళ్ల తర్వాత మీ పెట్టుబడి రూ.3.60 లక్షలు వుతుంది. వడ్డీతో కలిసి రూ.4,28,197 అందుతాయి. మర ఐదేళ్లు పొడిగించుకుంటే మీ ఆదాయం పెరుగుతుంది.

5 ఏళ్లు పొడిగించుకుంటే మీ మొత్తం రూ.7,20,000 అవుతుంది. వడ్డీ రూపంలో రూ.3.05 లక్షలు అందితే.. మొత్తం రూ.10,26,131 అందుతాయి. రోజుకు రూ.200 పొదుపు చేయడం ద్వారా రూ.10 లక్షలు మీ సొంతమవుతాయి.