AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vande Bharat Sleeper: ఏపీకి తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. ప్రారంభానికి ముహూర్తం ఖరారు..! స్టాపులు ఎక్కడెక్కడంటే..?

దేశంలో రెండో వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కేందుకు ముహూర్తం ఖరారు అయింది. ఈ నెలలోనే ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ రైలు ఏపీ మీదుగా ప్రయాణించనుంది. ఇప్పటికే రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. టైమ్ షెడ్యూల్, స్టాపుల వివరాలు కూడా రెడీ చేశారు.

Vande Bharat Sleeper: ఏపీకి తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. ప్రారంభానికి ముహూర్తం ఖరారు..! స్టాపులు ఎక్కడెక్కడంటే..?
Vande Bharat Sleeper
Venkatrao Lella
|

Updated on: Oct 07, 2026 | 8:04 AM

Share

ఏపీ ప్రజలకు భారీ గుడ్ న్యూస్.. రాష్ట్రానికి తొలి వందే భారత్ స్లీపర్ రైలు రానుంది. ఇప్పటివరకు రాష్ట్రం మీదుగా అనేక వందే భారత్ రైళ్లు నడస్తోండగా.. వీటిల్లో ఆక్యూపెన్సీ కూడా ఫుల్‌గా ఉంది. దీంతో ఈ ప్రీమియం హైస్పీడ్ రైళ్లకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని స్లీపర్ వెర్షన్‌ను కూడా ఏపీ మీదుగా అందుబాటులోకి తీసుకురావాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఇప్పటికే ఈ రైలుకు రైల్వే బోర్డు అధికారికంగా ఆమోదం తెలపగా.. మొత్తానికి ఏపీలో తొలి వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలపై పరుగులు తీయనుంది. దసరా, దీపావళి వరుస పండుగల కారణంగా ఈ నెలలోనే దీనిని ప్రారంభించేందుకు రైల్వేశాక సిద్దమైనట్లు తెలుస్తోంది. వారానికి ఆరు రోజుల పాటు ఇది సర్వీసులు అందించనుంది. ఏపీ నుంచి దూర ప్రాంతాలకు వెళ్లేవారికి వందే భారత్ స్లీపర్ రైలుతో ప్రయోజనం చేకూరనుంది.

ఏపీలో స్టాపులు ఇవే..

బెంగళూరు-ముంబై మధ్య వందే భారత్ స్లీపర్ రైలుకు రైల్వేశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రైలు ఏపీ మీదుగా ప్రయాణం చేయనుంది. ఈ నెలలోనే ఈ రైలు పట్టాలెక్కించనుండగా.. ఇప్పటికే ట్రయల్ రన్ కూడా పూర్తి చేశారు. ఈ రైలుకు సంబంధించిన టైమింగ్స్, స్టాపుల వివరాలు కూడా బయటకొచ్చాయి. బెంగళూరులో బయల్దేరనున్న ఈ రైలు.. ఏపీ మీదుగా ముంబైకి చేరుకుంటుంది. ఏపీలోని అనంతపురం, గుంతకల్‌లో ఈ ట్రైన్ ఆగుతుంది. వారంలో ఆరు రోజుల పాటు ఈ సర్వీస్ తిప్పనుండగా.. నిర్వహణ కోసం ఒక రోజు అందుబాటులో ఉండదు. బెంగళూరు-ముంబై మధ్య సర్వీస్ సోమవారాలు మినహా మిగతా రోజుల్లో అందుబాటులో ఉంటుంది. ముంబై-బెంగళూరు రైలు బంగళవారాలు మినహా మిగతా రోజుల్లో అందుబాటులో ఉంటుంది.

టైమింగ్స్ ఖరారు..!

ఈ వందే భారత్ స్లీపర్ రైలు టైమింగ్స్ విషయానికొస్తే.. బెంగళూరు-ముంబై సర్వీస్ రాత్రి 10 గంటలకు బయల్దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1.50 గంటలకు గమ్యస్థానికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ముంబైలో రాత్రి 10.30 గంటలకు బయల్దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. ఈ సర్వీసుల కోసం రెండు వందే భారత్ స్లీపర్ రైలు సెట్లను ఉపయోగించనున్నారు. అనంతపురం, రాయచూర్, గుంతకల్, కలబురిగి, సోలాపూర్, పూణె, కళ్యాణ్ స్టేషన్లలో ఇది అగనుంది. ప్రస్తుతం ముంబై-బెంగళూరు మధ్య ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్ ఉండగా.. ఇందులో ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణానికి 24 గంటల సమయం పడుతుంది. అయితే వందే భారత్ స్లీపర్ రైలు రాకతో ప్రయాణ సమయం 16 గంటలకు తగ్గనుంది. దీని రాకతో ముంబై, బెంగళూరు మధ్య రాత్రిపూట ప్రయాణం సౌకర్యవంతం కానుంది. ఇందులో సీసీటీవీ కెమెరాలు, టికెట్‌తో పాటు ఫుడ్, బయో వ్యాక్యూమ్ టాయిలెట్లు, ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్లు, ఛార్జింగ్ పాయింట్లు, స్వదేశీ కవచ్ వంటి సౌకర్యాలు ఉంటాయి,.

Follow Us
ఏపీకి తొలి వందే భారత్ స్లీపర్.. ముహూర్తం ఖారారు.. అప్పటినుంచే..
ఏపీకి తొలి వందే భారత్ స్లీపర్.. ముహూర్తం ఖారారు.. అప్పటినుంచే..
32 ఫోర్లు, 17 సిక్సర్లు.. ఎకానా గడ్డ.. సర్పంచ్ సాబ్ అడ్డా
32 ఫోర్లు, 17 సిక్సర్లు.. ఎకానా గడ్డ.. సర్పంచ్ సాబ్ అడ్డా
రోజూ నీరసంగా ఉంటున్నారా? ఈ సహజ ఆహారాలు మీ డైట్‌లో చేర్చుకోండి
రోజూ నీరసంగా ఉంటున్నారా? ఈ సహజ ఆహారాలు మీ డైట్‌లో చేర్చుకోండి
'జీవిత భాగస్వామిగా భావించా.. నీకు ఎయిడ్స్ ఉందా? అన్నాడు'
'జీవిత భాగస్వామిగా భావించా.. నీకు ఎయిడ్స్ ఉందా? అన్నాడు'
అరసవల్లి సూర్యనారాయణ స్వామికి అపురూప ఆభరణాల సమర్పణ.. విలువెంతంటే
అరసవల్లి సూర్యనారాయణ స్వామికి అపురూప ఆభరణాల సమర్పణ.. విలువెంతంటే
దసరా, దీపావళికి ఇంటికెళ్తున్నారా..? ఈ రైళ్లల్లో సీట్లు ఖాళీ
దసరా, దీపావళికి ఇంటికెళ్తున్నారా..? ఈ రైళ్లల్లో సీట్లు ఖాళీ
టీ20I డెబ్యూలోనే దుమ్ములేపిన నమన్ ధీర్
టీ20I డెబ్యూలోనే దుమ్ములేపిన నమన్ ధీర్
5 ఏళ్ల ప్రజాసేవ.. 75 గంటల ‘మోదీ జాతర’.. తిరుపతిలో భారీ కార్యక్రమం
5 ఏళ్ల ప్రజాసేవ.. 75 గంటల ‘మోదీ జాతర’.. తిరుపతిలో భారీ కార్యక్రమం
గుడ్లు ఉడికించేటప్పుడు దీన్ని వేస్తే పొట్టు ఈజీగా వచ్చేస్తుంది..
గుడ్లు ఉడికించేటప్పుడు దీన్ని వేస్తే పొట్టు ఈజీగా వచ్చేస్తుంది..
విద్యార్ధులకు అలర్ట్.. ఇక ఇంటర్‌ మార్కుల మెమోపై ఇక 11 అంకెల PEN
విద్యార్ధులకు అలర్ట్.. ఇక ఇంటర్‌ మార్కుల మెమోపై ఇక 11 అంకెల PEN