AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: ఎట్టకేలకు మోక్షం.. రూ.వెయ్యి కాదు.. ఇకపై ప్రతీ నెలా రూ.3 వేలు..! రేపే బిగ్ అప్డేట్..

నవంబర్ 19వ తేేేేేేేేదీన ఈపీఎఫ్ఓ ట్రస్టీస్ బోర్డ్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. పెన్షన్ పెంచాలని ఉద్యోగ సంఘాలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఎట్టకేలకు దానిని మోక్షం లభించనుందని చెబుతున్నారు. రేపు కీలక ప్రకటన వచ్చే సూచనలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

EPFO: ఎట్టకేలకు మోక్షం.. రూ.వెయ్యి కాదు.. ఇకపై ప్రతీ నెలా రూ.3 వేలు..! రేపే బిగ్ అప్డేట్..
Epfo Pension
Venkatrao Lella
|

Updated on: Nov 18, 2026 | 3:15 PM

Share

మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా..? అయితే నవంబర్ 19వ తేదీన శుభవార్త అందే అవకాశముంది. మీకు పెన్షన్ మరింత పెరగవచ్చు. ప్రస్తుతం కనీస పెన్షన్ పరిమితి రూ.వెయ్యిగా ఉండగా.. పెరుగుతున్న ఖర్చులు, అధికమవుతున్న ద్రవ్యోల్బణం కారణంగా పెన్షన్ పెంచాలని ఎప్పటినుంచో ఉద్యోగ, పెన్షన్ సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. వైద్య ఖర్చులు, నిత్యావసర ఖర్చులు భారీగా పెరిగిపోయిన క్రమంలో రూ.వెయ్యి పెన్షన్ ఎందుకు సరిపోదని చెబుతున్నాయి. దీంతో పెన్షన్‌ను రూ.7.500కి పెంచాలని ఉద్యోగ సంఘాలు ఆందోళనలు కూడా చేపట్టాయి. కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖకు పలుమార్లు వినతిపత్రాలు కూడా అందించారు. ఈ క్రమంలో ఎట్టకేలకు పెన్షన్ పెంపునకు కేంద్రం సముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీని కోసం ఈపీఎఫ్ఓ ఖాతాదారులు ఎదురుచూస్తున్నారు.

పెన్షన్ రూ.3 వేలకి పెంపు..?

నవంబర్ 19వ తేదీన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశం జరగనుంది.ఈ సమాశంలో కనీస పెన్షన్‌ రూ.3 వేలకు పెంపుపై చర్చించనున్నారు. అనంతరం దీనికి ఆమోదం తెలిపే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు భారీ శుభవార్తగా చెప్పవచ్చు. అయితే నేషనల్ కాన్పెడరేషన్ ఆఫ్ పెన్షనర్ల అసోసియేషన్ 22 డిమాండ్లను ఈపీఎఫ్ఓ ముందు ఉంచింది. ఉద్యోగులు తమ వాస్తవ జీతం ఆధారంగా పెన్షన్‌కు వాటా చెల్లించే విధంగా సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని కోరుతున్నారు. జీతంపై గరిష్ట పరమితికి బదులుగా వాస్తవ జీతం ఆధారంగా చందా చెల్లించేలా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు నవంబర్ 4,2022న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలంటున్నారు.

ఉద్యోగ సంఘాల డిమాండ్లు..

అలాగే మినహాయింపు పొందిన ట్రస్టులకు సంబంధించి అధిక పెన్షన్ క్లెయిమ్‌లను తిరస్కరిస్తున్నారని, నిబంధనల ప్రకారం అధిక పెన్షన్ల ఎంపికను నిరాకరించకూడదని చెబుతోంది. అలాగే ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల పట్ట వివక్ష చూపకూడదని, ఒకే విధానం ఉండాలని డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థలోని ఒక యూనిట్‌లో క్లెయిమ్‌లు ఆమోదిస్తుండగా.. మరో యూనిట్‌లో తిరస్కరిస్తుండటంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఉద్యోగులందరికీ సమాన హక్కులు ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతోంది. ఈపీఎఫ్ఓ వద్ద రూ.11 లక్షల కోట్ల నిధులు ఉన్నాయని, ఏటా అది 13 శాతం చొప్పున పెరుగుతుందని పెన్షనర్ల అసోసియేషన్ చెబుతోంది. అలాంటి సమయంలో పెన్షన్ క్లెయిమ్స్ తిరస్కరించకూడదని కోరింది.  అలాగే డిమాండ్ లేఖలు ఆలస్యం కావడం వల్ల నెలకు రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు పింఛన్లు పొందుతున్నవారు రూ.40 వేల వరకు వడ్డీ భారాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపింది. దీంతో వడ్డీ భారం నుంచి ఉపశమనం కల్పించాలని పెన్షనర్లు డిమాండ్ చేస్తున్నారు.

Follow Us