ఈపీఎఫ్‌వో
ఈపీఎఫ్‌వో (EPFO)
దేశంలోని కార్మికుల సామాజిక భద్రత కోసం భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈపీఎఫ్‌వో (Employees’ Provident Fund Organisation) పనిచేస్తోంది. ప్రైవేటు రంగ కంపెనీలు, పరిశ్రమల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు భవిష్యత్తులో ఆర్థిక భద్రత కల్పించడం దీని ప్రధాన లక్ష్యం. 1952లో ఈపీఎఫ్‌వోను స్థాపించారు. ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్) ద్వారా ఉద్యోగులు పొదుపు, పెన్షన్, జీవిత బీమా ప్రయోజనాలను పొందుతారు. అర్హత కలిగిన ఉద్యోగులకు బేసిక్ జీతం, డీఏ ఆధారంగా ప్రావిడెంట్ ఫండ్ లెక్కిస్తారు. సాధారణంగా మూలవేతనంగా ఉద్యోగి వాటా 12 శాతం, యజమాని వాటా 12 శాతంగా ఉంటుంది. యజమాని వాటాలో కొంత భాగం ఈపీఎస్ పెన్షన్‌కు వెళ్లగా.. మిగిలిన భాగం ఈపీఎఫ్ ఖాతాకు జమ అవుతుంది. ప్రతి సంవత్సరం పీఎఫ్‌పై వార్షిక వడ్డీ జమ అవుతుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఈ వడ్డీ రేటు 8.25శాతంగా ఉంది. ఈపీఎఫ్ కవరేజీకి చట్టబద్ధ వేతన పరిమితిని రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచుతూ 2026 సెప్టెంబర్ 17న కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. అనారోగ్యం, ఉన్నత విద్య, వివాహం, ఇంటి కొనుగోలు, ఇంటి నిర్మాణం వంటి కొన్ని ప్రత్యేక కారణాలతో పీఎఫ్ ఖాతా నుంచి పాక్షికంగా డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. అలాగే ఉద్యోగం మానేసినప్పుడు, పదవి విరమణ చెందినప్పుడు మీ పీఎఫ్ ఖాతాలోని డబ్బును అర్హత మేరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. UANకు లింక్ చేసిన మొబైల్ నంబర్ నుంచి 9966044425కు మిస్డ్ కాల్ ఇచ్చి పీఎఫ్ ఖాతాలో బ్యాలెన్స్ చేసుకోవచ్చు.
ఇంకా చదవండిEPFO: పీఎఫ్ ఖాతాదారులకు పెద్ద ఊరట.. ఈ నెలాఖరులోగా అకౌంట్లోకి డబ్బులు.. చెక్ చేసుకోవడం మర్చిపోవద్దు..
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి తీపికబురు. గత నెలకు సంబంధించిన సొమ్ము మీ పీఎఫ్ ఖాతాలో ఇంకా జమ కాలేదా.. అయితే మీకు త్వరలో అందనున్నాయి. నిబంధనల ప్రకారం ప్రతీ నెలా 15వ తేదీలోపు కంపెనీలు జమ చేయాల్స ఉంటుంది. అయితే వేతన పరిమితిలో మార్పులు జరగడంతో గడువు పొడిగించారు.
- Venkatrao Lella
- Updated on: Oct 29, 2026
- 12:00 pm