AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: పీఎఫ్ కొత్త రూల్స్.. హోమ్ లోన్ కట్టేందుకు డబ్బులు విత్ డ్రా చేస్తున్నారా..? ట్యాక్స్ ఎంత పడుతుందంటే..?

హోమ్ లోన్ కట్టేందుకు లేదా కొత్త ఇంటి నిర్మాణానికి పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేస్తున్నారా.. అయితే ఈ కొత్త నిబంధనల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. సొంతిల్లు అనేది ప్రతీఒక్కరి కల. ఇందుకోసం బ్యాంకుల నుంచి హోమ్ లోన్ తీసుకుంటారు. ఈ లోన్ చెల్లించేందుకు పీఎఫ్ డబ్బులు వినియోగించుకోవచ్చు.

EPFO: పీఎఫ్ కొత్త రూల్స్.. హోమ్ లోన్ కట్టేందుకు డబ్బులు విత్ డ్రా చేస్తున్నారా..? ట్యాక్స్ ఎంత పడుతుందంటే..?
Epfo
Venkatrao Lella
|

Updated on: Nov 13, 2026 | 9:51 PM

Share

ఇప్పటిరోజుల్లో సొంతిల్లు అనేది ప్రతీఒక్కరి చిరకాల కల. తమకంటూ మంచి ఇల్లు కట్టుకోవాలని ఆశ పడుతుంటారు. తమ ఆర్ధిక స్తోమత సరిపోక బ్యాంకుల నుంచి హోమ్ లోన్లు తీసుకుంటూ ఉంటారు. ఉద్యోగాలు చేసేవారికి బ్యాంకులు సులువుగా రుణాలు అందిస్తుంటాయి. దీంతో బ్యాంకుల నుంచి హోమ్ లోన్ తీసుకుని ఈఎంఐల రూపంలో ప్రతీ నెలా తమ జీతం నుంచి చెల్లిస్తుంటారు. అయితే పీఎఫ్ బ్యాలెన్స్‌తో కూడా హోమ్ లోన్ చెల్లించవచ్చు. హోమ్ లోన్ చెల్లించేందుకు పీఎఫ్ బ్యాలెన్స్‌ను ఖాతాదారులు విత్ డ్రా చేసుకునే అవకాశాన్ని ఈపీఎఫ్ఓ కల్పిస్తోంది. తమ బ్యాలెన్స్‌లో కొంత భాగాన్ని కొత్త ఇల్లు నిర్మించుకోవడం, ఫ్లాట్ కొనుగోలు చేయడం, హోమ్ లోన్ చెల్లించడం కోసం విత్ డ్రా చేసుకోవచ్చు. ఇటీవల ఈ నిబంధనలను ఈపీఎఎఫ్ఓ మరింత సరళతరం చేసింది.

ఎంతవరకు విత్ డ్రా చేసుకోవచ్చు..?

కొత్త నిబంధనల ప్రకారం కనీసం 12 నెలల ఈపీఎఫ్ఓ సర్వీస్ పూర్తి చేస్తే గృహ రుణం కోసం పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంది. గతంలో ఐదేళ్లు సర్వీస్ పూర్తి చేసినవారికి మాత్రమే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ పరిమితిని తగ్గించారు. కొత్త నిబంధనల ప్రకారం ఒక ఏడాది సర్వీస్ పూర్తి చేసి ఉంటే మొత్తం బ్యాలెన్స్‌లో 75 శాతం సొమ్మును తీసుకోవచ్చు. కనీసం 25 శాతం మొత్తాన్ని ఉంచాల్సి ఉంటుంది. ఉదాహరణకు పీఎఫ్ నిల్వ రూ. 10 లక్షలు ఉంటే రూ.7.50 లక్షల వరకు మీరు విత్ డ్రా చేసుకుని హోమ్ లోన్ తీర్చవచ్చు. ఇల్లు లేదా ఫ్లాట్ కొనుగోలు, కొత్త ఇంటి నిర్మాణం, హోమ్ లోన్‌ను తిరిగి చెల్లించడం, ఇప్పటికే ఉన్న ఇంటి లేదా ఫ్లాట్‌కు మరమ్మత్తులు, పునరుద్ధరణ లేదా మెరుగులు దిద్దటం వంటి అవసరాలకు ఉపయోగించుకోవచ్చు.

విత్ డ్రాలపై ట్యాక్స్ ఉంటుందా..?

ఉద్యోగి తమ సర్వీసు కాలంలో గరిష్టంగా ఐదు సార్లు గృహ అవసరాల కోసం విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంది. అయితే విత్ డ్రా చేసే అమౌంట్‌పై ట్యాక్స్ అనేది మీ సర్వీస్‌ను బట్టి ఉంటుంది. మీరు మొత్తం 5 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసి ఉంటే విత్ డ్రాలపై ఎలాంటి పన్ను ఉండదు. టీడీఎస్ కట్ చేయరు. మొత్తం సర్వీస్ పదేళ్ల కంటే తక్కువగా ఉండి రూ.50 వేల కంటే ఎక్కువ విత్ డ్రా చేస్తే 10 శాతం టీడీఎస్ కట్ అవుతుంది. మీ హోమ్ లోన్ వడ్డీ రేటు పీఎఫ్ వడ్డీ కంటే ఎక్కువగా ఉంటే పీఎఫ్ నిధులను విత్ డ్రా చేసుకుని చెల్లించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. పీఎఫ్ నిధులపై వడ్డీ, చక్రవడ్డీ లాంటివి అందుతాయి. దీంతో పీఎఫ్ అకౌంట్లో నిధులు ఉంచుకోవడం వల్ల దీర్ఘకాలంలో పొదుపు పెరుగుతుంది. అవసరమైతే తప్పు విత్ డ్రా చేసుకోకపోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Follow Us
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా? " రామాయణ" మేకర్స్ పై ముఖేష్ ఖన్నా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా?
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో