AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పెద్ద ఊరట.. మీ వివరాలు తప్పుగా ఉంటే మొబైల్ ద్వారానే మార్చుకోవచ్చు.. సింపుల్ ప్రాసెస్ ఇదే..

పీఎఫ్ రికార్డుల్లో వివరాలు తప్పుగా ఉన్నాయా? అయితే మీరు ఆన్‌లైన్ ద్వారా సింపుల్‌గా మార్చుకోవచ్చు. మీరు ఈపీఎఫ్ఓ కార్యాలయాలు, యాజమాన్యాలను సంప్రదించాల్సిన అవసరం లేకుండానే మీ మొబైల్ ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు. ఈ మేరకు ఈపీఎఫ్ఓ అవకాశం కల్పిస్తోంది. ఎలా మార్చుకోవాలనేది ఇప్పుడు చూద్దాం.

EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పెద్ద ఊరట.. మీ వివరాలు తప్పుగా ఉంటే మొబైల్ ద్వారానే మార్చుకోవచ్చు.. సింపుల్ ప్రాసెస్ ఇదే..
Epfo
Venkatrao Lella
|

Updated on: Nov 11, 2026 | 4:16 PM

Share

పీఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ పెద్ద ఊరట కలిగించింది. ఈపీఎఫ్ఓ రికార్డుల్లోని తప్పులను ఇంటి నుంచే సరిదిద్దుకునే అవకాశం కల్పిస్తోంది. ఉద్యోగులు తమ పీఎఫ్ రికార్డుల్లో అన్ని వివరాలు సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. ఏమైనా తప్పులు ఉంటే పీఎఫ్ సేవలు పొందటంలో ఇబ్బందులు ఎదురవుతాయి. మీ పేరు, తండ్రి పేరు, డేట్ ఆఫ్ బర్త్, బ్యాంక్ అకౌంట్ వివరాలు వంటి వాటిల్లో పొరపాట్లు లేకుండా చేసుకోవాలి. దీని వల్ల మీరు పీఎఫ్ సేవలను సులువుగా పొందవచ్చు. వివరాల్లో ఏమైనా తప్పులు ఉంటే మీరు క్లెయిమ్ దాఖలు చేసుకోవడం, కేవైసీ అప్డేట్ చేసుకోవడంలో సమస్యలు ఎదురవుతాయి. వివరాల్లో ఏమైనా తప్పులు ఉంటే ఆన్‌లైన్ ద్వారానే సులభంగా మార్చుకోవచ్చు. ఇందుకోసం మీరు ఏ పీఎఫ్ కార్యాలయాన్ని సందర్శించాల్సిన అవసరం లేదు.

ఏయే వివరాలు అప్డేట్ చేసుకోవచ్చు..?

పీఎఫ్ పోర్టల్‌లో జాయింట్ డిక్లరేషన్ ద్వారా మీ వివరాలను అప్డేట్ చేసుకోవచ్చు. పేరు, డేట్ ఆఫ్ బర్త్, తండ్రి లేదా భర్త పేరు, లింగం, మొబైల్ నెంబర్, ఈమెయిల్ వంటివి మార్చుకోవచ్చు. మీరు మార్చుకున్న కొద్దసేపటికే వివరాలన్నీ అప్డేట్ అవుతాయి. ఇక డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ ఎగ్జిట్, ఇలా అన్నీ వివరాలు అప్డేట్ చేసుకోవచ్చు.

ఆన్‌లైన్ ద్వారా ఎలా అప్డేట్ చేసుకోవాలి..?

-యూఏఎన్ పోర్టల్‌కు వెళ్లండి

-మీ యూఏఎన్ నెంబర్, పాస్ వర్డ్, క్యాప్చా ఎంటర్ చేయండి

-అనంతరం సైన్ ఇన్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి

-మీ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి

-హోమ్ పేజీలో మేనేజ్ ఆప్షన్‌ ఎంచుకోండి

-ఆ కేటగిరిలో జాయింట్ డిక్లరేషన్ ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి

-ఆ తర్వాత మీ కంపెనీ పేరును ఎంచుకోవాలి

-మీరు ఏయే వివరాలు అయితే మార్చుకోవాలనుకుంటున్నారో వాటిని అప్డేట్ చేయాలి

-అనంతరం ప్రొసీడ్‌పై క్లిక్ చేసి మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీని నమోదు చేయండి

-ఆ తర్వాత మీ వివరాలు వెంటనే అప్డేట్ అవుతాయి

వివరాలు తప్పుగా ఉంటే ఏమవుతుంది..?

ఒక కంపెనీలో ఒకలా.. మరొక కంపెనీలో మరోలా వివరాలు ఉండటం వల్ల అకౌంట్ ట్రాన్స్‌ఫర్, క్లెయిమ్ చేసుకునే సమయంలో ఇబ్బందులు తలెత్తుతాయి. మీరు క్లెయిమ్ చేసుకోలేరు. దీంతో అన్ని కంపెనీల్లో ఒకేలా వివరాలు ఉంచుకోవడం అనేది చాలా ముఖ్యం. వివరాలు తప్పుగా ఉంటే జాయింట్ డిక్లరేషన్ ద్వారా మార్చుకోవాల్సి ఉంటుంది. గతంలో మార్చుకోవాలంటే యాజమాన్యాలను సంప్రదించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆన్‌లైన్ సేవలను తీసుకొచ్చారు.

Follow Us