AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పెద్ద ఊరట.. విత్ డ్రా రూల్స్‌లో భారీ మార్పులు.. కేంద్రం బిగ్ న్యూస్..

EPFO Rules: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు బిగ్ అప్టేట్. 8 కీలక మార్పులను అమల్లోకి తెచ్చింది. ఖాతాదారులకు పెద్ద ఊరట కల్గించేలా ఈ నిబంధనలు ఉన్నాయి. ముఖ్యంగా విత్ డ్రా రూల్స్‌లో కీలక మార్పులు చేసింది. ఇప్పటివరకు 75 శాతం మాత్రమే విత్ డ్రా చేసుకునే అవకాశం ఉండగా.. 90 శాతానికి మార్చింది.

పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పెద్ద ఊరట.. విత్ డ్రా రూల్స్‌లో భారీ మార్పులు.. కేంద్రం బిగ్ న్యూస్..
Epfo Rules
Venkatrao Lella
|

Updated on: Nov 21, 2026 | 7:41 PM

Share

ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఖాతాదారులకు ఊరట కల్గించేలా పలు నిబంధనలను పూర్తిగా మార్చింది. ఉద్యోగులకు పాక్షిక విత్ డ్రా, ఉద్యోగ విరమణ తర్వాత ఫైనల్ విత్ డ్రా నిబంధనలను మరింత సులభతరం చేసింది. వేగవంతంగా క్లెయిమ్ సెటిల్మెంట్‌, వాయిదా పద్దతిలో పీఎఫ్ విత్ డ్రా వంటి కొత్త 8 రకాల మార్పులు చేసింది. పీఎఫ్ ఖాతాదారులు త్వరగా నిధులు విత్ డ్రా చేసుకోవడం, వాయిదాల పద్దతిలో విత్ డ్రా చేసుకోవడం వల్ల వడ్డీ ప్రయోజనాలు అందుకునేందుకు ఈ రూల్స్ ఖాతాదారులకు ఉపయోగపడనున్నాయి. దేశవ్యాప్తంగా కోట్లాది మంది పీఎఫ్ ఖాతాదారులకు ఇవి ప్రయోజనాలను చేకూర్చనున్నాయి.

పీఎఫ్ విత్ డ్రా రూల్స్ మారాయ్..

పీఎఫ్ విత్ డ్రా రూల్స్‌లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. గతంలో తెచ్చిన నిబంధనల ప్రకారం మొత్తం బ్యాలెన్స్‌లో ఎంప్లాయర్, ఎంప్లాయి, వడ్డీ కలిపి కేవలం 75 శాతం మాత్రమే ఉద్యోగంలో ఉన్నప్పుడు పాక్షికంగా విత్ డ్రా చేసుకునేందుకు అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు విత్ డ్రా నిబంధనలను పూర్తిగా మార్చేశారు. ఇక నుంచి ఉద్యోగం చేస్తున్నప్పుడు తమ సొమ్ములో 90 శాతం వరకు ఎప్పుడైనా క్లెయిమ్ చేసుకోవచ్చు. కేవలం 10 శాతం మాత్రమే ఖాతాలో ఉంచితే సరిపోతుంది. గతంలో నిబంధనల ప్రకారం ఉద్యోగం మానేశాక 12 నెలల వరకు ఫైనల్ సెటిల్‌మెంట్ చేసుకుని నగదు పొందేందుకు అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు దీనిని రెండు నెలలకు పరిమితం చేశారు. అంటే ఉద్యోగం మానేశాక రెండు నెలల్లో మొత్తం సొమ్ము తీసుకోవచ్చు.

తప్పనిసరిగా రూ.1800 చెల్లించాల్సిందే..

ఉద్యోగి, యజమాని ఇద్దరూ పీఎఫ్ వాటా తప్పనిసరిగా రూ.1800 చొప్పున చెల్లించేలా నిబంధన తీసుకొచ్చారు. ప్రస్తుతం గరిష్ట వాటా 12 శాతం చొప్పున ఉండగా.. అవసరమైతే పెంచుకునేలా నిబంధన తెచ్చారు. అలాగే రూ.5 లక్షల వరకు ఉన్న క్లెయిమ్స్ 3 రోజుల్లోనే సెటిల్ చేసేలా ఆటోమేటెడ్ క్లెయిమ్ ప్రాసెస్ సిస్టం తీసుకొచ్చారు. మీ కేవైసీ, సర్వీస్ రికార్డులు కరెక్టుగా ఉంటే మూడు రోజుల్లోనే క్లెయిమ్ ప్రాసెస్ చేస్తారు. ఇక పెన్షన్ స్కీమ్ కోసం తప్పనిసరి పెన్షన్ కోతల జీతం పరిమితిని రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచారు. దీని వల్ల పదవీ విరమణ తర్వాత ఉద్యోగి ఎక్కువ సొమ్ము అందుతాయి. అలాగే సిస్టమాటిక్ విత్ డ్రా ప్లాన్ తీసుకొచ్చారు. దీని వల్ల పదవీ విరమణ తర్వాత విడతల వారీగా డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు. ఈ సదుపాయం వల్ల మిగిలిన సొమ్ముపై వడ్డీ అందుకుంటూనే ఉంటారు. ఈ మేరకు 8 రకాల మార్పులను ఈపీఎఫ్ఓ ఆమోదించడంతో పాటు వీటిని అమల్లోకి తీసుకొచ్చింది.

Follow Us
పీఎఫ్ విత్ డ్రా రూల్స్‌లో భారీ మార్పులు.. బిగ్ న్యూస్ ఇదే..
పీఎఫ్ విత్ డ్రా రూల్స్‌లో భారీ మార్పులు.. బిగ్ న్యూస్ ఇదే..
నేను సఫర్ కావడం చూసి నా కూతురు ఎఫెక్ట్ అయ్యింది..
నేను సఫర్ కావడం చూసి నా కూతురు ఎఫెక్ట్ అయ్యింది..
ఇందిరమ్మ బీమా పథకంపై ప్రభుత్వం కొత్త గైడ్‌లైన్స్.. వీరికి మాత్రమే
ఇందిరమ్మ బీమా పథకంపై ప్రభుత్వం కొత్త గైడ్‌లైన్స్.. వీరికి మాత్రమే
రవి ప్రదోష వ్రతం.. శివుడి అనుగ్రహం కోసం ఈ పూజా విధానం పాటించండి!
రవి ప్రదోష వ్రతం.. శివుడి అనుగ్రహం కోసం ఈ పూజా విధానం పాటించండి!
51 ఏళ్ల వయసులో ఒంటరిగా అలనాటి గ్లామర్ హీరోయిన్..
51 ఏళ్ల వయసులో ఒంటరిగా అలనాటి గ్లామర్ హీరోయిన్..
ప్రేమిస్తున్నా.. పెళ్లి చేసుకుంటా అంటూ ఆమెను నమ్మించాడు.. చివరకు
ప్రేమిస్తున్నా.. పెళ్లి చేసుకుంటా అంటూ ఆమెను నమ్మించాడు.. చివరకు
సినిమా స్టైల్‌లో గోల్డ్ స్మగ్లింగ్.. మాస్టర్ ప్లాన్ బట్టబయలు!
సినిమా స్టైల్‌లో గోల్డ్ స్మగ్లింగ్.. మాస్టర్ ప్లాన్ బట్టబయలు!
జొన్నపిండితో కరకరలాడే మురుకులు.. ఆరోగ్యానికి కూడా రారాజు
జొన్నపిండితో కరకరలాడే మురుకులు.. ఆరోగ్యానికి కూడా రారాజు
పిల్లలకైనా.. పెద్దలకైనా సూపర్ ఫుడ్.. కుక్కర్‌లో నిమిషాల్లోనే
పిల్లలకైనా.. పెద్దలకైనా సూపర్ ఫుడ్.. కుక్కర్‌లో నిమిషాల్లోనే
Optical Illusion: ఈ అరటి కాయల మధ్యలో ఉన్న పామును చూశారా ??
Optical Illusion: ఈ అరటి కాయల మధ్యలో ఉన్న పామును చూశారా ??