AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: మీ జీతం నుంచి పీఎఫ్ కట్ అయినా పెన్షన్ రాదు.. ఇలాంటి సందర్భాల్లో కట్.. ఈ అర్హతలు ఉంటేనే..

ఈపీఎఫ్ఓలో ఉన్నవారు పెన్షన్ పొందాలంటే కొన్ని అర్హతా ప్రమాణాలను పూర్తి చేసి ఉండాలి. అలాంటి సందర్భంలోనే రిటైర్మెంట్ తర్వాత నెలవారీ పెన్షన్ పొందే అవకాశముంటుంది. లేకపోతే మీరు ప్రతీనెలా పెన్షన్ పొందేందుకు అనర్హులు అవుతారు. ఏయే అర్హతలు సాధించాలనేది ఇప్పుడు చూద్దాం.

EPFO: మీ జీతం నుంచి పీఎఫ్ కట్ అయినా పెన్షన్ రాదు.. ఇలాంటి సందర్భాల్లో కట్.. ఈ అర్హతలు ఉంటేనే..
Epfo
Venkatrao Lella
|

Updated on: Nov 14, 2026 | 7:23 PM

Share

పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి ఈపీఎఫ్ఓ పెన్షన్ సౌకర్యం కూడా కల్పిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే ప్రైవేట్ సంస్ధల్లో పనిచేసేవారికి కూడా రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ అందించేందుకు ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చింది. ఈపీఎఫ్ పథకంతో ఇది అనుసంధానమై ఉంటుంది. ప్రతీ నెలా యాజమాన్యం చెల్లించే పీఎఫ్ కాంట్రిబ్యూషన్‌లో కొంతమొత్తం పెన్షన్ ఫండ్‌కు వెళుతుంది. రిటైర్మెంట్ తర్వాత ప్రతీ నెలా పెన్షన్ రూపంలో ఈ అమౌంట్‌ను అందిస్తారు. ఈపీఎఫ్‌వో నుంచి పెన్షన్ పొందాలంటే కొన్ని అర్హతలు మీరు సాధించాల్సి ఉంటుంది. ఇందుకోసం భవిష్య నిధి సంస్థ కొన్ని నిబంధనలు రూపొందించింది. మీకు పీఎఫ్ అకౌంట్ ఉంటే ఈ రూల్స్ తెలుసుకోవడం ముఖ్యం.

వీరికి పెన్షన్ ప్రయోజనాలు ఉండవ్

మీరు సెప్టెంబర్ 1,2014 తర్వాత కొత్తగా పీఎఫ్‌లో చేరి ఉంటే ప్రారంభ బేసిక్ శాలరీ రూ.25 వేలు కంటే తక్కువగా ఉండాలి. రూ.25 వేల కంటే ఎక్కువగా ఉంటే పెన్షన్ పథకం వర్తించదు. ఇలాంటి సమయంలో కేవలం పీఎఫ్ వడ్డీని మాత్రమే పొందే అవకాశముంటుంది. కేంద్రం ఇటీవల పీఎఫ్ వేతన పరిమితిని రూ.25 వేలకు పెంచింది. దీంతో ఆలోపు జీతం ఉన్నవారికి పీఎఫ్, పెన్షన్ ప్రయోజనాలు లభిస్తాయి.

పెన్షన్ పొందటం ఎలా..?

మీ జీతం నుంచి యాజమాన్యం ప్రతీ నెలా కట్ చేసే 12 శాతం ఎంప్లాయి కేటగిరీలో జమ అయితే.. ఎంప్లాయర్ జమ చేసే 12 శాతంలో 8.33 శాతం పెన్షన్ ఫండ్‌లో జమ అవుతుంది. వీటినే రిటైర్మెంట్ తర్వాత ప్రతీ నెలా పెన్షన్ రూపంలో అందిస్తారు. మీరు ప్రతీ నెలా పెన్షన్ రూపంలో పొందాలంటే ఖచ్చితంగా ఈపీఎఫ్ఓలో 10 ఏళ్ల సర్వీస్ పీరియడ్ పూర్తి చేసి ఉండాలి. 9 సంవత్సరాల 6 నెలలు పూర్తి చేసినా నెలవారీ పెన్షర్ రూపంలో ఇస్తారు. పదేళ్ల కంటే తక్కువ ఉంటే నెలవారీ పెన్షన్ పొందేందుకు అనర్హులు అవుతారు. ఇలాంటి సమయంలో మీరు ఒకేసారి పెన్షన్ అమౌంట్ ఫారం 10సీ సమర్పించడం ద్వారా విత్ డ్రా చేసుకోవచ్చు. పదేళ్లు పూర్తిచేసి 58 ఏళ్లు నిండినవారు ఫారం 10డీ సమర్పించడం ద్వారా నెలవారీ పెన్షన్ పొందవచ్చు.

ఎన్నేళ్ల తర్వాత పెన్షన్‌కు అర్హులు

58 ఏళ్ల తర్వాత మీరు పెన్షన్ పొందవచ్చు. ఒకవేళ 50 ఏళ్ల తర్వాత పొందాలనుకుంటే పెన్షన్ అమౌంట్‌లో కాస్త తగ్గిస్తారు. 58 ఏళ్ల తర్వాత అయితే పూర్తి పెన్షన్ అందుతుంది. 58 ఏళ్ల తర్వాత మీ పెన్షన్ అకౌంట్‌లో నగదు జమ చేయడం ఆగిపోతుంది. అప్పటినుంచి మీరు పెన్షన్ పొందవచ్చు. భవిష్యత్తులో ఎలాంటి అవాంతరాలు రాకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు మీ పెన్షస్ స్టేటస్ తెలుసుకోవడం ముఖ్యం. పెన్షన్ ఫండ్‌లో డబ్బులు జమ అవుతున్నాయా.. లేదా అనేది తెలుసుకోండి.

Follow Us