AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఇకపై ప్రతీ నెలా రూ.3 వేలు..! ఈ నెలలోనే శుభవార్త..!

ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం తీసుకునే యోచనలో ఉంది. ఈ నెలలో పెన్షన్ పెంపుపై తుది నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. కనీస పెన్షన్‌ ప్రస్తుతం రూ.వెయ్యిగా ఉండగా.. దీనిని పెంచాలనే డిమాండ్లు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. దీంతో ఇప్పుడు ఎట్టకేలకు కేంద్రం పెంచేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.

EPFO: పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఇకపై ప్రతీ నెలా రూ.3 వేలు..! ఈ నెలలోనే శుభవార్త..!
Epfo Pension
Venkatrao Lella
|

Updated on: Nov 10, 2026 | 3:14 PM

Share

ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం త్వరలో శుభవార్త అందించేందుకు సిద్దమవుతోంది. ఇప్పటికే పీఎఫ్‌కు సంబంధించి కేంద్రం ఇటీవల అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఎన్నో ఏళ్లుగా రూ.15 వేలుగా కొనసాగుతున్న పీఎఫ్ వేతన పరిమితిని ఇటీవల రూ.25 వేలకు పెంచింది. దీని వల్ల రూ.25 వేలలోపు జీతం ఉన్నవారికి కూడా పీఎఫ్ కవరేజీ లభించనుంది. అలాగే పీఎఫ్ ఆన్‌లైన్ సేవలను మరింత మోరుగుపర్చడంతో పాటు నవంబర్ 1వ తేదీ నుంచి కొత్తగా పీఎఫ్ వాట్సప్ సేవలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా వాట్సప్‌లోనే పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం, పాస్ బుక్ డౌన్‌లోడ్, చివరి ఐదు లావాదేవీలు వంటికి పొందవచ్చు. దీంతో పాటు వచ్చే ఏడాది నుంచి యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా చేసుకునే సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకునే యోచనలో ఉంది.

పెన్షన్ పెంపుపై ఈ నెలలో నిర్ణయం..!

ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్(EPS) కింద పెన్షన్ సౌకర్యం కేంద్రం కల్పిస్తోంది. ఎప్పటినుంచో ఈ పథకం అమలవుతోండగా.. దీని వల్ల పీఎఫ్ అకౌంట్ ఉన్నవారు రిటైర్మెంట్ తర్వాత ప్రతీనెలా పొందవచ్చు. ప్రస్తుతం కనీస పెన్షన్ రూ.వెయ్యిగా ఉంది. ఎన్నో సంవత్సరాలుగా ఇదే పరిమితి కొనసాగుతోంది. అయితే ప్రస్తుతం ఖర్చులు పెరిగిపోవడం, ధరలు కూడా ఎగబాకుతుండటం, వైద్య ఖర్చులు పెరుగుతున్న క్రమంలో పెన్షన్ పెంచాలనే డిమాండ్లు ఎప్పటినుంచో ఉద్యోగ సంఘాల నుంచి వినిపిస్తున్నాయి. ఈ మేరకు పలుమార్లు ఉద్యోగ సంఘాలు ఆందోళనలు కూడా చేపట్టాయి. కేంద్ర కార్మికశాఖ అధికారులను కలిసి వినతిపత్రం కూడా అందించారు. ఈ క్రమంలో కేంద్రం కూడా పెన్షన్ పెంపుపై సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. ఈ నెలలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది.

పెన్షన్ రూ.3 వేలకు పెంపు..!

ఈ నెల 19వ తేదీన ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రత్యేక ఎజెండాగా పెన్షన్ అంశాన్ని తీసుకోనున్నారు. అనంతరం ఆ నిర్ణయంపై చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. పెన్షన్‌ను రూ.3 వేలకు పెంచే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతానికి 81.48 లక్షల మంది పెన్షన్‌ పథకంలో ఉన్నారు. వీరిలో 73.55 లక్షల మంది రూ.3 వేలలోపు పింఛన్ అందుకుంటున్నారు. 2014లో కనీస పెన్షన్‌ను రూ.వెయ్యికి పెంచారు. ఆ తర్వాత ఇప్పటివరకు ఎలాంటి మార్పులు చేయలేదు. ఇటీవల వేతన పరిమితిని రూ.25 వేలకు పెంచిన క్రమంలో పెన్షన్ పరిమితిని కూడా రూ.3 వేలకు పెంచే యోచనలో ఈపీఎఫ్ఓ ఉంది.

Follow Us