AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold: అబ్బా.. బంగారం ధరలు పడిపోతున్న వేళ ఇదేం ట్విస్ట్.. మళ్లీ ఈ రూపంలో కష్టాలేనా..

బంగారం తాకట్టు పెట్టి రుణం తీసుకోవాలనుకుంటున్నారా..? అయితే ఇకపై మీకు ఎక్కువ నిధులు లోన్ రూపంలో అందవు. బంగారం ధరలు పతనమవుతున్న క్రమంలో రుణాన్ని తగ్గించేందుకు బ్యాంకులు సిద్దమవుతున్నాయి. దీంతో ప్రజల్లో గోల్డ్ రుణాలపై కొత్త ఆందోళన వ్యక్తమవుతోంది. రాబోయే రోజుల్లో గోల్డ్ లోన్లు సంబంధించి కీలక మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది.

Gold: అబ్బా.. బంగారం ధరలు పడిపోతున్న వేళ ఇదేం ట్విస్ట్.. మళ్లీ ఈ రూపంలో కష్టాలేనా..
Gold Loans
Venkatrao Lella
|

Updated on: Nov 18, 2026 | 2:38 PM

Share

బంగారం రుణం తీసుకునేవారికి బ్యాడ్‌న్యూస్. పతనమవుతున్న ధరలతో బంగారంపై తక్కువ రుణం అందనుంది. భారీగా పతనమవుతున్న బంగారం ధరలతో బ్యాంకులు ఆందోళన చెందుతున్నాయి. తాకట్టు కుదువలపై నిఘా పెంచేందుకు ఫైనాన్స్ సంస్థల రెడీ అవుతున్నాయి. దీంతో ఇకపై బంగారు ఆభరణాలపై తక్కువ రుణమే వచ్చే ఛాన్స్ ఉంటుందని తెలుస్తోంది. దీని వల్ల దేశవ్యాప్తంగా రూ.23.3 లక్షల కోట్ల గోల్డ్ లోన్ మార్కెట్ ప్రమాదంలో పడింది. దేశవ్యాప్తంగా పసిడి ధరలు భారీగా పతనమవుతుండటంతో బంగారం రుణాలపై ప్రజల్లో కొత్త ఆందోళన మొదలైంది. వైద్యం, చదువులు, వ్యాపార అవసరాల కోసం కోట్లాది మంది సామాన్యులు పెట్టిన కుదువ ఆభరణాల భద్రతపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. సీఆర్ఐఎఫ్ నవంబర్ 2026 నివేదిక ప్రకారం సెప్టెంబర్ నాటికి ఈ రుణాల విలువ ఏకంగా రూ.23.3 లక్షల కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే సమయానికి రూ.13.4 లక్షల కోట్లుగా ఉన్న ఈ మార్కెట్ అసాధారణ వృద్ధి నమోదు చేసింది. ట్రాన్స్‌యూనియన్ సిబిల్ నివేదిక కూడా ఆగస్టు నాటికి 5.5 కోట్ల మంది ఖాతాదారులతో రూ.22.5 లక్షల కోట్ల మేర రుణాలు ఉన్నట్లు అంచనా వేసింది.

బంగారం ధరలు తగ్గడంతో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలకు భద్రతా పరమైన మార్జిన్ భారీగా తగ్గిపోతోంది.  ఖాతాదారులు డిఫాల్ట్ అయితే ఆభరణాలను వేలం వేసినా బకాయిలు వసూలు కాని పరిస్థితి తలెత్తే ప్రమాదం ఉంది. దీంతో భవిష్యత్తులో లోన్-టు-వాల్యూ రేషియో తగ్గించి, ఖాతాదారుల చెల్లింపు సామర్థ్యంపై బ్యాంకులు మరింత నిఘా పెట్టే అవకాశం ఉంది. రుణం చెల్లించకపోతే వేలం వేసినా బకాయిలు రాని ఆర్థిక ప్రమాదం పొంచివుంది. దీంతో ఇకపై బ్యాంకులు తక్కువ రుణం ఇస్తూ నిబంధనలు కఠినతరం చేయాలని భావిస్తున్నాయి.

ఉదాహరణకు రూ.10 లక్షల విలువైన 100 గ్రాముల బంగారాన్ని తాకట్టు పెట్టి రూ.6 లక్షల రుణం తీసుకుంటే.. ఇప్పుడు ఆ బంగారం మార్కెట్ విలువ రూ.8 లక్షలకు పడిపోయే ప్రమాదం ఉంది. ఖాతాదారులు రుణం కట్టకుండా డిఫాల్ట్ అయితే సంస్థలు ఆభరణాలను వేలం వేయాల్సి వస్తుంది. వేలంలో వచ్చిన మొత్తం బకాయిల కంటే తక్కువైతే బ్యాంకులు భారీ ఆర్థిక లోటును ఎదుర్కోవాల్సి వస్తుంది. పసిడి ధరలు తగ్గగానే బ్యాంకులు వెంటనే రుణాలను తిరిగి చెల్లించాలని డిమాండ్ చేయకపోయినా.. డిఫాల్టర్ల వల్ల వ్యవస్థాగత సమస్యలు వస్తాయి. ఈ పరిణామాలతో కుదువ పెట్టే వారికి ఇకపై గతంలో కంటే తక్కువ రుణం వచ్చే అవకాశం ఉంది. బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు తాకట్టు బంగారం విలువ, లోన్-టు-వాల్యూ రేషియోపై మరింత నిఘా పెంచనున్నాయి. ఖాతాదారుల చెల్లింపు సామర్థ్యంపైనే భవిష్యత్తులో ఈ రంగ మనుగడ ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.

Follow Us