AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నవంబర్‌లో కొత్త ఇంట్లోకి వెళ్లాలనుకుంటున్నారా? శుభ తేదీలు, ముహూర్తాలు ఇవే!

Gruhapravesam Muhurtham 2026 Telugu: 2026 నవంబర్‌లో కొత్త ఇంట్లోకి ప్రవేశించాలనుకుంటున్నారా? చాతుర్మాసం ముగిసిన తర్వాత గృహప్రవేశానికి ఉన్న శుభ తేదీలు, ముహూర్తాలు ఏమిటి? గృహప్రవేశ సమయంలో పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు, పూజా విధానం గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

నవంబర్‌లో కొత్త ఇంట్లోకి వెళ్లాలనుకుంటున్నారా? శుభ తేదీలు, ముహూర్తాలు ఇవే!
Gruhapravesam Muhurtham 2026 Telugu
Rajashekher G
|

Updated on: Nov 18, 2026 | 2:50 PM

Share

Gruhapravesam Muhurtham 2026 Telugu: కొత్త ఇల్లు కొనుగోలు చేసినా, సొంతంగా నిర్మించుకున్నా ప్రతి ఒక్కరూ గృహప్రవేశం కోసం ఎదురుచూస్తుంటారు. జీవితంలో ఎంతో ప్రత్యేకమైన ఈ వేడుకను శుభ ముహూర్తంలో నిర్వహించాలని హిందూ సంప్రదాయం సూచిస్తుంది. మంచి తిథి, నక్షత్రం, సమయం చూసి కొత్త ఇంట్లోకి అడుగుపెడితే సుఖసంతోషాలు, ఐశ్వర్యం, శాంతి, సానుకూల శక్తి లభిస్తాయని భక్తుల నమ్మకం. అందుకే గృహప్రవేశానికి ముహూర్తం నిర్ణయించేటప్పుడు పంచాంగానికి ప్రాధాన్యత ఇస్తారు.

హిందూ సంప్రదాయం ప్రకారం చాతుర్మాసంలో వివాహాలు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలు నిర్వహించరు. ఈ సమయంలో శ్రీమహావిష్ణువు యోగనిద్రలో ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. 2026లో నవంబర్ 20న దేవుత్థాన ఏకాదశితో చాతుర్మాసం ముగుస్తుంది. అనంతరం విష్ణుమూర్తి యోగనిద్ర నుంచి మేల్కొన్నారని భావించి శుభకార్యాలు ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో నవంబర్ 2026లో గృహప్రవేశానికి అనుకూలమైన తేదీలు, సమయాలు ఏవో తెలుసుకుందాం.

నవంబర్ 2026 గృహప్రవేశానికి శుభ ముహూర్తాలు

చాతుర్మాసం ముగిసిన తర్వాత నవంబర్ నెలలో గృహప్రవేశానికి నాలుగు అనుకూలమైన తేదీలు ఉన్నాయి. అవి:

ఇవి కూడా చదవండి
  1. నవంబర్ 20, 2026 (శుక్రవారం)- నక్షత్రం: ఉత్తరాభాద్రపద- శుభ సమయం: సూర్యోదయం నుంచి మధ్యాహ్నం 2:24 గంటల వరకు.
  2. నవంబర్ 21, 2026 (శనివారం)- నక్షత్రం: రేవతి- శుభ సమయం: రాహుకాలాన్ని మినహాయించి పగలు, రాత్రి అంతా.
  3. నవంబర్ 25, 2026 (బుధవారం)- నక్షత్రం: రోహిణి / మృగశిర- శుభ సమయం: సాయంత్రం 4:50 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6:52 గంటల వరకు.
  4. నవంబర్ 26, 2026 (గురువారం)- నక్షత్రం: మృగశిర- శుభ సమయాలు: ఉదయం 8:11 నుంచి 9:30 వరకు, ఉదయం 10:49 నుంచి మధ్యాహ్నం 1:27 వరకు, మధ్యాహ్నం 2:46 నుంచి సాయంత్రం 5:46 గంటల వరకు.

గృహప్రవేశం సమయంలో పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు

కొత్త ఇంట్లోకి అడుగుపెట్టే సమయంలో కొన్ని సంప్రదాయాలను పాటించడం శుభప్రదంగా భావిస్తారు.

  • గృహప్రవేశానికి ఒక రోజు ముందే ఇంటిని పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. సముద్రపు ఉప్పు కలిపిన నీటితో ఇల్లు తుడవడం శుభప్రదమని నమ్ముతారు.
  • ఇంటిలోని అన్ని గదులతో పాటు మూలల్లో కూడా గంగాజలం చల్లాలి.
  • గృహప్రవేశానికి ముందు గణపతి పూజ, వాస్తు పూజ, వాస్తు శాంతి, హోమం నిర్వహించాలి.
  • గృహప్రవేశ ముహూర్తం నిర్ణయించేటప్పుడు రాహుకాలం వంటి అశుభ సమయాలను తప్పనిసరిగా నివారించాలి.
  • ఇంటి ఈశాన్య మూలలో వాస్తు పూజ, హోమం నిర్వహించడం శుభప్రదంగా భావిస్తారు.
  • గృహప్రవేశ సమయంలో భర్త చేతిలో గౌరీ, గణేశుడి విగ్రహాలను పట్టుకుని ముందుగా ఇంట్లోకి ప్రవేశించాలి.
  • గృహిణి కొబ్బరికాయ, మామిడి ఆకులతో నిండిన నీటి కలశాన్ని తీసుకుని ఇంట్లోకి అడుగుపెట్టాలి.
  • కొన్ని సంప్రదాయాల ప్రకారం భర్త కుడి పాదంతో, భార్య ఎడమ పాదంతో లేదా ఇద్దరూ కుడి పాదంతో ముందుగా ఇంట్లోకి ప్రవేశిస్తారు.

(Disclaimer: గృహప్రవేశానికి సంబంధించిన ముహూర్తాలు ప్రాంతీయ పంచాంగం, తిథి, నక్షత్రం, లగ్నం ఆధారంగా మారవచ్చు. కాబట్టి మీ ప్రాంతంలోని పురోహితులను సంప్రదించి వ్యక్తిగత జాతకం, స్థానిక సమయాలకు అనుగుణంగా తుది ముహూర్తాన్ని నిర్ణయించుకోవడం మంచిది.)

Follow Us