Samantha : డెలివరీ డేట్ పై సమంత క్రేజీ పోస్ట్.. భర్తతో కలిసి ప్రత్యేక పూజలు.. ఫోటోస్ వైరల్..
టాలీవుడ్ హీరోయిన్ సమంత త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన ప్రెగ్నెన్సీ గురించి పోస్టులు పెడుతూ అభిమానులతో టచ్ లోనే ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా తన డెలివరీ డేట్ పై ఆసక్తికర పోస్ట్ చేసింది. అలాగే తన భర్తతో కలిసి ప్రత్యేక పూజలు చేసింది.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం తన వ్యక్తిగత జీవితంలో అత్యంత సంతోషకరమైన కాలాన్ని ఆస్వాదిస్తున్నారు. త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్న ఆమె, ఇప్పుడు ప్రెగ్నెన్సీ చివరి దశ అనగా తొమ్మిదో నెలలో ఉన్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సమంత, తాజాగా తన డెలివరీ సమయం గురించి ఒక సరదా మీమ్‌ను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతుండటంతో అభిమానులు తెగ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో సమంత ఒక ఫన్నీ మీమ్‌ను షేర్ చేశారు. ఆ వీడియోలో ఒక గర్భిణీ మహిళ ఎంతో ఇష్టంగా చిరుతిళ్లు తింటూ కనిపిస్తుండగా.. “ఈ వారం మీ ప్రణాళికలు ఏమిటి?” అనే టెక్స్ట్ ఉంటుంది. దానికి సోమవారం నుంచి ఆదివారం వరకు సమాధానంగా “బహుశా ఒక బాబీకి జన్మనివ్వడం” అని రాసి ఉంటుంది. తన ప్రెగ్నెన్సీ చివరి దశలో ఎదురవుతున్న అనుభవాలను, ఆ ఉత్సాహాన్ని ఈ సరదా మీమ్ ద్వారా ఆమె అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది.
ఎక్కువ మంది చదివినవి : Gulabi Movie: ఒక్క పాటతో స్టార్ డమ్.. గులాబీ సినిమాను మిస్సైన హీరోయిన్.. ఎవరంటే..
సమంత ప్రెగ్నెన్సీ విషయాన్ని మా ఇంటి బంగారం మూవీ సక్సెస్ మీట్ వేదికగా అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నుంచి ఆమె తన ప్రెగ్నెన్సీ జర్నీకి సంబంధించిన కొన్ని విశేషాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా తొమ్మిదో నెలలోనూ ఫిట్‌నెస్ కోసం వర్కౌట్లు, వెయిటెడ్ స్క్వాట్స్ చేయడం వంటి వీడియోలు నెటిజన్లను ఆశ్చర్యపరిచాయి. ప్రెగ్నెన్సీ సమయంలో శారీరకంగా చురుగ్గా ఉండాల్సిన ప్రాముఖ్యతను ఆమె తన పోస్ట్ ద్వారా తెలియజేశారు.
ఎక్కువ మంది చదివినవి : Megastar Chiranjeevi: చిరంజీవికి భార్యగా, చెల్లిగా నటించిన ఏకైక హీరోయిన్.. 20 ఏళ్లుగా తగ్గని స్టార్ డమ్..
సమంత పోస్టులు..
View this post on Instagram
ఇదిలా ఉంటే.. తాజాగా తన భర్త రాజ్ నిడిమోరు, కుటుంబసభ్యులతో కలిసి ఇంట్లోనే ఘనంగా పూజా కార్యక్రమం కూడా నిర్వహించారు. ఈ వేడుకకు సంబంధించిన కొన్ని ఫొటోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. ఇందులో సమంత ఎరుపు రంగు కుర్తా సెట్‌ను ధరించి ఎంతో ప్రశాంతంగా కనిపిస్తున్నారు. ఈ దుస్తులు ఓగాన్ బ్రాండ్‌కు చెందినవి. కాగా ఆ సూట్ ధర రూ.రూ. 48,562 ఉన్నట్లు సమాచారం. ఈ దుస్తులను కాటన్ సిల్క్‌తో తయారు చేశారు. దీని అంచు బ్రోకేడ్ టిష్యూతో రూపొందించబడింది.
ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: ఏం ట్విస్టులు రా బాబూ.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ట్రెండింగ్‌లో నంబర్ వన్..
సమంత పోస్టులు..

Samantha
View this post on Instagram
View this post on Instagram
ఎక్కువ మంది చదివినవి : ఏముంటది భయ్యా ఈ సాంగ్.. చిరంజీవి, విజయశాంతి కాంబో.. థియేటర్లను ఓ ఊపు ఊపేసింది..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
