ఏముంటది భయ్యా ఈ సాంగ్.. చిరంజీవి, విజయశాంతి కాంబో.. థియేటర్లను ఓ ఊపు ఊపేసింది..
మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఒకప్పుడు బాస్ సినిమాలంటే థియేటర్లు హౌస్ ఫుల్ అవ్వాల్సిందే. సినిమాలే కాదు.. అన్నయ్య పాటలకు సైతం సెపరేట్ ఫాలోయింగ్ ఉంటుంది. ఆయన నటించిన ఎన్నో ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ ఇప్పటికీ ఊర్రూతలూగిస్తాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న పాట మీ అందరికి తెలిసే ఉంటుంది.

మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీగా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఫుల్ జోష్ మీదున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం విశ్వంభర, కాకా చిత్రాలతో బిజీగా ఉన్నారు చిరు. అయితే దశాబ్దాల సినీ ప్రయాణంలో చిరు నటించిన ఎన్నో ఎవర్ గ్రీన్ హిట్స్ ఉన్నాయి. అలాగే ఆయన నటించిన అనేక చిత్రాల్లోని సూపర్ హిట్ సాంగ్స్ ఇప్పటికీ యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న పాట మీ అందరికీ తెలిసే ఉంటుంది. అదే 1990లో విడుదలై ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘కొండవీటి దొంగ’లోని సూపర్ హిట్ సాంగ్ ‘చమకు చమకు చాం..’.మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కాంబినేషన్‌లో ఎన్నో మ్యూజికల్ హిట్స్ వచ్చాయి. కానీ ‘కొండవీటి దొంగ’ సినిమాలో ఈ ఇద్దరు కలిసి వేసిన స్టెప్పులు మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. మ్యాస్ట్రో ఇళయరాజా అందించిన అద్భుతమైన ట్యూన్‌కు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్రల గానం తోడవడంతో ఈ పాట ఒక రేంజ్‌లో హిట్ అయ్యింది.
ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: ఏం ట్విస్టులు రా బాబూ.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ట్రెండింగ్‌లో నంబర్ వన్..
ముఖ్యంగా పాటలో వచ్చే మాస్ బీట్‌కు చిరంజీవి గ్రేస్‌ఫుల్ మూవ్‌మెంట్స్, విజయశాంతి ఎనర్జీ తోడై థియేటర్లలో అభిమానులతో ఈలలు వేయించాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఈ సాంగ్ వచ్చినప్పుడల్లా పేపర్లు విసురుతూ, డ్యాన్సులు చేస్తూ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేసేవారు. ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడంలో ఈ పాట కూడా కీలక పాత్ర పోషించింది.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : నన్ను అహాంకారి అనుకున్నారు.. 1500 సినిమాలు చేసినా ఏమీ మిగల్లేదు.. సీనియర్ నటుడు..
సినిమా విడుదలై మూడు దశాబ్దాలు దాటినా, ఇప్పటికీ టీవీల్లో కానీ, యూట్యూబ్‌లో కానీ ‘చమకు చమకు చాం..’ సాంగ్ వస్తే చాలు కళ్లు అటువైపు తిరగాల్సిందే. యూట్యూబ్‌లో ఈ పాట వీడియోకు మిలియన్ల కొద్దీ వ్యూస్ రావడమే కాకుండా, నేటి తరం యువత సైతం రీల్స్ చేస్తూ ఈ పాటకు తమ క్రేజ్‌ను చూపిస్తున్నారు. నిజంగానే చిరు-విజయశాంతి కాంబోలో వచ్చిన ఈ ఆల్-టైమ్ ఎవర్ గ్రీన్ సాంగ్ ఎప్పటికీ ఒక మధుర జ్ఞాపకమే!
ఎక్కువ మంది చదివినవి : Megastar Chiranjeevi: చిరంజీవికి భార్యగా, చెల్లిగా నటించిన ఏకైక హీరోయిన్.. 20 ఏళ్లుగా తగ్గని స్టార్ డమ్..
చమకు చమకు చాం
ఎక్కువ మంది చదివినవి : Gulabi Movie: ఒక్క పాటతో స్టార్ డమ్.. గులాబీ సినిమాను మిస్సైన హీరోయిన్.. ఎవరంటే..
