AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : నన్ను అహాంకారి అనుకున్నారు.. 1500 సినిమాలు చేసినా ఏమీ మిగల్లేదు.. సీనియర్ నటుడు..

సీనియర్ నటుడు ప్రసాద్ బాబు తన సినీ ప్రస్థానం, పేరు మార్పు వెనుక ఉన్న కథను వివరించారు. పాత్రల ఎంపికలో తన పద్ధతులకు ప్రాధాన్యతనిస్తానని, సినిమాల ద్వారా సంపాదించలేకపోయినా, సీరియల్స్‌తో ఇల్లు కట్టుకోగలిగానని తెలిపారు. సంపదపై తన విభిన్నమైన ఆలోచనలు, నిరాడంబర జీవనశైలిని పంచుకున్నారు. అలాగే తన సినీ ప్రయాణం గురించి చెప్పుకొచ్చారు.

Tollywood : నన్ను అహాంకారి అనుకున్నారు.. 1500 సినిమాలు చేసినా ఏమీ మిగల్లేదు.. సీనియర్ నటుడు..
Prasad Babu
Rajitha Chanti
|

Updated on: Nov 12, 2026 | 12:33 PM

Share

టాలీవుడ్ సీనియర్ నటుడు ప్రసాద్ బాబు గురించి పరిచయం అక్కర్లేదు. వెండితెరపై, బుల్లితెరపై తనదైన ముద్ర వేసుకున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ సినీ ప్రస్థానం, వ్యక్తిగత జీవితం, సంపదపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రసాద్ బాబు తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వివరించారు. ఆయన అసలు పేరు బాబు ప్రసాద్. మొదట్లో కొన్ని సినిమాలలో గీత ప్రసాద్ అని కూడా పిలిచారట. అయితే, దర్శకుడు కె. బాలచందర్ తన అంతరేణ కథ చిత్రం సమయంలో “ప్రసాద్, నీ పేరును ప్రసాద్ బాబుగా మారుస్తాను, నీకు అభ్యంతరం లేదా?” అని అడిగినప్పుడు, ఆయన తన ఇష్టపూర్వక సమ్మతిని తెలియజేశారు. అప్పటి నుండి ప్రసాద్ బాబుగా ఆయన పేరు స్థిరపడింది. నటుడిగా తనకు కొన్ని నిర్దిష్టమైన నియమాలు, పద్ధతులు ఉండేవని ప్రసాద్ బాబు తెలిపారు. నచ్చిన పాత్రలను, కథలను మాత్రమే ఎంచుకునేవాడినని, దీని వల్ల సుమారు 500 నుండి 1000 సినిమాలను వదులుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. “నా పద్ధతులకి నచ్చితేనే ఆ సినిమా చేసేవాడిని. ఒకవేళ డైరెక్టర్ నచ్చకపోవచ్చు, ప్రొడ్యూసర్ నచ్చకపోవచ్చు. ఆ కంపెనీ బ్యానర్ నచ్చకపోవచ్చు అంటే కూడా చేసేవాడిని కాదు, తప్పుకునేవాడిని,” అని ఆయన స్పష్టం చేశారు. ఈ సూత్రం ఇప్పటికీ పాటిస్తున్నానని, సీరియల్స్ విషయంలో కూడా తన షరతులు వర్తిస్తాయని అన్నారు.

ఆర్థిక అంశాలపై ప్రసాద్ బాబు ఆలోచనలు చాలా భిన్నమైనవి. సినిమాలలో నటించినప్పుడు తను పెద్దగా ఏమీ సంపాదించలేదని, తన భోజనం, నిర్వహణకు సరిపోయిందని చెప్పారు. “100 రూపాయలకి కూడా యాక్ట్ చేసిన రోజులు ఉన్నాయి. లక్ష రూపాయలకి యాక్ట్ చేసిన రోజులు ఉన్నాయి. కానీ ఏం మిగలలేదు” అని ఆయన అన్నారు. ఆశ్చర్యకరంగా, సినిమా రంగం నుండి తప్పుకొని సీరియల్స్‌లోకి అడుగుపెట్టిన తర్వాతే ఆర్థిక స్థిరత్వం లభించిందని, 65వ ఏట ఇల్లు కట్టుకోగలిగానని వెల్లడించారు. తనతో పాటు నటులుగా ఉన్న కృష్ణ , మురళీ మోహన్, శోభన్ బాబువంటి వారు ఆస్తులు కూడబెట్టుకున్నా, తనకు మాత్రం అలాంటి ఆలోచనలేవీ రాలేదని తెలిపారు. పెద్ద పెద్ద బంగళాలు, కార్లు, స్థలాలు, షేర్ మార్కెట్లు, బ్యాంక్ బ్యాలెన్స్‌లు అవసరం లేదని, ఇవన్నీ కేవలం “మాయ” అని అన్నారు. పది లక్షలతో కూడా సంతోషంగా జీవించవచ్చని, కోటి రూపాయలు అంతకన్నా ఎక్కువ సంపాదించినా వాటిని ఏం చేసుకుంటారని అన్నారు. “ఎవరు బతుకుతున్నారు ఆ ఇళ్ళల్లో? గుర్కాలు, మేనేజర్లు, పనివాళ్ళు… అంటే వీళ్ళందరికీ బాకీ వాళ్ళు, వాళ్ళందరికీ బాకీ” అంటూ సంపద వెనుక ఉన్న భ్రమలను బయటపెట్టారు. ఫామ్‌హౌస్‌లు, రిసార్ట్‌లు, వీకెండ్ ట్రిప్‌ల వెనుక పరుగెత్తడం వృథా అని, ఇంట్లో ఉండి ప్రశాంతంగా గడపవచ్చని సూచించారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎన్‌కౌంటర్.. ఓటీటీలోకి వస్తున్న రియల్ స్టోరీ..

1970, 80, 90వ దశకాలలో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు ప్రసాద్ బాబు. కెరీర్ ఆరంభంలో హీరోగా, ఆ తర్వాత విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా దాదాపు 250కి పైగా చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులయ్యారు. 1970వ దశకంలో సినిమాల్లోకి అడుగుపెట్టిన ప్రసాద్ బాబు, తొలినాళ్లలో హీరోగా, సెకండ్ హీరోగా పలు చిత్రాల్లో నటించారు. ఆయన ఆకట్టుకునే రూపం, గంభీరమైన గొంతు ఆయనకు మంచి అవకాశాలను తెచ్చిపెట్టాయి.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : తెలుగులో చేసిందే ఒక్క సినిమా.. 2 సార్లు విడాకులు.. ఇద్దరు పిల్లలున్న వ్యాపారవేత్తతో పెళ్లి..

హీరోగా కొన్ని సినిమాలు చేసిన తర్వాత, కథానాయకుడికి ధీటైన ప్రతినాయక పాత్రల వైపు మళ్లారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి అగ్ర హీరోలందరి సినిమాల్లోనూ ఆయన కీలక పాత్రలు పోషించారు. ప్రసాద్ బాబు అనగానే చాలామందికి గుర్తొచ్చేది ఆయన వేసిన పోలీస్ ఆఫీసర్, కలెక్టర్, లేదా న్యాయమూర్తి పాత్రలు గుర్తుకు వస్తాయి. చిరంజీవి హీరోగా వచ్చిన ఈ బ్లాక్‌బస్టర్ సినిమాలో ప్రసాద్ బాబు కీలక పాత్రలో నటించి మెప్పించారు. చిరంజీవి కెరీర్‌ను మలుపుతిప్పిన ఈ చిత్రంలో ఆయన నటనకు మంచి గుర్తింపు లభించింది.

ఎక్కువ మంది చదివినవి : Srikanth : ఇప్పుడు ఉన్న హీరోలలో ఆ ఇద్దరితో కలిసి నటించే ఛాన్స్ మాత్రం రాలేదు.. శ్రీకాంత్ కామెంట్స్..

ఎక్కువ మంది చదివినవి : Rajeev Kanakala: ఆ సినిమా హిట్ కాదేమో అని తారక్ చాలా ఎమోషనల్ అయ్యాడు.. కట్ చేస్తే.. బ్లాక్ బస్టర్ హిటైన మూవీ..

Follow Us