Megastar Chiranjeevi: చిరంజీవికి భార్యగా, చెల్లిగా నటించిన ఏకైక హీరోయిన్.. 20 ఏళ్లుగా తగ్గని స్టార్ డమ్..
మెగాస్టార్ చిరంజీవికి జోడిగా ప్రియురాలిగా, భార్యగా, ఆ తర్వాత చెల్లిగా నటించిన ఓ హీరోయిన్ గురించి మీకు తెలుసా. ? దాదాపు 20 ఏళ్లుగా ఆమె సినీరంగంలో చక్రం తిప్పుతుంది. 40 ఏళ్ల వయసులోనూ ఏమాత్రం తగ్గని అందం, అభినయంతో వెండితెరపై సందడి చేస్తుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో మీకు తెలుసా.. ?

మెగాస్టార్ చిరంజీవికి తెరపై భార్యగా, చెల్లిగా నటించిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా? ఆమె మరెవరో కాదు, లేడీ సూపర్ స్టార్ నయనతార. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్న నయన్, హీరోలతో సమానంగా పారితోషికం అందుకుంటూ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారారు. షారుఖ్ ఖాన్ సరసన జవాన్ సినిమాతో హిందీలోనూ అడుగుపెట్టి బ్లాక్‌బస్టర్ అందుకున్నారు. సోషల్ మీడియాలో కూడా చురుగ్గా ఉంటూ, బ్రాండ్ ప్రమోషన్లతో పాటు కుటుంబ ఫోటోలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. నయనతార, చిరంజీవి తొలిసారి కలిసి నటించిన సినిమా 2019లో వచ్చిన సైరా నరసింహారెడ్డి. ఇందులో నరసింహారెడ్డి భార్య సిద్ధమ్మ పాత్రలో ఆమె కనిపించారు. సినిమా షూటింగ్ సమయంలో హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో వేసిన సెట్‌లో చిరంజీవి, జగపతిబాబు తదితరులతో కలిసి ఆమె కీలక సన్నివేశాల్లో పాల్గొన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎన్‌కౌంటర్.. ఓటీటీలోకి వస్తున్న రియల్ స్టోరీ..
మూడేళ్ల తర్వాత, 2022లో వచ్చిన గాడ్‌ఫాదర్ సినిమాతో ఈ జంట మళ్లీ తెరపై కలిసింది. మలయాళ సూపర్‌హిట్ లూసిఫర్‌కు తెలుగు రీమేక్‌గా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నయనతార సత్యప్రియ జైదేవ్ పాత్రలో, చిరంజీవికి చెల్లిగా నటించారు. అసలు సినిమాలో మంజు వారియర్ చేసిన పాత్రను ఆమె తెలుగులో పోషించారు. దర్శకుడు మోహన్ రాజాతో నయనతారకు ఇది వరుసగా మూడో సినిమా. అంతకుముందు ఆయనతో తని ఒరువన్, వేలైక్కారన్ చిత్రాల్లో పనిచేశారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : తెలుగులో చేసిందే ఒక్క సినిమా.. 2 సార్లు విడాకులు.. ఇద్దరు పిల్లలున్న వ్యాపారవేత్తతో పెళ్లి..
ఇటీవలే జోడీ ఇప్పుడు మూడోసారి కలిసింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా 2026 జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదలైంది. ఇందులో ఆమె శశిరేఖ పాత్రలో కనిపించారు. శశిరేఖ వ్యాపారంలో రాణించిన మహిళ, నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్ అయిన శంకరవరప్రసాద్ (చిరంజీవి)కి దూరంగా ఉంటున్న భార్య. వెంకటేష్ ప్రత్యేక పాత్రలో కనిపించగా, క్యాథరిన్ ట్రెసా కూడా కీలక పాత్రలో నటించారు. ప్రస్తుతం చిరంజీవి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో త్రిష కథానాయిక కాగా, కునాల్ కపూర్ ప్రధాన ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. మరోవైపు బాబీ దర్శకత్వంలో చిరంజీవి చేస్తున్న కాకా సినిమాలోనూ నటిస్తున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Srikanth : ఇప్పుడు ఉన్న హీరోలలో ఆ ఇద్దరితో కలిసి నటించే ఛాన్స్ మాత్రం రాలేదు.. శ్రీకాంత్ కామెంట్స్..
నయనతార..
View this post on Instagram
ఎక్కువ మంది చదివినవి : Rajeev Kanakala: ఆ సినిమా హిట్ కాదేమో అని తారక్ చాలా ఎమోషనల్ అయ్యాడు.. కట్ చేస్తే.. బ్లాక్ బస్టర్ హిటైన మూవీ..
