AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anita Chowdary: నటి అనితా చౌదరికి బురిడీ.. లక్షల్లో కొట్టేశారు..

కుమారుడి బర్త్‌డే వేడుకల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లాలనుకున్న టాలీవుడ్ నటి అనితా చౌదరి సైబర్ మోసానికి గురయ్యారు. ఆన్‌లైన్‌లో విమాన టికెట్ల కోసం వెతుకుతున్న ఆమెను నకిలీ ట్రావెల్ సంస్థ ప్రతినిధి పేరుతో ఓ వ్యక్తి సంప్రదించాడు. ఆ తర్వాత ఏం జరిగిందో కథనంలో తెలుసుకుందాం ..

Anita Chowdary: నటి అనితా చౌదరికి బురిడీ.. లక్షల్లో కొట్టేశారు..
Anitha Chowdary
Ashok Bheemanapalli
| Edited By: |

Updated on: Nov 18, 2026 | 1:42 PM

Share

కుమారుడి బర్త్ డే వేడుకల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లాలనుకున్న టాలీవుడ్‌ నటి అనితా చౌదరికి చేదు అనుభవం ఎదురైంది. విమాన ప్రయాణం కోసం ఇంటర్నెట్‌లో వెతికిన ఆమెను సైబర్‌ ముఠా లక్ష్యంగా చేసుకుంది. ఫేక్ ట్రావెల్‌ సంస్థను నమ్మిన ఆమె నుంచి బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలు సేకరించి ఏకంగా రూ.4.14 లక్షలు మాయం చేసింది. టికెట్లు బుక్‌ కాకపోవడంతో అసలు విషయం తెలుసుకున్న నటి పోలీసులకు కంప్లైంట్ చేశారు.

వాషింగ్టన్‌ డీసీలో ఉంటున్న కుమారుడి బర్త్ డే వేడుకలకు హాజరయ్యేందుకు అనితా చౌదరి అమెరికా పర్యటనకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 12న బిజినెస్‌ క్లాస్‌ రిటర్న్‌ టికెట్ల కోసం ఆన్‌లైన్‌లో సెర్చ్‌ చేశారు. ఈ సమయంలో ‘లో ఫ్లై ట్రావెల్స్‌ టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌’ పేరుతో ఉన్న వెబ్‌సైట్‌ ఆమెకు కనిపించింది. అందులోని సంప్రదింపు నంబర్‌కు ఫోన్‌ చేయడంతో రాజేశ్‌ అనే వ్యక్తి ఆమెతో మాట్లాడాడు.

ప్రయాణానికి సంబంధించిన వివరాలు తెలుసుకున్న అతడు టికెట్ల కోసం రూ.4,14,180 ఖర్చవుతుందని చెప్పాడు. బుకింగ్‌ ఫైనల్ చేయడానికి కార్డు సమాచారం ఇవ్వాలని కోరాడు. ఇందుకోసం ఓ ఫారం పంపించి అందులో డెబిట్‌ కార్డు వివరాలు నమోదు చేయించాడు. ఆ తర్వాత ఫోన్‌ కాల్‌ను కొనసాగిస్తూ మొబైల్‌కు వచ్చే ఓటీపీలను కూడా తెలుసుకున్నాడు. బుకింగ్‌ ప్రక్రియలో భాగమేనని నమ్మిన అనితా వాటిని అతడికి చెప్పడంతో మోసగాళ్లకు పని సులువైంది.

అయితే విమాన ప్రయాణానికి సంబంధించిన టికెట్లు రాకపోగా, ఆమె ఖాతా నుంచి డబ్బులు మాయమయ్యాయి. క్లియర్‌ట్రిప్‌ ద్వారా రూ.4,14,180 డెబిట్‌ అయినట్లు మెసేజ్‌ రావడంతో అనితా చౌదరి అప్రమత్తమయ్యారు. బుకింగ్‌ ధ్రువీకరణ లేకపోవడం, ఖాతాలో నగదు తగ్గడంతో తాను సైబర్‌ మోసానికి గురైనట్లు నిర్ధారించుకున్నారు. ఆలస్యం చేయకుండా బ్యాంకు కస్టమర్‌ కేర్‌కు ఫిర్యాదు చేసి, అనంతరం సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు.

బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఈ వ్యవహారంపై విచారణ ప్రారంభించారు. రాజేశ్‌ పేరుతో మాట్లాడిన వ్యక్తి ఆచూకీతో పాటు నకిలీ ట్రావెల్‌ సంస్థ కార్యకలాపాలు, డబ్బులు బదిలీ అయిన అకౌంట్ల వివరాలను సేకరిస్తున్నారు. ఆన్‌లైన్‌ మోసాల నేపథ్యంలో టికెట్ల బుకింగ్‌ విషయంలో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. వెబ్‌సైట్‌ క్రెడిబులిటీని పరిశీలించకుండా చెల్లింపులు చేయొద్దని, ఫోన్‌లో మాట్లాడే అపరిచితులకు బ్యాంకు కార్డు వివరాలు, ఓటీపీలు చెప్పొద్దని హెచ్చరిస్తున్నారు.

Follow Us
నటి అనితా చౌదరికి రూ.4.14 లక్షల టోకరా!
నటి అనితా చౌదరికి రూ.4.14 లక్షల టోకరా!
చికెన్, మటన్ కర్రీల కంటే డిఫరెంట్ టేస్ట్.. సూపర్ మేక దబ్బా కూర..
చికెన్, మటన్ కర్రీల కంటే డిఫరెంట్ టేస్ట్.. సూపర్ మేక దబ్బా కూర..
అద్భుతమైన ఆఫర్‌.. కేవలం రూ.51 రీఛార్జ్‌తో 28 రోజుల వ్యాలిడిటీ!
అద్భుతమైన ఆఫర్‌.. కేవలం రూ.51 రీఛార్జ్‌తో 28 రోజుల వ్యాలిడిటీ!
ప్రేమ విఫలం.. ప్రతీకారం మొదలు! చివరకు అడ్డంగా బుక్కైంది!
ప్రేమ విఫలం.. ప్రతీకారం మొదలు! చివరకు అడ్డంగా బుక్కైంది!
దిశ మార్చుకున్న అక్వాన్.. తెలంగాణపై కూడా ప్రభావం
దిశ మార్చుకున్న అక్వాన్.. తెలంగాణపై కూడా ప్రభావం
అసలు ఎవరీ సాత్విక.. స్టార్ హీరోలతో ఛాన్సులు.. అందరి చూపు ఆమె పైనే
అసలు ఎవరీ సాత్విక.. స్టార్ హీరోలతో ఛాన్సులు.. అందరి చూపు ఆమె పైనే
వామ్మో.. స్నేక్ క్యాచర్‌కు 2 గంటలు చుక్కలు చూపించిన గిరినాగు
వామ్మో.. స్నేక్ క్యాచర్‌కు 2 గంటలు చుక్కలు చూపించిన గిరినాగు
బిగ్‌షాక్‌..ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలాంటి వీడియోలు పోస్ట్‌ చేయలేరు!
బిగ్‌షాక్‌..ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలాంటి వీడియోలు పోస్ట్‌ చేయలేరు!
డ్రైవర్ లేకపోయినా క్యాబ్‌లో వెళ్లొచ్చు.. కొత్త సదుపాయం వచ్చేసింది
డ్రైవర్ లేకపోయినా క్యాబ్‌లో వెళ్లొచ్చు.. కొత్త సదుపాయం వచ్చేసింది
స్త్రీలకు కలలో పాములు కనిపించడం శుభమా? అశుభమా?
స్త్రీలకు కలలో పాములు కనిపించడం శుభమా? అశుభమా?