AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రేమలో బ్రేకప్.. మాజీ ప్రియుడికి ఊహించని షాక్ ఇచ్చిన యువతి.. బెడిసికొట్టిన ప్లాన్!

ప్రేమ సంబంధంలో విభేదాలు రావడంతో యువకుడిని భయపెట్టేందుకు ఓ యువతి వినూత్నమైన, చట్టవిరుద్ధమైన మార్గాన్ని ఎంచుకుంది. షీ టీమ్స్ పోలీసుల పేరుతో నకిలీ నోటీసును తయారు చేసి వాట్సాప్‌లో పంపించింది. ఇందుకోసం ChatGPT సాయం తీసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ వ్యవహారంలో యువతితో పాటు ఆమెకు సహకరించిన మరో యువకుడిపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.

ప్రేమలో బ్రేకప్.. మాజీ ప్రియుడికి ఊహించని షాక్ ఇచ్చిన యువతి.. బెడిసికొట్టిన ప్లాన్!
Love Breakup
Balaraju Goud
|

Updated on: Nov 18, 2026 | 1:28 PM

Share

హైదరాబాద్‌: ప్రేమ సంబంధంలో విభేదాలు రావడంతో యువకుడిని భయపెట్టేందుకు ఓ యువతి వినూత్నమైన, చట్టవిరుద్ధమైన మార్గాన్ని ఎంచుకుంది. షీ టీమ్స్ పోలీసుల పేరుతో నకిలీ నోటీసును తయారు చేసి వాట్సాప్‌లో పంపించింది. ఇందుకోసం ChatGPT సాయం తీసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ వ్యవహారంలో యువతితో పాటు ఆమెకు సహకరించిన మరో యువకుడిపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటన హైదరాబాద్‌లో చర్చనీయాంశంగా మారింది.

ఐదేళ్ల ప్రేమ.. ఏడాది నుంచి దూరం!

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ, బాలాజీనగర్‌కు చెందిన తిరునేశ్వర్ వీరంకి (24)కు మహీంద్రా యూనివర్సిటీ విద్యార్థిని (24)తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో ఇద్దరూ సుమారు ఐదేళ్లపాటు ప్రేమ బంధంలో కొనసాగారు. ఈ క్రమంలో యువకుడు పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చినప్పటికీ, గత ఏడాది నుంచి ఆమెకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా సోషల్ మీడియాలోనూ ఆమెను బ్లాక్ చేశాడు. దీంతో యువతి తీవ్ర అసహనానికి గురైనట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

ChatGPT సాయంతో నకిలీ నోటీసు..!

తనకు దూరమైన యువకుడిని భయపెట్టాలని భావించిన యువతి.. షీ టీమ్స్ పేరుతో నకిలీ పోలీసు నోటీసును రూపొందించింది. ఇందుకోసం ChatGPT సాయం తీసుకున్నట్లు విచారణలో గుర్తించారు. అనంతరం హరి అనే వ్యక్తి ద్వారా ఆ నోటీసును బాధితుడికి వాట్సాప్‌లో పంపించింది. షీ టీమ్స్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ అందులో పేర్కొనడంతో నిజంగానే పోలీసుల నుంచి నోటీసు వచ్చిందని యువకుడు భావించాడు.

షీ టీమ్స్ విచారణతో అసలు విషయం వెలుగులోకి..!

వాట్సాప్‌లో వచ్చిన నోటీసును నమ్మిన తిరునేశ్వర్.. షీ టీమ్స్ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యాడు. అయితే అధికారులు నోటీసును పరిశీలించగా అది నకిలీదని తేలింది. దీంతో షీ టీమ్స్ ఎస్ఐ వెంకటేష్ ఈ వ్యవహారంపై సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, ఈ నకిలీ నోటీసు వెనుక ఇద్దరు ఉన్నట్లు గుర్తించారు.

పలు సెక్షన్ల కింద కేసు నమోదు

ఈ ఘటనపై సైఫాబాద్ పోలీసులు BNS సెక్షన్లు 204, 319(2), 336(3), 340(2), 35(2), ఐటీ చట్టంలోని 66(C), 66(D) కింద కేసు నమోదు చేశారు. నకిలీ అధికారిక నోటీసుల తయారీ, వాటిని ఉపయోగించి వ్యక్తులను తప్పుదారి పట్టించడం వంటి అంశాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రేమ సంబంధాల్లో విభేదాలు వచ్చినప్పుడు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం, పోలీసుల పేరుతో నకిలీ పత్రాలు సృష్టించడం తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుందని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది. ముఖ్యంగా ఏఐ టెక్నాలజీని ఉపయోగించి నకిలీ అధికారిక పత్రాలు రూపొందించడం చట్టపరమైన సమస్యలకు కారణమవుతుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ప్రేమ విఫలం.. ప్రతీకారం మొదలు! చివరకు అడ్డంగా బుక్కైంది!
ప్రేమ విఫలం.. ప్రతీకారం మొదలు! చివరకు అడ్డంగా బుక్కైంది!
దిశ మార్చుకున్న అక్వాన్.. తెలంగాణపై కూడా ప్రభావం
దిశ మార్చుకున్న అక్వాన్.. తెలంగాణపై కూడా ప్రభావం
అసలు ఎవరీ సాత్విక.. స్టార్ హీరోలతో ఛాన్సులు.. అందరి చూపు ఆమె పైనే
అసలు ఎవరీ సాత్విక.. స్టార్ హీరోలతో ఛాన్సులు.. అందరి చూపు ఆమె పైనే
వామ్మో.. స్నేక్ క్యాచర్‌కు 2 గంటలు చుక్కలు చూపించిన గిరినాగు
వామ్మో.. స్నేక్ క్యాచర్‌కు 2 గంటలు చుక్కలు చూపించిన గిరినాగు
బిగ్‌షాక్‌..ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలాంటి వీడియోలు పోస్ట్‌ చేయలేరు!
బిగ్‌షాక్‌..ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలాంటి వీడియోలు పోస్ట్‌ చేయలేరు!
డ్రైవర్ లేకపోయినా క్యాబ్‌లో వెళ్లొచ్చు.. కొత్త సదుపాయం వచ్చేసింది
డ్రైవర్ లేకపోయినా క్యాబ్‌లో వెళ్లొచ్చు.. కొత్త సదుపాయం వచ్చేసింది
స్త్రీలకు కలలో పాములు కనిపించడం శుభమా? అశుభమా?
స్త్రీలకు కలలో పాములు కనిపించడం శుభమా? అశుభమా?
మే లో పుట్టిన కవలల పుట్టినరోజు జూన్‌లో ఎలా వస్తుంది? UPSC ప్రశ్న
మే లో పుట్టిన కవలల పుట్టినరోజు జూన్‌లో ఎలా వస్తుంది? UPSC ప్రశ్న
తప్పుడు కేసుకు ప్లాన్.. కానీ వైరల్ వీడియోతో పోలీసులకు షాక్ !
తప్పుడు కేసుకు ప్లాన్.. కానీ వైరల్ వీడియోతో పోలీసులకు షాక్ !
ఎకరా జామ తోట సాగుతో లక్షల్లో ఆదాయం..!
ఎకరా జామ తోట సాగుతో లక్షల్లో ఆదాయం..!