AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నవంబర్ 18 రాశిఫలాలు: వీరికి ధనయోగం.. ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్!

Horoscope Today (November 18, 2026): బుధవారం రోజున గ్రహాల సంచారం 12 రాశుల వారి జీవితాలపై ప్రభావం చూపనుంది. కొందరికి ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తే, మరికొందరికి ఉద్యోగ, వ్యాపార అవకాశాలు కలిసిరానున్నాయి. ఇంకొందరు కుటుంబపరంగా శుభవార్తలు వినే సూచనలు ఉన్నాయి. మరి మేషం నుంచి మీనం వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు గ్రహాలు ఎలాంటి ఫలితాలను అందించనున్నాయో తెలుసుకుందాం.

నవంబర్ 18 రాశిఫలాలు: వీరికి ధనయోగం.. ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్!
Horoscope Today 18 November 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 18, 2026 | 6:00 AM

Share

దిన ఫలాలు (నవంబర్ 18, 2026): మేష రాశి వారికి ఈ రోజు ఆర్థిక సమస్యలు బాగా తగ్గుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వృషభ రాశి వారికి అదనపు ఆదాయానికి బాగా అవకాశముంది. ఆర్థిక పరిస్థితి కొద్దిగామెరుగ్గా ఉంటుంది. మిథున రాశికి చెందిన నిరుద్యోగులకు అవకాశాలు కలిసి వస్తాయి. విదేశాల్లో ఉన్న పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన ప్రోత్సాహకాలను అందుకుంటారు. వ్యాపారాలు లాభాలపరంగా కొత్త పుంతలు తొక్కుతాయి. ఆర్థిక సమస్యలు బాగా తగ్గుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. తోబుట్టువులతో ఆస్తి వివాదాలను సానుకూలంగా పరిష్కరించుకుంటారు. దూర ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యో గులకు కొత్త ఆఫర్లు అందుతాయి. కుటుంబ జీవితం చాలావరకు హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, ఉద్యోగాలలో వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండడం మంచిది. వ్యాపారాలు బాగా నిలకడగా సాగిపోతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వ్యయ ప్రయాసల్ని లెక్క చేయరు. కుటుంబపరంగా కాస్తంత ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు సజావుగా పూర్తవుతాయి. ఆస్తి వివాదాలు సానుకూలపడతాయి. అదనపు ఆదాయానికి బాగా అవకాశముంది. ఆర్థిక పరిస్థితి కొద్దిగా మెరుగ్గా ఉంటుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.

ఇవి కూడా చదవండి

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, వ్యాపారాల్లో కీలకమైన మార్పులు చేపడతారు. కొత్త నిర్ణయాలు తప్పకుండా సత్ఫలితాలనిస్తాయి. చిన్ననాటి మిత్రులతో కలిసి విందులో పాల్గొంటారు. ఆర్థిక, ఆస్తి సంబంధమైన వ్యవహారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. తలపెట్టిన పనుల్లో కొద్దిగా శ్రమాధిక్యత ఉంటుంది. నిరుద్యోగులకు అవకాశాలు కలిసి వస్తాయి. విదేశాల్లో ఉన్న పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు. ఆర్థిక ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి. దాంపత్య జీవితం హ్యాపీగా సాగిపోతుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం లభి స్తుంది. వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు కలిసి వస్తాయి. బంధువులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. మిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. సహచరుల వల్ల కొద్దిగా డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవ సరం ఉంది. సేవ, సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దాంపత్యంలో అన్యోన్యత పెరుగుతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే సూచనలున్నాయి. అధికారుల వల్ల మానసిక ఒత్తిడికి గురవుతారు. వృత్తి జీవితంలో ఏమాత్రం తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. రియల్ ఎస్టేట్, లిక్కర్, రాజకీయాలు, ఇతర బిజినెస్ రంగాల్లో ఉన్నవారికి రాబడిపరంగా అనుకూల వాతావరణం కనిపిస్తోంది. ఇష్టమైన మిత్రులతో విందులో పాల్గొంటారు. తలపెట్టిన పనుల్ని సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సమస్యలు చాలావరకు సర్దుమణుగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగంలో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడడం వల్ల తీరిక ఉండని పరిస్థితి ఏర్పడు తుంది. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు కనిపిస్తాయి. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తులవారికి గుర్తింపుతో పాటు డిమాండ్ కూడా పెరుగుతుంది. ఇంటికి బంధువుల రాకపోకలుంటాయి. ముఖ్యమైన ఆర్థిక ప్రయత్నాలు ఆశించిన దానికంటే ఎక్కువగా సత్ఫలితాలనిస్తాయి. స్నేహితుల సహాయంతో అత్యవసర పనులు విజయవంతంగా పూర్తవుతాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఆదాయంతో సమానంగా అనవసర ఖర్చులుంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో పని భారం పెరిగినా ఫలితముంటుంది. ఆదాయ వృద్ధి ప్రయత్నాల మీద ఎక్కువ సమయం పెట్టాల్సి వస్తుంది. ఆరోగ్యానికి లోటుండదు. వృత్తి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా ‍సాగిపోతుంది. వ్యాపారాల్లో కొత్త కొత్త వ్యూహాలను ప్రవేశపెట్టి, ఆర్థికంగా లబ్ధి పొందుతారు. ప్రయాణాలు లాభిస్తాయి. ముఖ్యమైన వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఆదాయం బాగానే ఉంటుంది. ఆదాయ వృద్ధి ప్రయత్నాల్లో శ్రమ పెరుగుతుంది. ఖర్చులు తగ్గించుకుని, పొదుపు పాటిస్తారు. ఒకటి రెండు ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ఇల్లు, వాహనం కొనాలనే ఆలోచనలో ఉంటారు. వృత్తి, ఉద్యోగాలు మెరుగ్గా ఉంటాయి. వ్యాపారాల్లో లాభాలు ఊహించని విధంగా పెరుగుతాయి. రాబడి మార్గాలు అనుకూలంగా ఉంటాయి. నిరుద్యోగులకు ఆశించిన అవకాశాలు కలిసి వస్తాయి. పిల్లల నుంచి ముఖ్యమైన శుభవార్తలు వింటారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, ఉద్యోగాల్లో మీ మాట బాగా చెలామణీ అవుతుంది. అధికార బాధ్యతలు నిర్వర్తిస్తారు. వ్యాపారాలు సాఫీగా, ఉత్సాహంగా సాగిపోతాయి. బంధుమిత్రులతో సాన్నిహిత్యం మరింత పెరు గుతుంది. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. దైవ కార్యాలకు హాజరవుతారు. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉన్నప్ప టికీ, చేపట్టిన పనుల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు అవకాశాలు వస్తాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగ జీవితంలో కొద్దిపాటి ఒడిదుడుకులు తప్పకపోవచ్చు. అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. వృత్తి రంగంలో కూడా శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. బంధువులతో వాదోపవాదాలకు దిగవద్దు. మంచి పరిచయాలు కలుగుతాయి. ఆరోగ్యం పరవాలేదు. పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఆదరాభిమానాలు లభిస్తాయి. ఆదాయానికి ఇబ్బందేమీ ఉండదు. వ్యాపారాల్లో కూడా లాభాలు నిలకడగా పురోగమిస్తాయి. పెండింగులో ఉన్న పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆర్థిక, ఆస్తి వ్యవహారాల్ని చక్కబెడతారు. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉన్నప్పటికీ అదనపు ఆదాయ ప్రయత్నాలను పట్టుదలగా కొనసాగిస్తారు. ప్రయాణాలలో, ఆహార నియమాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఉద్యోగపరంగా ఒకటి రెండు శుభవార్తలు వింటారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాలు చాలా వరకు అనుకూలంగా సాగుతాయి. స్వయం ఉపాధి, వ్యాపారాలు కలిసి వస్తాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగుపడుతుంది. ఆర్థికాభివృద్ధికి ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా సఫలమవు తుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందుతుంది. అనారోగ్య సమస్యల నుంచి అనుకోకుండా ఉపశమనం లభిస్తుంది. బంధుమిత్రులతో మాట పట్టింపులు రాకుండా జాగ్రత్త పడడం మంచిది.

(గమనిక: ఈ కథనంలోని అంశాలను జ్యోతిష్యశాస్త్ర నమ్మకాలు, విశ్వాసాల ఆధారంగా ఇవ్వబడింది. ఇవి నిజమని నిరూపించే శాస్త్రీయ ఆధారాలు లేవు)

Follow Us