కేంద్రం సూపర్ స్కీమ్.. ప్రతీ ఏడాది అకౌంట్లోకి డబ్బులు..

Venkatrao Lella

Images: Pinterest

05 OCT 2026

పోస్టాఫీస్ పథకాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన పథకం నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్(NSC). ఇది కేవలం పోస్టాఫీసులో మాత్రమే అందుబాటులో ఉంటుంది. రూ.వెయ్యి నుంచి ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు.

ఎలాంటి రిస్క్ లేకుండా మీ పొదుపుపై ఎక్కువ డబ్బులు పొందాలంటే ఇది మంచి పథకంగా చెప్పవచ్చు. ఏకంగా వార్షిక వడ్డీ 7.7 శాతం పొందవచ్చు. ప్రభుత్వ పథకాల్లో అత్యధిక వడ్డీ ఉన్న స్కీమ్ ఇదేనని చెప్పవచ్చు.

ఈ పథకంలో ఐదేళ్ల మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. ఉదాహరణకు మీరు రూ.10 లక్షలు పొదుపు చేసుకుంటే..  7.7 శాతం వడ్డ రేటు ప్రకారం 5 ఏళ్లల్లో వడ్డీ రూ.4,49,034 పొందవచ్చు. మొత్తం కలిపి ఒకేసారి రూ.14,49,034 విత్ డ్రా చేసుకోవచ్చు

ప్రతీ ఏడాది వడ్డీ అకౌంట్లో జమ అవుతూ ఉంటుంది. రూ.10 లక్షలకు తొలి ఏడాదిలో రూ.77 వేలు, రెండో ఏడాదిలో రూ.1,59,929, మూడో ఏడాదిలో రూ.2,49,044, నాల్గో ఏడాదిలో రూ.3,45,620 పొందవచ్చు. ఇక ఐదో సంవత్సరంలో వడ్డీ రూ.4,49,034 వస్తుంది.

నేషనల్ సేవింగ్స్ అకౌంట్‌లో చేరేందుకు కేవలం భారతీయులు మాత్రమే అర్హులు. ఎన్‌ఆర్‌ఐలు, కంపెనీలు, ట్రస్టులకు అర్హత లేదు. ఇక ఇద్దరు లేదా ముగ్గురు కలిసి  జాయింట్ అకౌంట్ తెరిచి కూడా ఇందులో పెట్టుబడులు పెట్టవచ్చు.

ఇందులోని పెట్టుబడులకు పన్ను ప్రయోజనాలు కూడా ఉన్నాయి. సెక్షన్ 80సీ ప్రకారం ప్రతీ ఏటా రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు.

ఇక మైనర్ పేరు మీద కూడా ఈ అకౌంట్ తెరవొచ్చు. కానీ తల్లిదండ్రులు ఈ ఖాతాను నిర్వహించాల్సి ఉంటుంది.

పోస్టాఫీస్ పథకాల్లో రీస్క్ ఉండదు. కేంద్ర ప్రభుత్వం పెట్టుబడులకు హామీ ఇస్తుంది. దీని వల్ల మీ డబ్బులు సురక్షితంగా ఉంటాయి. అందుకే ఎక్కువమంది ఈ స్కీముల్లో చేరుతూ ఉంటారు.

దేశవ్యాప్తంగా పోస్టాఫీస్ స్కీమ్ బాగా పాపులర్ అయ్యాయి. ఇటీవల కాలంలో ప్రజల్లో అవగాహన పెరగడంతో ఎక్కువమంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకింగ్ సేవలు అందించడంలో పోస్టాఫీసులు కీలక పాత్ర పోషిస్తున్నాయి.