AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పుట్‌పాత్ నిజానికి ఎవరిది..? బాటసారులకా, వ్యాపారులకా.. లేక పార్కింగ్‌కా?

Footpath Rights: భారత నగరాల్లో కార్లు, పండ్ల బండ్లు, ఇతర ఆక్రమణలతో పుట్‌పాత్‌లు బాటసారులకు అందుబాటులో లేకుండా పోతున్నాయి. అయితే పాదచారుల సురక్షిత ప్రయాణ హక్కుతో పాటు వీధి వ్యాపారుల జీవనోపాధి హక్కుకు కూడా చట్టపరమైన రక్షణ ఉంది. పుట్‌పాత్‌పై ఎవరికెంత హక్కు ఉందో తెలుసుకోండి.

పుట్‌పాత్ నిజానికి ఎవరిది..? బాటసారులకా, వ్యాపారులకా.. లేక పార్కింగ్‌కా?
Footpath Rights
Santosh Nair
| Edited By: |

Updated on: Oct 07, 2026 | 9:24 AM

Share

ఒక తల్లి తన చిన్నారి చేయి పట్టుకుని బడికి వెళ్తుండగా, ఇంటి ముందున్న పుట్‌పాత్‌పై సగం ఒక కారు, మిగతా సగం ఒక పండ్ల బండి ఆక్రమించి ఉన్నాయి. వేరే దారి లేక ఆ తల్లి తన బిడ్డ చేయి గట్టిగా పట్టుకుని రద్దీగా ఉన్న ప్రధాన రహదారిపైకి అడుగులు వేసింది. భారతదేశంలోని నగరాల్లో నిత్యం కనిపించే సాధారణ దృశ్యమిది. కానీ, చట్టబద్ధంగా ఆ పుట్‌పాత్ అసలు ఎవరికి చెందుతుంది? దానిపై ఎవరికి హక్కు ఉంది?.. అనే వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం..

రాజ్యాంగం – సుప్రీం కోర్టు ఏం చెప్తున్నాయి?

చట్టపరంగా చూస్తే పుట్‌పాత్‌ల వినియోగంపై రెండు రకాల ప్రాథమిక హక్కులు ముడిపడి ఉన్నాయి:

నడిచే హక్కు (ప్రాథమిక హక్కు):

2026 నాటి సుప్రీంకోర్టు సంచలన తీర్పు: రక్షణతో కూడిన, సురక్షితమైన పుట్‌పాత్‌పై నడవడం పౌరుల ప్రాథమిక హక్కు అని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 (సంచార స్వేచ్ఛ), ఆర్టికల్ 21 (జీవించే హక్కు) పరిధిలోకి వస్తుందని పేర్కొంది. దీని ఆధారంగానే 100 నగరాల్లో దాదాపు 10,000 కిలోమీటర్ల మేర ఆధునిక పుట్‌పాత్‌ల నిర్మాణానికి ‘భారత్ జనపథ్ యోజన’ పేరుతో కేంద్రం నమూనా ప్రాజెక్టును ప్రతిపాదించింది.

వీధి వ్యాపారుల ఉపాధి హక్కు:

ఓల్గా టెల్లిస్ కేసు (1985): పుట్‌పాత్‌లపై ఉండే వ్యాపారులను, నివాసితులను సరైన ప్రత్యామ్నాయం లేకుండా తొలగించకూడదని సుప్రీంకోర్టు పేర్కొంది. జీవించే హక్కులో ఉపాధి హక్కు కూడా భాగమేనని వ్యాఖ్యానించింది.

వీధి వ్యాపారుల చట్టం (2014): గుర్తింపు పొందిన వీధి వ్యాపారులకు నిర్ణీత ‘వెండింగ్ జోన్లలో’ వ్యాపారం చేసుకునే చట్టబద్ధమైన హక్కును స్థానిక కమిటీల ద్వారా కల్పించారు.

అసలు సమస్య ఎక్కడ ఉంది?

సమస్య హక్కుల మధ్య కాదు.. స్పష్టమైన సరిహద్దులు – ప్రణాళిక లేకపోవడం.

హక్కుల ఘర్షణ: ఒకవైపు నడిచే పౌరుడి సురక్షిత హక్కు, మరోవైపు పొట్టకూటి కోసం వ్యాపారం చేసుకునే వీధి వ్యాపారి హక్కు.. రెండూ న్యాయమైనవే. కానీ పుట్‌పాత్‌లో ఏ భాగం నడవడానికి, ఏ భాగం వ్యాపారానికి, ఏ భాగం పార్కింగ్‌కు కేటాయించాలో స్థానిక సంస్థలు స్పష్టంగా నిర్దేశించకపోవడమే అసలు గందరగోళానికి కారణం.

బాధితులు పౌరులే: హారన్ వేసి ముందుకు వెళ్లలేని, లేదా రోడ్డు ఆక్రమించిన వారిని గట్టిగా ప్రశ్నించలేని బాటసారులు, ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు, చిన్న పిల్లలు అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో రోడ్లపైకి రావలసి వస్తోంది.

పరిష్కారం ఏంటి?

ఎక్స్‌ప్రెస్ వేలు, ఫ్లైఓవర్లను ఎంతో వేగంగా నిర్మిస్తున్న మన దేశంలో.. పౌరులందరూ రోజూ వాడే పుట్‌పాత్‌ల నిర్మాణం, పర్యవేక్షణ అత్యంత నిర్లక్ష్యానికి గురవుతున్నాయి.

కొన్ని అభివృద్ధి చెందిన నగరాల్లో పుట్‌పాత్‌ల వెడల్పును కొలిచి, వ్యాపారులకు ప్రత్యేక స్థలాలను కేటాయిస్తూ, పార్కింగ్‌ను పూర్తిగా నిషేధించే విధానాలను అమలు చేస్తున్నారు. సరిహద్దులు స్పష్టంగా ఉన్న చోట వ్యాపారులు, బాటసారులు ఇద్దరూ సురక్షితంగా ఉంటున్నారని స్పష్టమవుతోంది.

రోడ్డుపై స్థలం కోసం శ్రమిస్తున్న వ్యాపారినో, కారు పార్క్ చేసిన డ్రైవర్నో నిందించడం వల్ల సమస్య తీరదు. అందరికీ చెందాల్సిన ప్రజా ఆస్తిని, అందరికీ ఉపయోగపడేలా పక్కా నిబంధనలతో క్రమబద్ధీకరించడంలో స్థానిక అధికారులు ఎందుకు విఫలమవుతున్నారనేదే అసలైన ప్రశ్న!

Follow Us
పుట్‌పాత్ నిజానికి ఎవరిది? బాటసారులకా, వ్యాపారులకా..
పుట్‌పాత్ నిజానికి ఎవరిది? బాటసారులకా, వ్యాపారులకా..
ఆ భూములను రైతులకు, అమరవీరుల కుటుంబాలకు ఇవ్వండి: సీఎం
ఆ భూములను రైతులకు, అమరవీరుల కుటుంబాలకు ఇవ్వండి: సీఎం
16 బౌండరీలతో అయ్యర్ విధ్వంసం.. ఒకే దెబ్బకు 4 రికార్డులు బ్రేక్
16 బౌండరీలతో అయ్యర్ విధ్వంసం.. ఒకే దెబ్బకు 4 రికార్డులు బ్రేక్
ఆర్బీఐ బిగ్ అనౌన్స్‌మెంట్‌కు అంతా రెడీ..
ఆర్బీఐ బిగ్ అనౌన్స్‌మెంట్‌కు అంతా రెడీ..
భరించలేని ఎముకల నొప్పులు ఉన్నాయా? కప్పు రాగి పిండితో ఇలా
భరించలేని ఎముకల నొప్పులు ఉన్నాయా? కప్పు రాగి పిండితో ఇలా
చందనం తిలకం ఎందుకు పెట్టుకుంటారు? దీని వెనుక ఉన్న రహస్యం తెలుసా?
చందనం తిలకం ఎందుకు పెట్టుకుంటారు? దీని వెనుక ఉన్న రహస్యం తెలుసా?
25ఏళ్ల పాలనాప్రస్థానం పూర్తి.. వినాయకుడి సన్నిధిలో PM మోదీ పూజలు
25ఏళ్ల పాలనాప్రస్థానం పూర్తి.. వినాయకుడి సన్నిధిలో PM మోదీ పూజలు
రజత్ పటిదార్ హాఫ్ సెంచరీ వృథా.. తొలి వన్డేలో ఇండియా-ఎ ఘోర పరాజయం
రజత్ పటిదార్ హాఫ్ సెంచరీ వృథా.. తొలి వన్డేలో ఇండియా-ఎ ఘోర పరాజయం
రైతులకు కేంద్రం దసరా కానుక.. అకౌంట్లోకి రూ.2 వేలు అప్పుడే..!
రైతులకు కేంద్రం దసరా కానుక.. అకౌంట్లోకి రూ.2 వేలు అప్పుడే..!
4 గుర్రాలను ముగ్గురు అన్నదమ్ములు ఎలా పంచుకోవాలి.. చిక్కుప్రశ్న
4 గుర్రాలను ముగ్గురు అన్నదమ్ములు ఎలా పంచుకోవాలి.. చిక్కుప్రశ్న