వార్నీ వీటికి ఇంత డిమాండా?.. నత్తల పెంపంకంతో కోట్ల సంపాదన!
06 Oct 2026
Anand T
నార్మల్‌గా వర్షాలు పడిన సమయంలో రోడ్లపై నత్తలు మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ వీటితోనే కోట్లు సంపాదించొచ్చంటే మీరు నమ్ముతారా?
కచ్చితంగా నమ్మాల్సిందే.. అవును దేశంలోనే తొలిసారిగా మైసూరుతో నత్తల పెంపక కేంద్రాన్ని ఏర్పాటు చేసి కోట్లు సంపాదిస్తున్నారు.
మైసూరు నత్తల పెంపక కేంద్రాన్ని ఏర్పాటు చేసి అందులో రెండు వేలకు పైగా నత్తలను శాస్త్రీయ పద్ధతిలో పెంచుతున్నారు
చల్లటి వాతావరణం, ఎక్కవ తేమగా ఉన్న పాలీహౌస్ షెడ్లలో మట్టి, కొబ్బరి పొట్టు బెడ్లపై వీటిని పెంచుతారట.
వీటికి ఆహారంగా బొప్పాయి ఆకులతో పాటు మన ఇంట్లో వాడే కూరగాయల తక్కలను వేస్తారు.
వాటి నుంచి తీసే జిగురు స్నెయిల్ మ్యూసిన్ కు ఎక్కవగా కొరియన్ స్కిన్‌కేర్, కాస్మెటిక్ రంగంలో వాడుతారు. ప్రపంచవ్యాప్తంగా వీటికి భారీ డిమాండ్ ఉంది.
అలాగే నత్త మాంసంలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయట.. విదేశాలతో పాటు స్టార్ హోటళ్లలో వీటిని ఖరీదైన ఆహారంగా వాడుతారు
ఇక వాటిపై ఉండే పెంకులను పౌల్ట్రీ దాణాలో కాల్షియం సప్లిమెంట్‌గా, ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు.
ఇలా వీటిని పెంచి విక్రయించడం ద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు జనాలు
మరిన్ని వెబ్ స్టోరీస్
తొలకరి వానలు మొదలయ్యాయి.. ఈ సమయంలో ఆకు కూరలు తినొచ్చా?
రెగ్యులర్ కాఫీ బోర్ కొట్టిందా.. కొత్తగా సరికొత్తగా ఈ బనానా కాఫీ ట్రై చేయండి
చీరలో అందంగా. మెగా డాటర్ బ్యూటిపుల్ ఫొటోస్