AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీమిండియా పిలిస్తే నో చెప్తానా.? 2027 ప్రపంచకప్‌పై కోహ్లీ దోస్త్ సంచలన వ్యాఖ్యలు..!

Bhuvneshwar Kumar 2027 World Cup Comeback: వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమేనని భువనేశ్వర్ కుమార్ తన బౌలింగ్ ప్రదర్శనతో నిరూపిస్తున్నాడు. రాబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌లలో సెలెక్టర్లు ఈ సీనియర్ పేసర్‌కు అవకాశం ఇస్తారో లేదో వేచి చూడాల్సిందే. భువీ రీఎంట్రీ ఇస్తే భారత బౌలింగ్ విభాగానికి తిరుగుండదని అభిమానులు భావిస్తున్నారు.

టీమిండియా పిలిస్తే నో చెప్తానా.? 2027 ప్రపంచకప్‌పై కోహ్లీ దోస్త్ సంచలన వ్యాఖ్యలు..!
Bhuvneshwar Kumar
Venkata Chari
|

Updated on: Aug 10, 2026 | 12:45 PM

Share

Bhuvneshwar Kumar 2027 World Cup Comeback: భారత సీనియర్ స్టార్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ అంతర్జాతీయ టీమిండియా రీఎంట్రీపై సంచలన ప్రకటన చేశాడు. 2027 వన్డే ప్రపంచకప్‌లో జాతీయ జట్టు తరఫున ఆడేందుకు తాను పూర్తి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశాడు. సెలెక్టర్ల నుంచి పిలుపు వస్తే కాదనే ప్రసంగే లేదని వెల్లడించాడు. ఈ ప్రకటన క్రికెట్ అభిమానుల్లో తీవ్ర ఉత్సాహాన్ని, ఆసక్తిని నింపుతోంది.

టీమిండియా పిలుపు వస్తే సిద్ధమే.. భువీ మనసులోని మాట!

భారత స్వింగ్ సుల్తాన్ భువనేశ్వర్ కుమార్ మళ్లీ నీలిరంగు జెర్సీ ధరించేందుకు తన పూర్తి సుముఖత వ్యక్తం చేశాడు. రాబోయే యూపీ టీ20 లీగ్ ప్రారంభానికి ముందు లక్నో ఫాల్కన్స్ శిక్షణ శిబిరంలో పాల్గొనేందుకు వచ్చిన సమయంలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన చాలా స్పష్టమైన సమాధానాలు ఇచ్చాడు. “జాతీయ జట్టు నుంచి పిలుపు వస్తే నేను ఎందుకు వద్దంటాను? భారత జట్టు తరఫున ఆడేందుకు నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను” అని భువనేశ్వర్ నమ్మకంగా స్పష్టం చేశాడు. 2022 నవంబర్ నుంచి అంతర్జాతీయ మ్యాచ్‌లకు దూరంగా ఉంటున్న ఈ సీనియర్ పేసర్ నోటి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. తన సుదీర్ఘ అనుభవం, ప్రస్తుతం ఉన్న అద్భుతమైన మ్యాచ్ ఫామ్ దృష్ట్యా 2027 వన్డే ప్రపంచకప్‌లో బరిలోకి దిగేందుకు సరైన అవకాశమని ఆయన భావిస్తున్నాడు.

ఎక్కువమంది చదివింది: వరల్డ్ కప్ 2027 రేసు నుంచి ఆ 2 దిగ్గజ టీంలు ఔట్.. టీమిండియా పరిస్థితి ఏంటంటే?

ఇవి కూడా చదవండి

ఐపీఎల్‌లో వికెట్ల సునామీ.. మళ్లీ పాత రోజులు గుర్తొచ్చేలా!

గత కొంతకాలంగా గాయాల సమస్యలతో తీవ్రంగా ఇబ్బంది పడిన భువనేశ్వర్ కుమార్ ఇటీవల ముగిసిన ఐపీఎల్ సీజన్లలో అద్భుత ప్రదర్శనతో తిరిగి తన పాత వైభవాన్ని అందుకున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున మైదానంలోకి దిగిన భువీ కొత్త బంతితో ఇరువైపులా స్వింగ్ సాధిస్తూ ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. పవర్ ప్లే సమయంలో పరుగులు కట్టడి చేయడమే కాకుండా, ఆఖరి ఓవర్లలోనూ కచ్చితమైన యార్కర్లు, వేరియేషన్లతో ప్రత్యర్థి వికెట్లు పడగొట్టాడు. గడిచిన ఐపీఎల్ సీజన్ లో 16 మ్యాచుల్లో ఏకంగా 28 వికెట్లు సాధించి పర్పుల్ క్యాప్ విజేతకు కేవలం ఒక్క వికెట్ దూరంలో నిలిచాడు. తన పదునైన బౌలింగ్‌తో బెంగళూరు జట్టు సాధించిన వరుస విజయాల్లో కీలక పాత్ర పోషించి విమర్శకుల నోళ్లు మూయించాడు. అంతకుముందు సీజన్‌లోనూ 17 వికెట్లు సాధించి తనలో బౌలింగ్ సత్తా, వికెట్లు తీసే ఆకలి ఏమాత్రం తగ్గలేదని ప్రపంచానికి చాటిచెప్పాడు.

దిగ్గజాల మద్దతు.. ఆఫ్రికా పిచ్‌లకు భువీ స్వింగ్ సరైన అస్త్రం!

భువనేశ్వర్ కుమార్ రీఎంట్రీ ప్రతిపాదనకు భారత మాజీ దిగ్గజ క్రికెటర్ల నుంచి విశేషమైన మద్దతు లభిస్తోంది. సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి, దినేష్ కార్తీక్, మాజీ చీఫ్ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ వంటి ప్రముఖులు భువీని 2027 ప్రపంచకప్ రేసులోకి తీసుకోవాలని బహిరంగంగానే బిసిసిఐకి సూచించారు. 2027 వన్డే ప్రపంచకప్ టోర్నీ దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాల్లో జరగనుంది. అక్కడ ఆఫ్రికా మైదానాల్లోని పిచ్‌లపై కొత్త బంతికి లభించే అనుకూల స్వింగ్, సీమ్ కదలికలను వేగంగా పసిగట్టడంలో భువనేశ్వర్ సిద్ధహస్తుడు. టెస్టులు, వన్డేలలో దక్షిణాఫ్రికా గడ్డపై అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన అనుభవం ఆయనకుంది. అలాంటి కఠినమైన పిచ్‌లపై అపారమైన అనుభవం కలిగిన భువీ బౌలింగ్ భారత వికెట్ టేకింగ్ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుందని విశ్లేషకులు బలంగా చెబుతున్నారు.

ఎక్కువమంది చదివింది: టెస్ట్ క్రికెట్ హిస్టరీలోనే మొనగాళ్లు.. ఒక్క ఓవర్‌లోనే బీభత్సం.. మనోడి రికార్డ్ బద్దలవ్వడం కష్టమే

కేవలం ఆటపైనే శ్రద్ధ.. బోర్డు నిర్ణయమే కీలకం!

తన రీఎంట్రీపై మైదానంలో సాగుతున్న ప్రచారాలు, క్రీడా విశ్లేషణలపై భువనేశ్వర్ చాలా ప్రశాంతంగా, నిగ్రహంతో స్పందించాడు. “నా ప్రాథమిక బాధ్యత మైదానంలోకి దిగి అత్యుత్తమంగా క్రికెట్ ఆడటమే. వేరే చోట జట్టులోకి ఎంపిక కావాలనో, లేదా ఎవరైనా ఏదో ప్రశంసించారనో నేను ఇక్కడికి రాలేదు. ఆటకు నేను ఇచ్చే ప్రాధాన్యత, నాలోని మక్కువతోనే యూపీ లీగ్‌లతో పాటు ఇతర టోర్నీలలో ఆడుతున్నాను. ఎంతవరకు సిద్ధంగా ఉన్నాననేది నా ఒక్కడి నిర్ణయం కాదు, అదంతా సెలెక్టర్ల ఆలోచనలపైనే ఆధారపడి ఉంటుంది” అని నర్మగర్భంగా చెప్పారు. భారతదేశం తరఫున 121 వన్డేల్లో 141 వికెట్లు, 87 టీ20ల్లో 90 వికెట్లు సాధించిన ఈ సీనియర్ ఫాస్ట్ బౌలర్ అనుభవానికి బిసిసిఐ సెలెక్టర్లు మరోసారి పచ్చజెండా ఊపుతారో లేదో చూడాలి.

అంతర్జాతీయ కెరీర్ సుదీర్ఘ ప్రయాణం.. చెరిగిపోని ముద్ర!

భువనేశ్వర్ కుమార్ భారత జట్టు తరఫున సాధించిన విజయాలు సామాన్యమైనవి కావు. 2012లో అంతర్జాతీయ అరంగేట్రం చేసినప్పటి నుంచి భారత్‌కు అనేక చారిత్రాత్మక విజయాలను అందించాడు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ విజయంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా, 2015, 2019 వన్డే ప్రపంచకప్‌లలో భారత్ తరఫున ప్రధాన పేసర్‌గా సేవలు అందించాడు. కొత్త బంతితో ఇరువైపులా స్వింగ్ చేసే నైపుణ్యం కలిగిన అతికొద్ది మంది భారత బౌలర్లలో భువీ ఒకడు. సుదీర్ఘకాలం పాటు గాయాలతో సతమతమైనప్పటికీ, ప్రతిసారీ అంతే బలంగా పుంజుకుని తన సత్తా నిరూపించుకున్నాడు. ప్రస్తుతం భువీ వయసు 36 ఏళ్లు అయినప్పటికీ, ఆయన చూపిస్తున్న ఫిట్‌నెస్, లైన్ అండ్ లెంగ్త్‌పై పట్టు యువ బౌలర్లకు సైతం ఆదర్శంగా నిలుస్తోంది.

ఎక్కువమంది చదివింది: IND vs SL: గాలె టెస్టుకు అతడే దిక్కా గంభీర్.. అట్టర్ ఫ్లాప్ ప్లేయర్‌తో బరిలోకి అవసరమా..!

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us