గ్రహాలన్నింటిదీ ఒకదారి.. శుక్రుడు మాత్రం అంతా రివర్స్ ఎందుకంటే?
సౌర కుటుంబంలోని ఇతర గ్రహాలకు భిన్నంగా శుక్రుడు వ్యతిరేక దిశలో తిరుగుతాడు. దీనినే రెట్రోగ్రేడ్ రొటేషన్ అంటారు. శుక్రుడి ఈ వింత భ్రమణానికి భారీ గ్రహశకలం ఢీకొనడం, సూర్యుడి గురుత్వాకర్షణ ప్రభావంతో భ్రమణ వేగం మారడం, దట్టమైన వాతావరణం కారణంగా ఏర్పడే రాపిడి వంటి మూడు ప్రధాన సిద్ధాంతాలు ఉన్నాయి. శుక్రుడు తన చుట్టూ తాను తిరగడానికి 243 రోజులు పడుతుంది. అందుకే ఈ గ్రహం శాస్త్రవేత్తలకు ఇప్పటికీ ఆసక్తికరమైన ఖగోళ రహస్యంగా మిగిలింది.
సౌర కుటుంబంలో గ్రహాలన్నీ ఒకే దిశలో ప్రయాణిస్తుంటే, శుక్ర గ్రహం మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వ్యతిరేక దిశలో తిరుగుతూ ఖగోళ శాస్త్రవేత్తలను మేధోమథనానికి గురిచేస్తోంది. భూమితో సహా మిగిలిన గ్రహాలన్నీ పడమర నుంచి తూర్పునకు తిరిగితే, శుక్రుడు మాత్రం తూర్పు నుంచి పడమరకు తిరుగుతాడు. దీనినే శాస్త్రవేత్తలు ‘రెట్రోగ్రేడ్ రొటేషన్’ అంటారు. ఒకే వాయువు, ధూళి మేఘం నుంచి పుట్టినప్పటికీ శుక్రుడి ఈ వింత ప్రవర్తన వెనుక ప్రధానంగా మూడు శాస్త్రీయ కారణాలు ప్రచారంలో ఉన్నాయి. మొదటిది, సౌర కుటుంబం ప్రారంభ రోజుల్లో శుక్రుడి పరిమాణంలో ఉన్న ఒక భారీ గ్రహశకలం దాన్ని వేగంగా ఢీకొని ఉండవచ్చు. ఆ ఘర్షణ తాకిడికి శుక్రుడి భ్రమణ దిశే పూర్తిగా తలకిందులైపోయి ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే, రెండో సిద్ధాంతం ప్రకారం శుక్రుడిని ఏదీ ఢీకొట్టలేదు. సూర్యుడి గురుత్వాకర్షణ, అత్యంత సాంద్రమైన వాతావరణం వల్ల కోట్లాది సంవత్సరాల కాలంలో దాని భ్రమణ వేగం నెమ్మదిగా తగ్గి, చివరకు వ్యతిరేక దిశకు మారిందని ఫ్రెంచ్ పరిశోధకులు అలెగ్జాండర్ కొరేరియా, జాకస్ లాస్కర్ వెల్లడించారు. మూడోది, శుక్రుడి అత్యంత వేడి, దట్టమైన వాతావరణం. సూర్యకాంతి వల్ల వాతావరణంలో వచ్చే అలలు, ఉపరితలం-కేంద్రకం మధ్య కలిగే రాపిడి కలిసి శుక్రుడి భ్రమణ దిశను మార్చేశాయని చెబుతారు. కాగా, శుక్రుడి భ్రమణ వేగం చాలా నెమ్మదిగా ఉంటుంది. అది తన చుట్టూ తాను తిరగడానికి 243 రోజులు పడితే, సూర్యుడి చుట్టూ తిరగడానికి 224.7 రోజులు మాత్రమే పడుతుంది. చంద్రుని తర్వాత రాత్రి ఆకాశంలో అత్యంత వెలుతురుతో మెరిసే గ్రహం శుక్రుడే. అంతేకాదు..సౌరమండలంలో అత్యంత ఎక్కువ వేడిగా ఉండే గ్రహమూ ఇదే. ఈ గ్రహంపై సూర్యుడు పశ్చిమాన ఉదయించి.. తూర్పున అస్తమిస్తాడు. కారణాలు ఏవైనప్పటికీ, అంతరిక్షంలో శుక్రుడు ఒక మహా మిస్టరీగా నిలిచాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Varanasi: వారణాసి లీక్స్ రచ్చ.. రాజమౌళి ధమాకా ప్లాన్ మెప్పించేనా?
పాడైన నోట్లను మార్చడానికి బ్యాంకు నిరాకరిస్తోందా? మీరు కంప్లైంట్ చేయొచ్చు తెలుసా!
Bigg Boss Season 10: బిగ్ సర్‌ప్రైజ్.. బిగ్ బాస్ ఆ రోజు నుంచి మొదలు..
డ్యూటీకి డుమ్మా కొట్టి.. ప్రైవేటు డాక్టర్‌ని పెట్టి.. బైటపడ్డ ప్రభుత్వ డాక్టర్ బాగోతం..!
ట్రాక్‌పై దూసుకెళ్తున్న రైలు.. ఒక్కసారిగా ఊడిపోయిన చక్రాలు
హైదరాబాద్‌లో అతిపెద్ద క్రైసిస్.. ఇళ్లు వదిలి పారిపోతున్న పిల్లలు
తండ్రిని ఆసుపత్రికి తీసుకువెళ్లిన కూతుళ్లు.. తర్వాత ఏం చేసారంటే
తల్లి గర్భంలోనే సర్జరీ.. వైద్య చరిత్రలోనే అరుదైన అద్భుతం!
కింగ్ కోబ్రా గూడును ఎప్పుడైనా చూశారా..
చదువుకుంటాను.. స్కూల్లో కొత్త అతిథిని చూసి హడలిపోయిన విద్యార్ధులు
150 ఏళ్ల తర్వాత లైబ్రరీకి తిరిగి వచ్చిన పుస్తకం.. కట్ చేస్తే..

