గుర్తు పట్టలేని విధంగా అరియానా.. చీరలో భలే ఉందిగా..
Samatha
10 August 2026
గ్లామర్ బ్యూటీ, యాంకర్ అరియానా గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం.
ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసి మంచి ఫేమ్ సంపాదించుకున్న ఈ చిన్నది. స్టార్ హీరోయిన్ రేంజ్‌లో విపరీతమైన పాపులారిటీని అందుకుంది.
తర్వాత ఏంగా బిగ్ బాస్ సీజన్ 4లోకి అడుగు పెట్టింది. ఇందులో తన ఆటతీరుతో ప్రతి ఒక్కరి మనసు దోచుకోవడమే కాకుండా అందరి ఫేవరెట్ కంటెస్టెంట్ అయిపోయింది.
ఎందురించి మాట్లాడే ధైర్యం, తప్పును తప్పుగా చెప్పే విధానం, కష్టపడి ఆడే తత్వం, అందరితో సరదాగా ఉండటం, ముఖ్యంగా సోహెల్‌తో గొడవలు ఇవన్నీంటి వలన బిగ్ బాస్‌లో మంచి ఫేమ్ సంపాదించుకుంది.
టాప్ 5 కంటెస్టెంట్‌లలో ఒకరిగా నిలిచింది.ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక ఈ బ్యూటీ పలు సినిమాల్లో నటించి మెప్పించింది.
అంతే కాకుండా వరసగా షోలు , ఈవెంట్స్ చేస్తూ ఎప్పుడూ బిజీ బిజీగా గడిపేస్తుంది. తన అందచందాలతో అందరి మనసు దోచేస్తుంది.
ఇక ఈ బ్యూటీ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత గ్లామర్ డోస్ ఎక్కువగా పెంచింది. తన అంద చందాలతో అందిరినీ ఆకట్టుకుంటుంది.
తాజాగా ఈ బ్యూటీ చీరకట్టులో ఉన్న క్యూట్ ఫొటోస్ షేర్ చేసింది. అందులో ఈ ముద్దుగుమ్మను చూసి అరియానా ఏంటీ ఇలా మారిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.