AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Oscars 2026: ఆస్కార్ గెల్చుకున్న సినిమాలు.. ఇప్పుడు ఈ ఓటీటీల్లో ఫ్రీగా చూడొచ్చు

98వ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవం లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో అట్టహాసంగా జరిగింది. 'వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్' ఉత్తమ చిత్రంతో సహా ఏకంగా ఆరు ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకుంది. దీంతో పాటు వివిధ భాషలకు చెందిన సినిమాలు, నటులు కూడా వివిధ విభాగాల్లో ఆస్కార్ అవార్డులు సొంతం చేసుకున్నారు.

Oscars 2026: ఆస్కార్ గెల్చుకున్న సినిమాలు.. ఇప్పుడు ఈ ఓటీటీల్లో ఫ్రీగా చూడొచ్చు
Oscars 2026 Movies
Basha Shek
|

Updated on: Mar 16, 2026 | 11:53 AM

Share

98వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. భారత కాలమానం ప్రకారం, అవార్డు కార్యక్రమం సోమవారం ఉదయం అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లోని హాలీవుడ్ స్టూడియోస్‌లోని డాల్బీ థియేటర్‌లో ఈ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. హాలీవుడ్‌తో సహా చలనచిత్ర పరిశ్రమకు చెందిన అనేక మంది ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఇండియా నుంచి గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రాతో సహా పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకలో సందడి చేశారు. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుల్లో ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ హవా సాగింది. ఈ సినిమా ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకుంది. ‘టైటానిక్’ ఫేమ్ లియోనార్డో డికాప్రియో ఈ చిత్రంలో హీరో. పాల్ థామస్ ఆండర్సన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆయనకు ఉత్తమ దర్శకుడి అవార్డు కూడా వచ్చింది. ఈ చిత్రం మొత్తం ఆరు అవార్డులను గెలుచుకుంది. ప్రస్తుతం ఈ సినిమా జియో హాట్‌స్టార్‌ ఓటీటీలో చూడటానికి అందుబాటులో ఉంది. ఇక ‘హామ్నెట్’ చిత్రంలో నటనకు జెస్సీ బక్లీ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్నారు. ‘సిన్నర్స్’ చిత్రంలో నటనకు మైఖేల్ బి. జోర్డాన్ ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు. దీంతో పాటు వివిధ చిత్రాలకు, నటులకు వివిధ విభాగాల్లో అవార్డులు ప్రదానం చేశారు. మరి ఆస్కార్ లో సత్తా చాటిన సినిమాలు ఇప్పుడు ఏయే ఓటీటీల్లో అందుబాటులో ఉన్నాయో తెలుసుకుందాం రండి.

ఆస్కార్ గెల్చుకున్న సినిమాలు.. ఓటీటీ వివరాలు..

  • వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌ : జియో హాట్‌స్టార్‌
  • సిన్నర్స్‌ : జియో హాట్‌స్టార్‌
  • వెపన్స్‌: జియో హాట్‌స్టార్‌
  • ఫ్రాంకెన్‌స్టీన్‌ : నెట్‌ఫ్లిక్స్‌
  • F1 : యాపిల్‌ టీవీ
  • కెపాప్‌ డిమాన్‌ హంటర్స్‌ : ఈ యానిమేటెడ్‌ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్‌ అవుతోంది.
  • సెంటిమెంటల్‌ వాల్యూ : రెంటల్ బేస్ పద్ధతిలో అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, ఆపిల్‌ టీవీలలో అందుబాటులో ఉంది.
  • హామ్నెట్‌ : యాపిల్‌ టీవీలో రెంటల్ బేసిస్ పద్ధతిలో స్ట్రీమింగ్ అవుతోంది.
  • ఫ్రాంకెన్‌స్టైయిన్: నెట్‌ఫ్లిక్స్ఆ
  • ల్ ది ఎంప్లీ రూమ్స్: నెట్ ఫ్లి క్స్
  • సెంటిమెంటల్ వ్యాల్యూ: మబ్టే
  • పీపుల్ ఎక్స్ ఛేంజింగ్ సాల్వియా: యూట్యూబ్ది
  • గర్ల్ హై క్రైడ్ పెరల్స్ :ఇంకా ఏ ఓటీటీలోనూ స్ట్రీమింగ్ కు రాలేదు
  • అవతార్‌: ఫైర్‌ అండ్‌ యాష్‌ : ఇంకా ఏ ఓటీటీలోనూ స్ట్రీమింగ్ కు రాలేదు.
ఇవి కూడా చదవండి

గమనిక: ఈ చిత్రాలలో కొన్ని  మన ఇండియాలో అందుబాటులో లేవు. ఇంకొన్ని స్ట్రీమింగ్ కు రాలేదు .

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత