AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hema-Surekha Vani: ఈత కల్లు తాగుతూ ఎంజాయ్ చేసిన హేమ, సురేఖవాణి.. సీనియర్ ఆర్టిస్టుల హంగామా చూశారా? వీడియో

వందలాది సినిమాల్లో సహాయక నటులుగా మెప్పించిన హేమ, సురేఖ వాణి నిజ జీవితంలోనూ మంచి ఫ్రెండ్స్. ప్రస్తుతం పెద్దగా సినిమాల్లో కనిపించని వీరు ఫ్రెండ్స్ తో కలిసి ఒక పల్లెటూరుకు వెళ్లారు. అక్క ప్రకృతి ఒడిలో ఈత కల్లు తాగుతూ సేద తీరారు.

Hema-Surekha Vani: ఈత కల్లు తాగుతూ ఎంజాయ్ చేసిన హేమ, సురేఖవాణి.. సీనియర్ ఆర్టిస్టుల హంగామా చూశారా? వీడియో
Hema, Surekha Vani
Basha Shek
|

Updated on: Mar 19, 2026 | 6:29 AM

Share

టాలీవుడ్ సీనియర్ నటీమణులు హేమ, సురేఖ వాణిల గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. స్టార్ హీరోలు, హీరోయిన్లకు అమ్మగా, అక్కగా, అత్తగా, వదినగా.. ఇలా వీరు ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. వందలాది సినిమాల్లో నటించి మెప్పించారు. అయితే ఇప్పుడు హేమ, సురేఖ వాణి ఇద్దరూ పెద్దగా సినిమాలు చేయడం లేదు. తమ స్థానాల్లో తమ కూతుర్లను సినిమా ఇండస్ట్రీలో నిలబెట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉన్నారీ సీనియర్ యాక్టర్స్. తమ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి విషయాలను అందులోనే షేర్ చేసుకుంటున్నారు. కాగా ప్రస్తుతం తమ ఖాళీ టైమ్ ను బాగానే ఎంజాయ్ చేస్తున్నారు హేమ, సురేఖ వాణి. తాజాగా వీరు తమ స్నేహితులతో కలిసి హాలీడే ట్రిప్ కు వెళ్లారు. ఓ పల్లెటూరులోని తోటకు వెళ్లి బాగా ఎంజాయ్ చేశారు. అక్కడ హేమ, సురేఖ వాణిలు కలిసి స్వయంగా ఒక ఈత చెట్టు వద్దకు వెళ్లి, అక్కడ ఈత చెట్టుకు ఉన్న కల్లు కుండని తప్పించి, ఆ కుండ నుంచి కల్లును గ్లాసుల్లో వడ పోసుకుని, ఒకరికొకరు చీర్స్ చెప్పుకుంటూ తాగారు. ప్రకృతి ఒడిలో చాలా సరదాగా గడిపారు. సాధారణంగా సినిమాల్లో పద్ధతిగా కనిపించే వీరు బయట మాత్రం ఇలా ఫుల్ మాస్ స్టైల్‌లో కల్లు తాగుతూ కనిపించారు. అనంతరం ఇందుకు సంబంధించిన వీడియోను తమ సామాజిక మాధ్యమాల ఖాతాల్లో షేర్ చేసుకున్నారు.

ప్రస్తుతం హేమ, సురేఖ వాణీల వీడియో సోషల్ మీడియలో వైరల్ గా మారింది. సాధారణంగా వీరు పోస్ట్ చేసే ఫొటోలు, వీడియోలకు నెగెటివ్ కామెంట్స్ ఎక్కువగా వస్తుంటాయి. అయితే ఈ కల్లు తాగే వీడియోకు మాత్రం పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. నిజమైన హాలీడే మూడ్ అంటూ నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా సురేఖ వాణి ఇప్పుడు పూర్తిగా సినిమాలకు దూరమయ్యారు. ఆమె వారసురాలిగా కూతురు సుప్రితను హీరోయిన్ గా నిలబెట్టే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే మూడు సినిమాలకు కమిట్ అయ్యింది సుప్రిత.

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో..

ఇక హేమ విషయానికి వస్తే.. బెంగళూరు డ్రగ్స్ ఉదంతం తర్వాత సినిమాల నుంచి విరామం తీసుకుంది. సామాజిక మాధ్యమాల్లోనూ పెద్దగా కనిపించడం లేదు. అయితే అప్పుడప్పుడు ఇలా తన స్నేహితులు, బంధువులతో కలిసి కనిపిస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us