‘ఉస్తాద్’ డైరెక్టర్ లవ్ స్టోరీ.. ఫ్రెండ్ ప్రేమించిన అమ్మాయి తనకు ప్రపోజ్ చేస్తే హరీశ్ శంకర్ ఏం చేశాడో తెలుసా?
టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్లలో ఒకరైన హరీశ్ శంకర్ సినిమాల సంగతి తప్పితే వేరే విషయాలు పెద్దగా మాట్లాడారు. అయితే తన 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా ప్రమోషన్లలో మాత్రం తన పర్సనల్ లైఫ్ నకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

ఓజీ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తోన్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. పవన్ కల్యాణ్ ను గబ్బర్ సింగ్ గా చూపించి అందరి మన్ననలు అందుకున్న డైరెక్టర్ హరీశ్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కించాడు. శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లు గా నటించారు. అలాగే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ కమ్ యాక్టర్ పార్తీబన్ ఈ మూవీలో విలన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఉస్తాద్ భగత్ సింగ్ ఉగాది కానుకగా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్స్ అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. మరోవైపు చిత్ర బృందం చురుగ్గా ప్రమోషన్లు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ హరీశ్ శంకర్ పలు ఛానెల్స్ కు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ సందర్భంగా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఈ డ్యాషింగ్ డైరెక్టర్ తన చిన్ననాటి అనుభవాలను గుర్తు చేసుకున్నాడు.
‘చిన్నప్పటి నుంచి నేను ఏదో ఒకటి రాసేవాడిని. నేను బాగా రాస్తానని నా స్నేహితులు నాతో లవ్ లెటర్లు రాయించుకునే వారు. అయితే చివర్లో వాళ్ల పేరు రాయించి తీసుకెళ్లి అమ్మాయిలకు ఇచ్చేవాళ్లు. ఒకసారి ఒక ఫ్రెండ్ కి లెటర్ రాసి మర్చిపోయి చివర్లో ఫర్ ఎవర్ అని నా పేరు రాసేశాను. అది చూసుకోకుండా వాడు ఒక అమ్మాయికి ఆ లెటర్ ఇచ్చాడు. దీంతో ఆ అమ్మాయి నేను లెటర్ పంపించాను ఏమో అనుకోని నా వైపు చూడడం ప్రారంభించింది. నన్ను చూసి నవ్వడం చేసేది. సిగ్గు పడేది. ఆ తర్వాత ఆ అమ్మాయి వచ్చి హరీష్ నువ్వు నాకు ఎప్పట్నుంచో ఇష్టం అని చెప్పింది. దీంతో మీకు ఇష్టమే కానీ నాకు కష్టం. నా క్లోజ్ ఫ్రెండ్ నిన్ను ఇష్టపడ్డాడు. మర్చిపోయి నా పేరు రాసాను సారీ అని చెప్పి తప్పించుకున్నాను. ఇది నేను 9వ తరగతిలో ఉన్నప్పుడు జరిగింది’ అని అప్పటి క్షణాలను గుర్తుకు తెచ్చుకున్నాడు హరీశ్ శంకర్. ప్రస్తుతం ఈ డైరెక్టర్ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




