AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉస్తాద్ భగత్ సింగ్

ఉస్తాద్ భగత్ సింగ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో పాటు సినిమాలతోనూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఓ వైపు డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టి బిజీ ఉంటూనే.. సమయం దొరికినప్పుడు సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే గత ఏడాది రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. హరిహరవీరమల్లు సినిమాతో పాటు ఓజీ సినిమాతో ప్రేక్షకులను అలరించారు. వీటిలో ఓజీ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఇప్పుడు హరీష్ శంకర్ తో కలిసి ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా చేస్తున్నారు పవన్. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో గబ్బర్ సింగ్ అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే.. దాదాపు 14 ఏళ్ల తర్వాత రిపీట్‌ అవుతున్న కాంబినేషన్‌ కావడంతో  ఫ్యాన్స్ ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కాగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మార్చ్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇంకా చదవండి

తమ్ముడి సినిమా చూస్తూ తెగ ఎంజాయ్ చేసిన చిరు.. ఫ్యామిలీతో ఉస్తాద్ భగత్ సింగ్ చూసిన మెగాస్టార్..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన లేటెస్ట్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. హరీశ్ శంకర్ తెరకెక్కించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. అలాగే కోలీవుడ్ స్టార్ నటుడు, దర్శకుడు పార్తీబన్ విలన్ గా మెప్పించారు. మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు.

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్‌లో పూనకాలు తెప్పిస్తున్న ఆ మూడు సీన్స్ ఏంటో తెలుసా..?

డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటేస్ట్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్ ’. భారీ అంచనాల మధ్య ఉగాది సందర్భంగా మార్చి 19న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్, పవర్ స్టార్ కాంబోలో సినిమా కావడంతో ఈ మూవీపై ముందు నుంచి అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి

నైజాంలో హైక్స్‌ లేకుండానే వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్.. ఇండస్ట్రీకి టార్చ్ బేరర్ అవుతారా?

పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం నైజాంలో నార్మల్ టికెట్ రేట్లతో విడుదలవుతోంది. పెద్ద సినిమాలకు టికెట్ ధరలు పెంచే ఆనవాయితీని బ్రేక్ చేస్తూ, ఈ సినిమా ప్రేక్షకుల వద్దకు వస్తోంది. ఇది టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్‌ను సెట్ చేస్తుందా, భవిష్యత్ సినిమాలకు టార్చ్ బేరర్ అవుతుందా అనేది చర్చనీయాంశంగా మారింది.

Ustaad Bhagat Singh Movie Review: ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రివ్యూ.. గబ్బర్ సింగ్ మ్యాజిక్ రిపీట్ అయిందా..?

'గబ్బర్ సింగ్' లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన సినిమా కావడంతో 'ఉస్తాద్ భగత్ సింగ్' పై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉగాది కానుకగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.

Ustaad Bhagat Singh Twitter Review: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్విట్టర్ రివ్యూ.. పవన్ సినిమా టాక్ ఎలా ఉందంటే?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ ఉగాది కానుకగా ఇవాళ (మార్చి 19న) ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ లో ఉదయం 4 గంటలకు బెనిఫిట్ షోలు ప్రదర్శించగా.. తెలంగాణలో 7 గంటల ఆటతో థియేటర్లలో విడుదలైంది. ఇక అర్థరాత్రి నుంచే యూఎస్ ప్రీమియర్స్ కూడా పడ్డాయి.

Sreeleela: మ‌హేష్ వైపు సీరియస్ లుక్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఈవెంట్‌లో ఏం జరిగిందో చెప్పేసిన శ్రీలీల‌

ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా హీరోయిన్ శ్రీ లీల, నటుడు మహేష్ అచంటకు సంబంధించిన ఒక వీడియో బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై సోషల్ మీడియాలో ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. తాజాగా ఈ వైరల్ వీడియోపై శ్రీలీల కూడా స్పందించింది.

‘ఉస్తాద్’ డైరెక్టర్ లవ్ స్టోరీ.. ఫ్రెండ్ ప్రేమించిన అమ్మాయి తనకు ప్రపోజ్ చేస్తే హరీశ్ శంకర్ ఏం చేశాడో తెలుసా?

టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్లలో ఒకరైన హరీశ్ శంకర్ సినిమాల సంగతి తప్పితే వేరే విషయాలు పెద్దగా మాట్లాడారు. అయితే తన 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా ప్రమోషన్లలో మాత్రం తన పర్సనల్ లైఫ్ నకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

పవన్ కళ్యాణ్ మాస్ రాంపేజ్.. ఉస్తాద్ భగత్ సింగ్’ ఇన్‌సైడ్ రిపోర్ట్

తెలుగు రాష్ట్రాల్లో మరోసారి పవర్ స్టార్ మేనియాతో ఊగిపోతున్నాయి. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఉగాది కానుకా మార్చి 19న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా సాంగ్స్, ట్రైలర్ కు అభిమానుల నుంచి ఓ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది.

Ustaad Bhagat Singh : ఉస్తాద్ భగత్ సింగ్ బుకింగ్స్ ఓపెన్.. నైజాంలో టికెట్ ధరలు ఎలా ఉన్నాయంటే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. చాలా కాలంగా రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్.. ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తున్నారు. ఇటీవలే ఓజీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో ఉగాది పండక్కి థియేటర్లలో సందడి చేయబోతున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్ జరుగుతున్న సంగతి తెలిసిందే.

Pawan Kalyan: రాజకీయాల్లోకి రావచ్చుగా.. హీరోయిన్‌కు పవన్ కళ్యాణ్ ఆఫర్.. కానీ ఆమె ఏం చెప్పిందంటే

గబ్బర్ సింగ్’ వంటి సంచలన విజయం తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ కలయికలో వస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

Pawan Kalyan: భారీగా పెరిగిన ఉస్తాద్ అంచనాలు.. కలెక్షన్ల సునామీ ఖాయమా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. మొదట్లో ఈ ప్రాజెక్ట్‌పై పెద్దగా హైప్ లేకపోయినా, షూటింగ్ ఆలస్యం మరియు పవన్ రాజకీయాల వల్ల సినిమా వస్తుందా అన్న సందేహాలు వచ్చాయి. అయితే ఇప్పుడు రిలీజ్ సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఫ్యాన్స్‌లో ఆసక్తి, అంచనాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి.

Harish Shankar : నా దేవుడు ఆయనే.. కష్టాల్లో కుంగిపోతే ఆదుకున్నారు.. హరీష్ శంకర్ ఎమోషనల్ స్పీచ్..

గబ్బర్ సింగ్ వంటి సంచలన విజయం తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఉగాది పండగ సందర్భంగా ఈ సినిమాను మార్చి 19న రిలీజ్ చేస్తున్నారు.

కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన తెలుగు తేజం
కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన తెలుగు తేజం
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దివ్వెల మాధురి.. మూవీ టైటిల్ మామూలుగా..
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దివ్వెల మాధురి.. మూవీ టైటిల్ మామూలుగా..
ఒకే ఒక్కడు.. ఐపీఎల్‌ చరిత్రలో కోహ్లీ సరికొత్త రికార్డు..
ఒకే ఒక్కడు.. ఐపీఎల్‌ చరిత్రలో కోహ్లీ సరికొత్త రికార్డు..
ఈ కొరత కృత్రిమమా? లేక, పాపమంతా హర్మూజ్‌దేనా?
ఈ కొరత కృత్రిమమా? లేక, పాపమంతా హర్మూజ్‌దేనా?
1989 సంవత్సరం టాలీవుడ్‌కు ఓ సువర్ణాధ్యాయం..
1989 సంవత్సరం టాలీవుడ్‌కు ఓ సువర్ణాధ్యాయం..
ఏపీలో అంగన్వాడీ కేంద్రాల్లో 5 వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్
ఏపీలో అంగన్వాడీ కేంద్రాల్లో 5 వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్
మెరుపు మూవీ స్టార్ట్ అయిన 15 రోజులకే ఎందుకు ఆగిపోయిందో తెల్సా
మెరుపు మూవీ స్టార్ట్ అయిన 15 రోజులకే ఎందుకు ఆగిపోయిందో తెల్సా
ఉల్లిపాయలు ఎన్ని నెలలైన ఫ్రెష్‌గా ఉండాలా.. ఈ 5 సింపుల్ ట్రిక్స్..
ఉల్లిపాయలు ఎన్ని నెలలైన ఫ్రెష్‌గా ఉండాలా.. ఈ 5 సింపుల్ ట్రిక్స్..
తీవ్ర విషాదం.. చూస్తుండగానే ముగినిపోయిన 11 ఏళ్ల బాలుడు.. వీడియో
తీవ్ర విషాదం.. చూస్తుండగానే ముగినిపోయిన 11 ఏళ్ల బాలుడు.. వీడియో
డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌గా ఆధార్ పనికిరాదా..? కేంద్రం ప్రకటన..
డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌గా ఆధార్ పనికిరాదా..? కేంద్రం ప్రకటన..