వి ప్రవీణ్ కుమార్, టీవీ 9 తెలుగు ఛానెల్‌లో ఎంటర్‌టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్, ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నాను. 2011లో NTVలో నా కెరీర్ ప్రారంభించాను. అనంతరం 2018 నుంచి 2022 వరకు News18 Telugu వెబ్ సైట్‌లో సినిమా చీఫ్ ఎడిటర్‌గా పని చేసాను. ఎలక్ట్రానిక్, డిజిటల్ రంగంలో 13 సంవత్సరాల అనుభవం ఉంది.
Music Trend: టాలీవుడ్‌లో నయా హిట్ ట్రెండ్ ఇది.. సినిమాల్లో పాపులర్ ప్రైవేట్ సాంగ్స్
టాలీవుడ్ సినిమాల్లో ఈ మధ్య ప్రైవేట్ సాంగ్స్ ట్రెండ్ ఎక్కువైపోయింది. ఈ మధ్య ఏ పాట విన్నా కూడా ఈ ట్యూన్ ఎక్కడో విన్నట్లుందే అనిపిస్తుంది. దానికి కారణం అవి ప్రైవేట్ సాంగ్స్ కావడమే. పాతికేళ్ళ కింది నుంచే వీటి దూకుడు కనిపిస్తుంది. అప్పట్లో పవన్ కళ్యాణ్ తమ్ముడు సినిమా కోసం ఏం పిల్లా మాటాడవా అనే పాట పాడారు.
- Praveen Vadla
- Updated on: Feb 19, 2025
- 5:54 pm
Puri Jagannadh: పాపం పూరీ జగన్నాథ్.. పీత కష్టాలు పీతవి.. పూరీ కష్టాలు పూరీవి..!
Puri Jagannadh Career Update: పూరీ జగన్నాథ్. ఒక్కప్పుడు ఆయన టాలీవుడ్ ఇండస్ట్రీలో హిట్ మూవీస్‌కు కేరాఫ్ అడ్రస్. అయితే కాలం మారింది. దర్శకుడు పూరీ జగన్నాథ్ టైమ్ కూడా రివర్స్ అయ్యింది. డబుల్ స్మార్ట్, లైగర్ వంటి డిజాస్టర్లతో కెరీర్ చిక్కుల్లో పడింది. అయితే పడినా లేవడం.. లేచి పరిగెత్తడం తెలిసిన పూరీ.. ఇప్పుడు కెరీర్‌ను ఎలా రివైవ్ చేసుకుంటారన్న ఆసక్తి ఇండస్ట్రీ జనంతో పాటు అటు ఆయన ఫ్యాన్స్‌లోనూ ఉంది.
- Praveen Vadla
- Updated on: Feb 19, 2025
- 4:35 pm
Manchu Manoj: జల్లికట్టు వేడుకల్లో మంచు మనోజ్.. TDP, జనసేన నేతల ఘన స్వాగతం..!
తిరుపతిలోని చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన జల్లికట్టు వేడుకలకు మంచు మనోజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఆయన్ని చూడ్డానికి చాలా మంది అభిమానులు హాజరయ్యారు. అంతేకాదు ముఖ్య అతిథిగా వచ్చిన మంచు మనోజ్‌కు టిడిపి, జనసేన, ఎన్టీఆర్ అభిమానులు గ్రాండ్ వెల్‌కమ్ పలికారు.
- Praveen Vadla
- Updated on: Feb 17, 2025
- 7:53 pm
Tollywood: ఇండస్ట్రీలో నయా ట్రెండ్.. హీరోయిన్స్ పంట పండిస్తున్న నిర్మాతలు..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు నయా ట్రెండ్ నడుస్తోంది. ఒకే హీరోయిన్‌కి రెండు మూడు ఆఫర్లు ఇస్తున్నారు నిర్మాతలు. ఏంటి నమ్మరా.. ఒక్కరో ఇద్దరో అయితే కాకతాళీయం అనుకోవచ్చు. ప్రతీ హీరోయిన్‌కు ఇదే జరుగుతుంటే ఎందుకు నమ్మరు..? ఓ ప్రొడక్షన్ హౌజ్‌లోకి ఎవరైనా హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిందంటే కనీసం రెండు మూడు సినిమాలకు సైన్ చేయిస్తున్నారు నిర్మాతలు.
- Praveen Vadla
- Updated on: Feb 17, 2025
- 7:42 pm
Directors: మీకో దండం దూత.. త్వరగా కమ్ బ్యాక్ ఇవ్వండి సామీ..!
ఇండస్ట్రీలో వరుస హిట్స్‌తో ఒకప్పుడు ఓ రేంజ్‌లో వెలిగిన దర్శకులు. ఇప్పుడు ఒక్క హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇండస్ట్రీలో మళ్లీ తలెత్తుకుని తిరగాలంటే ఆ హిట్ వాళ్లకు చాలా అవసరం. అందుకే ఆ హిట్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. తేడా వస్తే ఆడియన్స్ తమను మర్చిపోయే పరిస్థితి ఉండటంతో వారు కెరీర్ పట్ల కాస్త ఆందోళన కూడా చెందుతున్నారు.
- Praveen Vadla
- Updated on: Feb 17, 2025
- 7:10 pm
హాట్ టాపిక్‌గా నాని రెమ్యునరేషన్.. ఇండస్ట్రీలో ఈయన రేంజ్ ఏంటో తెలుసా..?
Nani Remuneration: వరుస సినిమాలు, విజయాలతో న్యాచురల్ స్టార్ నాని జోరు కొనసాగిస్తూనే ఉన్నారు. రెండేళ్ళ కింద దసరా, హాయ్ నాన్నతో విజయాలు అందుకున్న నాని.. గతేడాది సరిపోదా శనివారంతో మరో రూ.100 కోట్ల హిట్ సినిమా ఇచ్చాడు. విజయాలే కాదు.. నాని రెమ్యునరేషన్ కూడా ఇప్పుడు ట్రెండింగే. నాని మళ్ళీ రేట్ పెంచాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. గతంలో రూ.20 కోట్ల వరకు తీసుకునే నాని.. ఇప్పుడు మరో..
- Praveen Vadla
- Updated on: Feb 7, 2025
- 6:31 pm
Naga Chaitanya: తండేల్‌తో నాగ చైతన్యకు ఆ సీన్ మరోసారి అర్థమైనట్లేనా..?
మాస్ హీరో అనిపించుకోవాలని ప్రతి హీరోకీ ఉంటుంది. అలాగే నాగ చైతన్య కూడా మాస్ హీరోగా ప్రూవ్ చేసుకోవాలని ఉవ్విళ్లూరుతూనే ఉన్నాడు. ఆ దిశగా చాలా అడుగులు వేస్తూనే ఉన్నాడు. కానీ మాస్ హీరోగా ఒక్కసారి కూడా హిట్ కొట్టలేకపోయాడు. అప్పుడెప్పుడో తడాఖాతో కాస్త ఓకే అనిపించినా.. ఆ తర్వాత ఏదీ వర్కవుట్ కాలేదు. ప్రేమకథలు మాత్రమే చైతూకు ఎప్పుడూ కలిసొచ్చాయి. ఇప్పుడు మరోసారి లవ్ స్టోరీతో వచ్చిన తండేల్‌తో హిట్ కొట్టేలాగే కనిపిస్తున్నాడు నాగ చైతన్య.
- Praveen Vadla
- Updated on: Feb 7, 2025
- 5:59 pm
Ravi Teja: పాత రూటులో రవితేజ.. మాస్ జాతరపై మాస్ రాజా భారీ ఆశలు..!
గత పదేళ్ళులో కేవలం ఒక్క హిట్ ఇచ్చిన రవితేజ.. రెండు మూడు ఫ్లాపులిచ్చారు. ఈ మధ్య మాస్ రాజా నుంచి వచ్చిన కొన్ని సినిమాలు చూశాక.. కేవలం రెమ్యునరేషన్ కోసమే సినిమాలు ఒప్పుకుంటున్నాడా ఏంటి అనే విమర్శలు ఫ్యాన్స్ నుంచే వచ్చాయి. నాలుగేళ్ళ కింద క్రాక్‌తో బ్లాక్‌బస్టర్ కొట్టి ఫామ్‌లోకి వచ్చిన రవితేజ.. ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీతో మళ్లీ ట్రాక్ తప్పారు.
- Praveen Vadla
- Updated on: Feb 7, 2025
- 5:50 pm
Ram Charan: మెగా వారసుడు కసి మీదున్నాడుగా.. RC16 ఇదే ఏడాది వస్తుందా..?
RC16 Movie Update: షూటింగ్ కూడా మొదలు కాకముందే రాంచరణ్ మూవీ RC16ను నేషనల్ వైడ్ ట్రెండ్ అయిపోతోంది. ఇప్పుడు షూటింగ్ అవుతున్న కొద్దీ దేశమంతా తన సినిమా గురించి మాట్లాడుకునేలా చేస్తున్నాడు దర్శకుడు బుచ్చిబాబు. కేవలం ఒక్క సినిమా అనుభవంతో అద్భుతాలు చేస్తున్నాడు బుచ్చిబాబు. రేపు RC16 ఎలా ఉండబోతుందో అనే విషయం పక్కనబెడితే.. ముందు ఈ ప్రాజెక్ట్‌ను బుచ్చిబాబు సెట్ చేస్తున్న విధానానికే అందరూ ఫిదా అయిపోతున్నారు.
- Praveen Vadla
- Updated on: Feb 7, 2025
- 5:03 pm
Ticket Hikes: సినిమా టికెట్ల పంచాయతీ.. తెలంగాణలో ఇలా.. ఆంధ్రాలో అలా..!
భారీ బడ్జెట్ సినిమాలు విడుదలవుతున్నాయంటే చాలు.. నిన్నమొన్నటి వరకు రెండు తెలుగు ప్రభుత్వాలు నిర్మాతలకు తీపికబురు చెప్పేవి.. కానీ ఇప్పుడు ఆ రెండిట్లో తెలంగాణ లేదు. ఎందుకంటే పుష్ప 2 సంధ్య ఘటన తర్వాత పరిస్థితులన్నీ చాలా వేగంగా మారిపోయాయి. దానికితోడు ఇండస్ట్రీలో మారిన సిచ్యువేషన్స్ దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం సినిమాల టికెట్ హైక్స్‌కు నో చెప్పింది..
- Praveen Vadla
- Updated on: Feb 5, 2025
- 7:07 pm
Pawan Kalyan: ఫ్యాన్స్ మాట పవన్ వింటారా..? వాళ్లు చెప్పింది చేస్తారా..?
పవన్ కళ్యాణ్‌తో సినిమా అంటే ఎలా ఉంటుందో అన్నీ తెలిసే ఆయనతో సినిమాలు చేయడానికి నిర్మాతలు కమిటయ్యారు. అడ్వాన్సులు కూడా ఇచ్చారు. ఆయన అధికారంలో లేనపుడే కాల్షీట్స్ ఎప్పుడు ఇస్తారో క్లారిటీ ఉండేది కాదు.. ఇప్పుడాయన డిప్యూటీ సిఎం.. మరో మూడు నాలుగు శాఖలు ఆయన చేతిలో ఉన్నాయి. ఇలాంటి సమయంలో పవన్ నుంచి సినిమాలు ఆశించడం అనేది అత్యాశే అవుతుంది. అయితే ఆయన ఒప్పుకున్న సినిమాల్లో దాదాపు అన్నీ చివరి దశకు వచ్చేయడం ఒక్కటే కాస్త ఊరటనిచ్చే విషయం.
- Praveen Vadla
- Updated on: Feb 5, 2025
- 6:58 pm
Rag Mayur: ఈ కుర్రాడు టాకాఫ్ ది ఇండస్ట్రీ ఇప్పుడు.. ఎవరీ రాగ్ మయూర్..?
సినిమా ఇండస్ట్రీలో ఎవరి టైమ్ ఎప్పుడు ఎలా టర్న్ అవుతుందో చెప్పడం కష్టం. ఎందుకంటే ఒక్కోసారి ఒక్క రోజులోనే జాతకాలు మారిపోతుంటాయి. అలా ఈ మధ్య సోషల్ మీడియాతో పాటు ఇండస్ట్రీలోనూ ఎక్కువగా వినిపిస్తున్న పేరు రాగ్ మయూర్. ఇంతకీ టాకాఫ్ ది ఇండస్ట్రీగా మారిన రాగ్ ఎవరు అనుకుంటున్నారు కదా..? అయితే ఈ స్టోరీ చదివేయాల్సిందే..
- Praveen Vadla
- Updated on: Feb 5, 2025
- 4:44 pm