AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన విజయ్ సేతుపతి, అరవింద్ స్వామిల మూకీ సినిమా.. IMDB టాప్ రేటింగ్ మూవీ

కోలీవుడ్ స్టార్స్ విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ జనవరి 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీకి విమర్శకుల ప్రశంసలు వచ్చాయి. అలాగే ఆడియెన్స్ నుంచి పాజిటివ్ రివ్యూలు కూడా వచ్చాయి.

OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన విజయ్ సేతుపతి, అరవింద్ స్వామిల మూకీ సినిమా.. IMDB టాప్ రేటింగ్ మూవీ
Gandhi Talks Movie
Basha Shek
|

Updated on: Feb 28, 2026 | 8:51 AM

Share

వెండితెరపై మూకీ చిత్రాల యుగం ఎప్పుడో ముగిసింది. అప్పుడెప్పుడో కమల్ హాసన్ పుష్పక విమానం సైలెంట్ సినిమాగా ఆడియెన్స్ మెప్పు పొందింది. అయితే ఇప్పుడు ఇదే తరహాలో ఎలాంటి డైలాగులు లేకుండా కేవలం ఎక్స్‌ప్రెషన్స్, మ్యూజిక్‌, ఎమోషన్స్‌తోనే ఓ సినిమా వచ్చింది. ఇందులో కోలీవుడ్ స్టార్స్ విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అదితీ రావు హైదరీ ప్రధాన పాత్రల్లో నటించారు. జనవరి 30న థియేటర్‌లో విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించింది. డిఫరెంట్ కాన్సెప్ట్ అని రివ్యూలు వచ్చాయి. సినిమా మొత్తంలో ఎలాంటి డైలాగులు లేనప్పటికీ ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో సినిమాకు ప్రాణం పోశారు. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ సినిమా ఇప్పుడు సైలెంట్ గా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అది కూడా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో శనివారం (ఫిబ్రవరి 28) అర్ధరాత్రి నుంచి ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చింది.

కిశోర్ పాండురంగ్ తెరకెక్కించిన గాంధీ టాక్స్ సినిమాలో మహేశ్ మంజ్రేకర్, సిద్దార్థ్ జాదవ్, జరీనా వహాబ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. జీ స్టూడియోస్, క్యూరియస్ మూవీ మిల్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. సినిమాలో ఎలాంటి డైలాగ్స్ ఉండవు. కేవలం ఎక్స్‌ప్రెషన్స్, మ్యూజిక్‌, ఎమోషన్స్‌తోనే మూవీ మొత్తం నడిపించారు. కాబట్టి భాషతో సంబంధం లేకుండా గాంధీ టాక్స్ సినిమాను చూడొచ్చు. అయితే ఇంగ్లిష్ లో సబ్‌టైటిల్స్‌ ఉంటాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా కేవలం రెంటల విధానంలో మాత్రమే అందుబాటులో ఉంది. అంటే సినిమా చూడాలంటే రూ. 279 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే త్వరలోనే ఈ మూవీ ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర