AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: కారులో ఒంటరిగా వెళ్తే ఫైన్ వేస్తారా..? సోషల్ మీడియా ప్రచారంపై పోలీసుల క్లారిటీ..

కారులో ఒక్కరే ప్రయాణిస్తే ఇకపై భారీ జరిమానా తప్పదా..? దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ వార్ వైరల్‌గా మారింది. దీంతో వాహనదారులు గందరగోళానికి గురయ్యారు. నిజంగా ప్రభుత్వం ఇలాంటి కొత్త నిబంధన ఏమైనా తీసుకొచ్చిందా? ఈ వైరల్ ప్రచారం వెనుక ఉన్న అసలు నిజమేంటో పోలీసులు, ఫ్యాక్ట్‌చెక్ విభాగం స్పష్టం చేశాయి.

Hyderabad: కారులో ఒంటరిగా వెళ్తే ఫైన్ వేస్తారా..? సోషల్ మీడియా ప్రచారంపై పోలీసుల క్లారిటీ..
No Fine For Travelling Alone In A Car In Telangana
Ashok Bheemanapalli
| Edited By: |

Updated on: Nov 26, 2026 | 7:37 PM

Share

తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కారులో ఒంటరిగా ప్రయాణించే వాహనదారులకు ఇకపై జరిమానాలు విధించనున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం కలకలం రేపింది. ఈ వైరల్ వార్తలపై తెలంగాణ పోలీస్ శాఖ, రాష్ట్ర ప్రభుత్వ ఫ్యాక్ట్‌చెక్ విభాగం స్పందించి పూర్తి స్పష్టత ఇచ్చాయి. కారులో డ్రైవర్ ఒక్కరే ప్రయాణిస్తే ట్రాఫిక్ చలాన్ విధిస్తారని, ఇందుకు సంబంధించి ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొస్తోందంటూ పలు సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టులు చక్కర్లు కొట్టాయి. అయితే ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని పోలీసులు తేల్చిచెప్పారు. ఒంటరిగా కారు నడిపేవారిపై జరిమానాలు విధించే ఆలోచన కానీ, అలాంటి ప్రతిపాదన కానీ ప్రభుత్వ పరిశీలనలో అసలు లేదని స్పష్టం చేశారు.

అసలు గందరగోళం ఎక్కడ మొదలైంది?

ఇటీవల హైదరాబాద్ ఐటీ కారిడార్ సహా నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు పోలీసులు వాహనదారులకు కొన్ని విజ్ఞప్తులు చేశారు. ఒకే మార్గంలో, ఒకే ఆఫీసులకు వెళ్లేవారు వేర్వేరు కార్లలో కాకుండా కార్‌పూలింగ్ ఎంచుకోవాలని, సాధ్యమైనంత వరకు ప్రజా రవాణాను వినియోగించుకోవాలని సూచించారు. ఈ సూచనలను కొందరు తప్పుగా అర్థం చేసుకుని, కార్‌పూలింగ్ చేయకపోతే ఫైన్ వేస్తారంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. దీనిపై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం. రమేష్ రెడ్డి, హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు కమిషనర్ జోయెల్ డేవిస్ సైతం స్పందిస్తూ, ఎలాంటి జరిమానాల ప్రతిపాదన లేదని స్పష్టం చేశారు.

తెలంగాణ ఫ్యాక్ట్‌చెక్ విభాగం హెచ్చరిక

ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వ ఫ్యాక్ట్‌చెక్ విభాగం ఎక్స్ వేదికగా అధికారిక ప్రకటన విడుదల చేసింది. కార్‌పూలింగ్‌పై పోలీసులు చేసిన అవగాహన సూచనలను జరిమానాలతో ముడిపెడుతూ ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని కోరింది. ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే సోషల్ మీడియా ఖాతాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ అధికారులు హెచ్చరించారు.

వాహనదారులకు పోలీసుల సూచన

నగర రహదారులపై వాహనాల ఒత్తిడిని తగ్గించి, ప్రయాణ సమయాన్ని ఆదా చేసుకోవడానికి ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని పోలీసులు వెల్లడించారు. అందుకే స్వచ్ఛందంగా కార్‌పూలింగ్, మెట్రో, బస్సు వంటి ప్రజా రవాణా వ్యవస్థలను ఉపయోగించుకోవాలని కోరారే తప్ప, ఎవరిపైనా బలవంతపు నిబంధనలు లేదా జరిమానాలు విధించడం లేదని స్పష్టం చేశారు. కాబట్టి వాహనదారులు సోషల్ మీడియా వదంతులను నమ్మి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

Follow Us
కారులో ఒంటరిగా వెళ్తే ఫైన్ వేస్తారా..? సోషల్ మీడియా ప్రచారంపై..
కారులో ఒంటరిగా వెళ్తే ఫైన్ వేస్తారా..? సోషల్ మీడియా ప్రచారంపై..
ఈ నెల 30 నుంచి పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు!
ఈ నెల 30 నుంచి పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు!
సున్నా కనిపెట్టకముందు సంఖ్యలను ఎలా రాసేవారు?
సున్నా కనిపెట్టకముందు సంఖ్యలను ఎలా రాసేవారు?
ఏడాదిగా ఓటీటీని షేక్ చేస్తున్న మూవీ.. ఇప్పుడు మళ్లీ ట్రెండింగ్..
ఏడాదిగా ఓటీటీని షేక్ చేస్తున్న మూవీ.. ఇప్పుడు మళ్లీ ట్రెండింగ్..
మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఇంట్లోనే ఉంటుందా?
మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఇంట్లోనే ఉంటుందా?
తాజ్‌మహల్‌లో అడుగుపెట్టాలంటే జంకుతున్న టూరిస్టులు!
తాజ్‌మహల్‌లో అడుగుపెట్టాలంటే జంకుతున్న టూరిస్టులు!
బ్యాంక్ ఆఫ్ బరోడా : తక్కువ వడ్డీకే రూ.5 కోట్ల వరకు ఈవీ లోన్ !
బ్యాంక్ ఆఫ్ బరోడా : తక్కువ వడ్డీకే రూ.5 కోట్ల వరకు ఈవీ లోన్ !
ముగ్గురు హాఫ్ సెంచరీలు.. శ్రీలంక ముందు భారత్ భారీ టార్గెట్
ముగ్గురు హాఫ్ సెంచరీలు.. శ్రీలంక ముందు భారత్ భారీ టార్గెట్
పైసా ఖర్చు లేకుండా తయారుచేసే 5 పవర్‌ఫుల్ ఆర్గానిక్ పెస్టిసైడ్స్
పైసా ఖర్చు లేకుండా తయారుచేసే 5 పవర్‌ఫుల్ ఆర్గానిక్ పెస్టిసైడ్స్
గుడ్ న్యూస్.. నాంపల్లి మెట్రో స్టేషన్‌కు నేరుగా ఫుట్ఓవర్ బ్రిడ్జి
గుడ్ న్యూస్.. నాంపల్లి మెట్రో స్టేషన్‌కు నేరుగా ఫుట్ఓవర్ బ్రిడ్జి