AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: వెన్నులో వణుకు పుట్టించే క్షుద్ర పూజలు.. ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు లేటెస్ట్ హారర్ థ్రిల్లర్

కొన్ని రోజుల క్రితమే ఈ హారర్ థ్రిల్లర్ మూవీ థియేటర్లలో విడుదలైంది. క్షుద్ర పూజలు, చేతబడుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ ఆడియెన్స్ ను బాగానే ఆకట్టుకుంది. అయితే లాంగ్ రన్ మాత్రం కొనసాగించలేకపోయింది. థియేటర్లలో ఆడియెన్స్ ను భయపెట్టిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.

OTT Movie: వెన్నులో వణుకు పుట్టించే క్షుద్ర పూజలు.. ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు లేటెస్ట్ హారర్ థ్రిల్లర్
OTT Movie
Basha Shek
|

Updated on: Feb 27, 2026 | 7:51 AM

Share

నవీన్ చంద్ర నటించిన లేటెస్ట్ సినిమా హనీ. గతంలో పలాస, శ్రీదేవి సోడా సెంటర్, మట్కా వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కరుణ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. చేతబడులు, క్షుద్ర పూజల నేపథ్యంలో తెరకెక్కిన ఈ హారర్ థ్రిల్లర్ మూవీలో దివ్య పిళ్లై, దివి వాద్త్యా, రాజా రవీంద్ర, బేబీ జయన్ని తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 6న విడుదలైన థియేటర్లలో విడుదలైన ఈ సినిమా పర్వాలేదనిపించింది. . పిల్లి మాయ కాన్సెప్ట్ తో డార్క సైకలాజికల్ థ్రిల్లర్ గా ఈ మూవీని రూపొందించాడు కరుణ కుమార్. పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్ ఆకట్టుకునేలా ఉండడంతో రీలీజ్ కు ముందే ఈ మూవీపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. అందుకు తగ్గట్టుగానే థియేటర్లలో ఆడియెన్స్ ను ఓ మోస్తరుగా ఓ మోస్తరు గానే భయపెట్టింది. కథ, కథనాలు, బ్యాగ్రౌండ్ స్కోర్, క్లైమాక్స్ ఎపిసోడ్ బాగానే ఉన్నాయని రివ్యూలు వచ్చాయి. అయితే మోతాదుకు మించిన వయొలెన్స్ కారణంగా ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ సినిమాకు దూరమయ్యారన్న కామెంట్స్ వినిపించాయి. థియేటర్లలో సినిమా లాంగ్ రన్ కాకపోవడానికి ఇదే కారణమని సినిమా నిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే ఐఎండీబీలో ఈ మూవీకి మంచి రేటింగ్ రావడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఇప్పుడీ హనీ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సన్ నెక్ట్స్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం (ఫిబ్రవరి 27) అర్ధరాత్రి నుంచే ఈ హారర్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

రెండు ఓటీటీల్లోనూ స్ట్రీమింగ్..

అయితే హానీ సినిమా ఓటీటీ రిలీజ్ నేపథ్యంలో హీరో నవీన్ చంద్ర ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశాడు. సన్ నెక్ట్స్ తో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియోలోనూ ఈ హారర్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ అవుతుందని ప్రకటించారు. అంటే ప్రస్తుతం ఈ మూవీ రెండు ఓటీటీల్లోనూ అందుబాటులో ఉందన్న మాట. ఓవా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రవి పీట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డి సంయుక్తంగా ఈ హానీ మూవీని నిర్మించారు. థియేటర్లలో పెద్దగా ఆడని ఈ మూవీ ఫిబ్రవరి 27 నుంచి స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. థియేటర్లలో ఆడని సినిమాలు, మరీ ముఖ్యంగా హారర్ థ్రిల్లర్ మూవీస్ ఈ మధ్యన ఓటీటీలో ఎక్కువగా ఆదరణ పొందుతున్నాయి. దీంతో హానీ మూవీ విషయంలోనూ ఇదే జరుగుతుందని నిర్మాతలు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర