AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saanve Megghana: ఈ తెలుగు హీరోయిన్ తమ్ముడు కూడా టాలీవుడ్‌లో క్రేజీ హీరో అని తెలుసా? ఏయే సినిమాలు చేశాడంటే?

చేసింది కొన్ని సినిమాలే అయినా తన క్యూట్ యాక్టింగ్, ఎక్స్ ప్రెషన్స్ తో యూత్ కు ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయింది శాన్వీ మేఘన. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఈ అమ్మడు ఇప్పుడు పలు సినిమాల్లో నటిస్తోంది. ఇటీవలే అనగనగా ఒక రాజు సినిమాలో స్పెషల్ సాంగ్ లోనూ సందడి చేసిందీ అందాల తార.

Saanve Megghana: ఈ తెలుగు హీరోయిన్ తమ్ముడు కూడా టాలీవుడ్‌లో క్రేజీ హీరో అని తెలుసా? ఏయే సినిమాలు చేశాడంటే?
Saanve Megghana
Basha Shek
|

Updated on: Feb 25, 2026 | 8:08 PM

Share

శాన్వీ మేఘన.. కర్లీ హెయిర్ తో క్యూట్ గా కనిపించే ఈ అమ్మడి గురించి తెలుగు ఆడియెన్స్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కొన్ని సినిమాల్లో నటించినా నా తన క్యూట్ యాక్టింగ్ అండ్ ఎక్స్ ప్రెషన్స్ తో కుర్రకారుకు తెగ నచ్చేసిందీ అందాల తార. తెలంగాణ ప్రాంతానికి చెందిన శాన్వి మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఈ మూవీలో ఆమె ఓ చిన్న పాత్రలో నటించింది. ఆ తర్వాత 2019 లో బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆపై పిట్ట కథలు, పుష్పక విమానం, ప్రేమ విమానం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్, టుక్ టుక్, కుడుంబస్థాన్ తదితర సినిమాల్లో కథానాయికగా యాక్ట్ చేసింది. తన క్యూట్ యాక్టింగ్ , ఎక్స్ ప్రెషన్స్ తో తెలుగు ఆడియెన్స్ కు ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయింది. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ శాన్వీకి ఓ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తను షేర్ చేసే ఫొటోలు, వీడియోలకు నెటిజన్ల నుంచి షేర్లు, లైకులు, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది. అయితే సినిమాల పరంగా తప్పితే శాన్వీ మేఘన పర్సనల్ లైఫ్ గురించి చాలా మందికి తెలియదు. ఆమె తమ్ముడు కూడా టాలీవుడ్ లో హీరోగా రాణిస్తున్నాడు. ఇంతకీ అతను ఎవరనుకుంటున్నారా?

గతేడాది క్రిస్మస్ కానుకగా పతంగ్ అనే ఒక చిన్న సినిమా రిలీజైన సంగతి తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుక వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. హైదరాబాద్ సంస్కృతి, గాలి పటాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ ఇటీవలే ఓటీటీలోకి వచ్చింది. థియేటర్లలో యూత్ ను ఆకట్టుకున్న ఈ మూవీ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ లోనూ అదరగొడుతోంది. ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ లో నటించింది అందరూ కొత్త వాళ్లే కావడం గమనార్హం. అందులో వంశీ పూజిత్, ప్రణవ్ కౌశిక్ ప్రధాన పాత్రలు పోషించారు. వీరిలో వంశీ పూజిత్ హీరోయిన్ శాన్వీ మేఘనకు సోదరుడు.

ఇవి కూడా చదవండి

పతంగ్ సినిమా హీరోతో శాన్వి మేఘన

MBA పూర్తిచేసి సినిమాల్లోకి వచ్చాడు వంశీ. గతంలో బ్లాక్ కాఫీ అనే ఒక షార్ట్ ఫిలిం లో నటించి అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత పతంగ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి తన నటనతో మెప్పించాడు. ప్రస్తుతం ఈ హీరో తన తర్వాతి సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఓ పక్క అక్క శాన్వీ మేఘన టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా రాణిస్తోంది. ఇప్పుడు ఆమె తమ్ముడు వంశీ కూడా హీరోగా ఆకట్టుకుంటున్నాడు. దీంతో ఈ అక్కా తమ్ముళ్ల ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.

రామ్ చరణ్ పాటకు శాన్వీ డ్యాన్స్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us