AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Funky Movie: ‘ఫంకీ’ సినిమాలో విశ్వక్ సేన్ చెల్లెలిగా నటించింది ఎవరో గుర్తు పట్టారా? బ్యాక్ గ్రౌండ్ మామూలుగా లేదుగా

విశ్వక్ సేన్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ఫంకీ. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 13న విడుదలైన ఈ మూవీ యావరేజ్ టాక్ తో నడుస్తోంది. జాతి రత్నాలు మూవీ డైరెక్టర్ అనుదీప్ తెరకెక్కించిన ఈ సినిమాలో కయాదు లోహర్ హీరోయిన్ గా నటించింది.

Funky Movie: 'ఫంకీ' సినిమాలో విశ్వక్ సేన్ చెల్లెలిగా నటించింది ఎవరో గుర్తు పట్టారా? బ్యాక్ గ్రౌండ్ మామూలుగా లేదుగా
Funky Movie
Basha Shek
|

Updated on: Feb 16, 2026 | 2:31 PM

Share

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ఫంకీ. జాతి రత్నాలు మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అనుదీప్ ఈ మూవీని తెరకెక్కించాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానరర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. హిలేరియస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీలో విశ్వక్ సేన్ సరసన డ్రాగన్ బ్యూటీ కయాదు లోహర్ హీరోయిన్ గా యాక్ట్ చేసింది. అలాగే నరేష్, ఈశ్వరీరావు, సంపత్ రాజ్, వీటీవీ గణేశ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అయితే ఇదే సినిమాలో విశ్వక సేన్ సోదరిగా ఒక కీలక పాత్రలో కనిపించింది అదితీ భావరాజు. కొన్ని రోజుల ముందు దండోరా సినిమాలో ఒక కీలక పాత్రలో మెరిసిన ఆమెకు ఇది రెండో సినిమా కావడం గమనార్హం. అన్నట్లు ఈ అదితీ భావరాజు ఎవరనుకుంటున్నారా? తెలుగు సంగీత ప్రేక్షఖులకు ఈ బ్యూటీ పేరు బాగా పరిచయమే.

ఆహాలో స్ట్రీమింగ్ అయిన ‘తెలుగు ఇండియన్ ఐడల్’ సింగింగ్ టాలెంట్ షోలో కంటెస్టెంట్‌గా పోటీపడింది అదితి భావరాజు. టాప్ 5లో నిలిచి తన ట్యాలెంట్ ఏంటో చూపించింది. ఆ తర్వాత సినిమాల్లోకి అడుగు పెట్టి ప్లే బ్యాక్ సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళ్, తమిళం, మరాఠి భాషల్లో పాటలు పాడింది. ఎమ్ ఎమ్ కీరవాణి, తమన్, దేవి శ్రీ ప్రసాద్, రఘు కుంచె, సునీల్ కశ్యప్, ఆర్ ఆర్ దుర్వన్, భీమ్స్, వివేక్ సాగర్ వంటి సంగీత దర్శకుల వద్ద పని చేసింది. ‘వెంకీ మామ’, ‘తిరగబడరా సామీ’, ‘ఉషా పరిణయం’, ‘జాను’, ‘చంద్రముఖి 2’, ‘తంత్ర’ వంటి ఎన్నో సినిమాల్లో అదితీ పాడిన సాంగ్స్ ఛార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ముఖ్యంగా అఖండ సినిమాలోని ‘జై బాలయ్య’ సాంగ్ ఈ సింగర్ కు ఎనలేని గుర్తింపు తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే సింగర్ గా సత్తా చాటుతూనే నటిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది అదితీ. దండోరా సినిమాలో ఒక కీలక పాత్రలో మెరిసింది. ఇప్పుడు విశ్వక్ సేన్ ఫంకీ మూవీతో మరోసారి ఆడియెన్స్ దృష్టిని ఆకర్షించింది.

ఇవి కూడా చదవండి

ఫంకీ మూవీ షూటింగులో అదితి భావరాజు..

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అదితీ భావరాజు ఇన్ స్టా గ్రామ్ ల ఒక పోస్ట్ పెట్టింది. అందులో ఫంకీ మూవీ స్టిల్స్ ను షేర్ చేసింది. హీరో విశ్వక్ సేర్, డైరెక్టర్ అనుదీప్ లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!