AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తోన్న తెలుగు హారర్ థ్రిల్లర్.. ఐఎమ్‌డీబీలో 7.9 రేటింగ్ మూవీ

గత వారమే ఈ మూవీ థియేటర్లలో విడుదలైంది. కథ, కథనాల పరంగా ప్రశంసలు అందుకున్న ఈ మూవీకి ఓపెనింగ్స్ కూడా బాగానే వచ్చాయి. అయితే లాంగ్ రన్ లో మాత్రం ఈ మూవీ నిరాశ పర్చింది. అందుకే ఇప్పుడు ఈ మూవీ త్వరలోనే ఓటీటీలోకి రానుందని సమాచారం.

OTT Movie: అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తోన్న తెలుగు హారర్ థ్రిల్లర్.. ఐఎమ్‌డీబీలో 7.9 రేటింగ్ మూవీ
OTT Movie
Basha Shek
|

Updated on: Feb 13, 2026 | 7:30 AM

Share

ఈ మధ్యన ఎక్కువగా హారర్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీసులతోనే ప్రేక్షకలు ముందుకు వస్తున్నాడు నవీన్ చంద్ర. 28 డిగ్రీ సెల్సియస్, లెవెన్, షో టైమ్, బ్లైండ్ స్పాట్ వంటి క్రైమ్, హారర్, థ్రిల్లర్ మూవీస్ తో మన ముందుకు వచ్చాడీ ట్యాలెంటెడ్ హీరో. ఇందులో కొన్ని మాత్రమే ఆడియెన్స్ ను మెప్పించాయి. ఇక గత వారమే నవీన్ చంద్ర నటించిన మరో హారర్ థ్రిల్లర్ థియేటర్ల లో విడుదలైంది. అదే హనీ. పిల్లి మాయ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ మూవీ టీజర్, ట్రైలర్ చాలా ఆసక్తికరంగానే ఉన్నాయి. దీంతో రిలీజ్ కు ముందే ఈ మూవీపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. అయితే ఫిబ్రవరి 06న థియేటర్లలోవిడుదలైన ఈ సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చింది. కథ, కథనాలు, బ్యాగ్రౌండ్ స్కోర్, క్లైమాక్స్ ఎపిసోడ్ బాగానే ఉన్నా మితిమీరిన వయొలెన్స్, కాస్త గందరగోళంగా అనిపించే సన్నివేశాలు ఈ సినిమాకు మైనస్ గా మారాయి. దీంతో ఈ సినిమా థియేటర్లలో నుంచి త్వరగానే మాయమైపోయింది. అయితే ఐఎండీబీలో ఈ మూవీకి 7.9 రేటింగ్ రావడం గమనార్హం. అయితే ఇప్పుడీ హారర్ థ్రిల్లర్ మూవీ త్వరలోనే ఓటీటీలోకి రానుందని సమాచారం.

హనీ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సన్ నెక్ట్స్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. థియేటర్లలో పెద్దగా ఆడని ఈ మూవీ ఫిబ్రవరి 27 నుంచి స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. థియేటర్లలో ఆడని సినిమాలు, మరీ ముఖ్యంగా హారర్ థ్రిల్లర్ మూవీస్ ఈ మధ్యన ఓటీటీలో ఎక్కువగా ఆదరణ పొందుతున్నాయి. దీంతో హానీ మూవీ విషయంలోనూ ఇదే జరుగుతుందని నిర్మాతలు ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాకు కరుణ కుమార్ దర్శకత్వం వహించారు. దివ్య పిళ్లై, దివి వాద్త్యా, రాజా రవీంద్ర, బేబీ జయన్ని తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అజయ్ ఆర్ సదా సంగీతం అందించారు.

ఇవి కూడా చదవండి

హనీ సినిమా లో నవీన్ చంద్ర..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
బెంగాల్‌లో ప్రచారం.. ఝల్‌మురి తింటూ ఆస్వాదించిన ప్రధాని మోదీ..
బెంగాల్‌లో ప్రచారం.. ఝల్‌మురి తింటూ ఆస్వాదించిన ప్రధాని మోదీ..
ఈ చిన్న ట్రిక్‌తో ప్రతీ రోజూ రూ. 6 వేలు సంపాదించవచ్చు..
ఈ చిన్న ట్రిక్‌తో ప్రతీ రోజూ రూ. 6 వేలు సంపాదించవచ్చు..
దేశంలోనే ఫస్ట్.. ఒడిశా గడ్డపై సెమీకండక్టర్ ప్లాంట్..
దేశంలోనే ఫస్ట్.. ఒడిశా గడ్డపై సెమీకండక్టర్ ప్లాంట్..
ఒక్క గ్లాస్‌తోనే మార్పు.. యూరిన్ ఇన్ఫెక్షన్, మలబద్ధకం దూరం
ఒక్క గ్లాస్‌తోనే మార్పు.. యూరిన్ ఇన్ఫెక్షన్, మలబద్ధకం దూరం
అవమానించిన చోటే.. ఒక్క పాటతో యూట్యూబ్ రికార్డులను తిరగరాశాడు..
అవమానించిన చోటే.. ఒక్క పాటతో యూట్యూబ్ రికార్డులను తిరగరాశాడు..
మీ కళ్లు ఎంత షార్ప్.? 10 సెకన్లలో పామును కనిపెట్టగలరా.!
మీ కళ్లు ఎంత షార్ప్.? 10 సెకన్లలో పామును కనిపెట్టగలరా.!
రాజస్థాన్ రాయల్స్ తడబాటు.. కోల్‌కతా ముందు స్వల్ప లక్ష్యం..!
రాజస్థాన్ రాయల్స్ తడబాటు.. కోల్‌కతా ముందు స్వల్ప లక్ష్యం..!
తమిళనాడులో భారీ పేలుడు.. 18 మంది దుర్మరణం..
తమిళనాడులో భారీ పేలుడు.. 18 మంది దుర్మరణం..
వయసొచ్చిన అమ్మాయిలు తప్పక తినాల్సిన మిల్లెట్స్ గంటి పిడికిళ్లు
వయసొచ్చిన అమ్మాయిలు తప్పక తినాల్సిన మిల్లెట్స్ గంటి పిడికిళ్లు
ఉదయం Vs రాత్రి.. స్నానం ఎప్పుడు చేయడం ఆరోగ్యానికి మంచిది..?
ఉదయం Vs రాత్రి.. స్నానం ఎప్పుడు చేయడం ఆరోగ్యానికి మంచిది..?