AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: తప్పకుండా ఈ సినిమాను చూడండి.. క్లైమాక్స్ అద్భుతం.. ఆ మూవీపై మహేష్ బాబు ప్రశంసల జల్లు

నిత్యం సినిమా షూటింగులతో బిజీ బిజీగా ఉంటే మహేష్ బాబు అప్పుడప్పుడు వేరే హీరోల సినిమాలు కూడా చూస్తుంటాడు. అలా తాజాగా ఓ సినిమాను చూశాడీ సూపర్ స్టార్. ఆ తర్వాత సోషల్ మీడియా వేదికగా సినిమాపై తన అభిప్రాయాలను పంచుకున్నాడు.

Mahesh Babu: తప్పకుండా ఈ సినిమాను చూడండి.. క్లైమాక్స్ అద్భుతం.. ఆ మూవీపై మహేష్ బాబు ప్రశంసల జల్లు
Mahesh Babu
Basha Shek
|

Updated on: Feb 12, 2026 | 7:46 AM

Share

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ‘వారణాసి’ అనే సినిమాలో హీరోగా చేస్తున్నాడు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ అనే పవర్ ఫుల్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. సుమారు రూ.1000 కోట్ల బడ్జెట్ తో అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ పాన్ వరల్డ్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే తన సినిమా షూటింగులతో బిజీ బిజీగా ఉండే మహేష్ అప్పుడప్పుడు వేరే హీరోల సినిమాలు కూడా చేస్తుంటాడు. అనంతరం సామాజిక మాధ్యమాల వేదికగా తన అభిప్రాయాలను చెబుతుంటాడు. అలా తాజాగా యుఫోరియా సినిమాను చూశాడు మహేష్ బాబు. అనంతరం చిత్ర బృందానికి అభినందనలు తెలుపుతూ ట్విట్టర్ (ఎక్స్)లో ఒక పోస్ట్ పెట్టాడు. ‘యుఫోరియా ప్రతి ఒక్కరు తప్పక చూడవలసిన సినిమా అని తెలిపారు. దర్శకుడు గుణశేఖర్ గారు కథలు చెప్పే విధానంలో చాలా వైవిధ్యం ఉంటుంది. నేను ఈ మూవీని చాలా బాగా ఎంజాయ్ చేశాను. ముఖ్యంగా క్లైమాక్స్ అద్బుతంగా ఉంది’ అని తన పోస్టులో రాసుకొచ్చాడు మహేష్ బాబు.

ఇవి కూడా చదవండి

మహేష్ బాబు ట్వీట్ క్షణాల్లోనే వైరల్ గా మారింది. యుఫోరియా చిత్ర బృందం కూడా వెంటనే స్పందించింది. మహేశ్‌ పోస్టుపై స్పందించిన డైరెక్టర్ గుణశేఖర్ థాంక్యూ సో మచ్ మహేష్ బాబు అంటూ రిప్లై ఇచ్చారు. ‘ఒక సినీ ప్రియుడిగా ఈ సినిమాని మీరు ఇష్టపడతారనే విషయం నాకు తెలుసు. మీరు మా సినిమాకు ఇచ్చిన ఈ సపోర్టుకు ధన్యవాదాలు’ అని మహేష్ కు థ్యాంక్స్ చెప్పారు గుణశేఖర్. ప్రస్తుతం ఈ పోస్ట్ లు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

మహేష్ బాబు ట్వీట్..

యుఫోరియా సినిమాలో భూమిక ప్రధాన పాత్రలో నటించగా.. సారా అర్జున్, నాజర్, రోహిత్, విఘ్నేష్‌ గవిరెడ్డి, లిఖిత, పృథ్వీరాజ్‌ కీలక పాత్రలు పోషించారు. రాగిణి గుణ సమర్పణలో నీలిమ గుణ, యుక్తా గుణ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. ఫిబ్రవరి 06న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా డీసెంట్ టాక్ తెచ్చుకుంది.

గుణ శేఖర్ రిప్లై..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
EPFO లబ్ధిదారులకు గుడ్‌న్యూస్.. ఇకపై పీఎఫ్‌ విత్‌డ్రా మరింత ఈజీ
EPFO లబ్ధిదారులకు గుడ్‌న్యూస్.. ఇకపై పీఎఫ్‌ విత్‌డ్రా మరింత ఈజీ
వాస్తు టిప్స్: ఈ వస్తువులు కొత్త ఇంటికి తీసుకెళ్తే సమస్యలు తప్పవు
వాస్తు టిప్స్: ఈ వస్తువులు కొత్త ఇంటికి తీసుకెళ్తే సమస్యలు తప్పవు
టిఫిన్‌లో వడ రాలేదని ఆ నటుడు షూటింగ్ నుంచి వెళ్లిపోయాడు: రవిబాబు
టిఫిన్‌లో వడ రాలేదని ఆ నటుడు షూటింగ్ నుంచి వెళ్లిపోయాడు: రవిబాబు
మునక్కాయతో ఇలా వెల్లుల్లి కారం కూర చేశారంటే..
మునక్కాయతో ఇలా వెల్లుల్లి కారం కూర చేశారంటే..
కాకరకాయ ఇష్టం లేనోళ్లకి కుడా ఫేవరెట్ కర్రీ అవ్వాల్సిందే.!
కాకరకాయ ఇష్టం లేనోళ్లకి కుడా ఫేవరెట్ కర్రీ అవ్వాల్సిందే.!
Petrol: మే 15 తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు..!
Petrol: మే 15 తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు..!
పవన్ కళ్యాణ్ డ్రస్ మొత్తం రక్తం.. అయినా లెక్కచేయలేదు..
పవన్ కళ్యాణ్ డ్రస్ మొత్తం రక్తం.. అయినా లెక్కచేయలేదు..
ఎంతోమంది జీవితాన్ని మార్చిన మాల..ఇది ధరిస్తే మీ తలరాత మారడం పక్కా
ఎంతోమంది జీవితాన్ని మార్చిన మాల..ఇది ధరిస్తే మీ తలరాత మారడం పక్కా
బాసరకు కొత్త శోభ.. అంగరంగ వైభవంగా నూతన ఆలయ నిర్మాణం
బాసరకు కొత్త శోభ.. అంగరంగ వైభవంగా నూతన ఆలయ నిర్మాణం
పెళ్లిలో పొట్టు పొట్టు కొట్టుకున్న బంధువులు.. ఎందుకో తెలిస్తే..
పెళ్లిలో పొట్టు పొట్టు కొట్టుకున్న బంధువులు.. ఎందుకో తెలిస్తే..