AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salman Khan: సల్మాన్‌తో ఉన్న ఈ పాపను గుర్తు పట్టారా? మిస్ ఇండియా రన్నరప్.. ఇప్పుడు స్టార్ హీరోయిన్ కూడా

గతంలో పలు సూపర్ హిట్ సినిమాల్లో ఛైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. చిన్నతనంలోనే సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది.. కట్ చేస్తే.. ఇప్పుడీ పాప స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. అంతకు ముందు తన అందంతో మిస్ ఇండియా రన్నరప్ గా కూడా నిలిచింది.

Salman Khan: సల్మాన్‌తో ఉన్న ఈ పాపను గుర్తు పట్టారా? మిస్ ఇండియా రన్నరప్.. ఇప్పుడు స్టార్ హీరోయిన్ కూడా
Salman Khan
Basha Shek
|

Updated on: Feb 11, 2026 | 7:47 AM

Share

1999లో విడుదలైన సూరజ్ బర్జాత్య సూపర్‌హిట్ చిత్రం ‘హమ్ సాథ్ సాథ్ హై’. ఈ మూవీలో సల్మాన్ ఖాన్ హీరోగా నటించాడు. అలాగే ఓ ఛైల్డ్ ఆర్టిస్ట్ కూడా ఓ కీలక పాత్రలో మెరిసింది. తన నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర మేసుకుంది.ఇప్పుడు ఆ చిన్న అమ్మాయి స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. తన అందం, అభినయంతో కుర్రాళ్ల కలల రాణిగా మారిపోయింది. ఇంతకీ ఆమె ఎవనుకుంటున్నారా? జోయా అఫ్రోజ్. తెలుగు ఆడియెన్స్ కు పెద్దగా పరిచయం లేకపోవచ్చు కానీ.. హిందీ ప్రేక్షకులకు ఈ బ్యూటీ బాగా సుపరిచితమే. చాలా చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగు పెట్టింది జోయా అఫ్రోజ్. 1998లో వచ్చిన ‘కోరా కాగజ్’ అనే టీవీ సిరీస్‌లో మొదటి సారి కనిపించింది. ఆ తర్వాత ‘హమ్ సాథ్ సాథ్ హై’ చిత్రంలో తన అమాయక నటనతో అందరి హృదయాలను గెలుచుకుంది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ కావడంతో ఈ క్యూటీ పేరు తెగ మార్మోగిపోయింది. ఇప్పుడు అదే జోయా తన అందం, అభియనంతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇటీవల ఆమె ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ ‘తస్కరి’ OTT ప్లాట్‌ఫామ్‌లలో ట్రెండింగ్‌లో ఉంది. ఈ సిరీస్ కారణంగానే ఆమె మరోసారి వార్తల్లో నిలిచింది. జనవరి 2026లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన క్రైమ్ డ్రామాలో జోయా నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి.

జోయా అఫ్రోజ్ జనవరి 10, 1994న ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జన్మించింది. ఫిబ్రవరి 2026 నాటికి, జోయా వయస్సు 32 సంవత్సరాలు. ముంబైలో పెరిగిన జోయా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వక ముందు మోడలింగ్‌లోనూ మెరుపులు మెరిపింది. 2013లో, ఆమె ఫెమినా మిస్ ఇండియా పోటీలో పాల్గొంది. అందాల కిరీటం గెలవకపోయినా, మిస్ ఇండియా ఇంటర్నేషనల్ 2021 టైటిల్‌ను గెలుచుకుంది. అలాగే జపాన్‌లో జరిగిన మిస్ ఇంటర్నేషనల్ 2022 పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. ఇక నటిగా పలు పంజాబీ, హిందీ సినిమాల్లో మెరిసిందీ అందాల తార. ది ఎక్స్ పోజ్, స్వీటీ వెడ్స్ ఎన్ఆర్ ఐ, సికందర్ కా ముఖద్దర్ వంటి సినిమాలతో పాటు ముక్బిర్, ఫైర్ ఫ్లైస్ వంటి వెబ్ సిరీసుల్లోనూ మెరిసింది.

ఇవి కూడా చదవండి

జోయా లేటెస్ట్ ఫొటోస్..

View this post on Instagram

A post shared by Zoya Afroz (@zoyaafroz)

ఇక సోషల్ మీడియాలోనూ జోయాకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇన్ స్టా గ్రామ్ లో ఆమె ఫొటోలు, వీడియోలకు నెటిజన్లు నుంచి మంచి స్పందన వస్తుంటుంది.

View this post on Instagram

A post shared by Zoya Afroz (@zoyaafroz)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
3 జట్లు ఔట్.. 2 టీంలు సేఫ్.. 5 జట్ల మధ్య కీలక పోరు..!
3 జట్లు ఔట్.. 2 టీంలు సేఫ్.. 5 జట్ల మధ్య కీలక పోరు..!
మల్లె చెట్టుకు గుత్తులు గుత్తులుగా పూలు పూయాలా? చాక్ పీస్ చిట్కా
మల్లె చెట్టుకు గుత్తులు గుత్తులుగా పూలు పూయాలా? చాక్ పీస్ చిట్కా
TG ECET 2026 హాల్‌ టికెట్లు వచ్చేశాయ్‌.. డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే
TG ECET 2026 హాల్‌ టికెట్లు వచ్చేశాయ్‌.. డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే
అపర ఏకాదశి స్పెషల్.. పారిజాత యోగంతో ఈ రాశులకు గోల్డెన్ టైమ్,.
అపర ఏకాదశి స్పెషల్.. పారిజాత యోగంతో ఈ రాశులకు గోల్డెన్ టైమ్,.
హైదరాబాద్‌లో ప్రధాని మోదీ.. లైవ్ వీడియో
హైదరాబాద్‌లో ప్రధాని మోదీ.. లైవ్ వీడియో
టాస్ గెలిచిన చెన్నై.. లక్నోతో పోరులో రుతురాజ్ సేన వ్యూహం ఇదే..!
టాస్ గెలిచిన చెన్నై.. లక్నోతో పోరులో రుతురాజ్ సేన వ్యూహం ఇదే..!
ఇంటి బాత్రూంలో కుప్పులుగా నోట్ల కట్టలు.. దెబ్బకు కెరీర్ క్లోజ్..
ఇంటి బాత్రూంలో కుప్పులుగా నోట్ల కట్టలు.. దెబ్బకు కెరీర్ క్లోజ్..
CBSE 12వ తరగతి 2026 ఫలితాలపై వీడిన ఉత్కంఠ.. ముహూర్తం ఫిక్స్!
CBSE 12వ తరగతి 2026 ఫలితాలపై వీడిన ఉత్కంఠ.. ముహూర్తం ఫిక్స్!
కోట్లు కుమ్మరించినా కొంపముంచిన నలుగురు.. ఇంత దిగజారిపోయారేంట్రా.!
కోట్లు కుమ్మరించినా కొంపముంచిన నలుగురు.. ఇంత దిగజారిపోయారేంట్రా.!
సామాన్యులపై ధరల వాత.. మళ్లీ పెరగనున్న నిత్యవసరాల ధరలు
సామాన్యులపై ధరల వాత.. మళ్లీ పెరగనున్న నిత్యవసరాల ధరలు