AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: నిధి కోసం అన్వేషణ.. ఓటీటీలోకి వచ్చేసిన సరికొత్త అడ్వెంచర్‌ థ్రిల్లర్.. ట్విస్టులు ఓ రేంజ్‌లో

నిధి అన్వేషణ నేపథ్యంలో ఇప్పటికే చాలా సినిమాలు, వెబ్ సిరీస్ లు వచ్చాయి. ఆద్యంతం ఉత్కంఠగా సాగే ఈ అడ్వెంచర్ సినిమాలను చూసేందుకు చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అలా తాజాగా ఓ తెలుగు అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

OTT Movie: నిధి కోసం అన్వేషణ.. ఓటీటీలోకి వచ్చేసిన సరికొత్త అడ్వెంచర్‌ థ్రిల్లర్.. ట్విస్టులు ఓ రేంజ్‌లో
Gold And Geetha Movie
Basha Shek
|

Updated on: Feb 09, 2026 | 9:50 PM

Share

సాధారణంగా ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు ఎక్కువగా శుక్రవారం రోజే స్ట్రీమింగ్ కు వస్తుంటాయి. వీకెండ్ కాబట్టి మంచి వ్యూస్ వస్తాయన్నది ఓటీటీ సంస్థల భావన. అయితే కొన్ని డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ ఫామ్స్ అప్పటికప్పుడు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లను స్ట్రీమింగ్ కు తీసుకొస్తుంటాయి. మరీ ముఖ్యంగా ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ప్రతి ఆదివారం కథా సుధలో భాగంగా ఓ కొత్త సినిమాను ఓటీటీకి తీసుకొస్తోంది. అలా ఈ ఆదివారం (ఫిబ్రవరి 9) కూడా ఒక ఇంట్రెస్టింగ్ సినిమాను స్ట్రీమింగ్ చేసింది. ఈ సినిమా కథ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇద్దరు ఫ్రెండ్స్, వారి గర్ల్ ఫ్రెండ్స్ చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. వీరు జులాయిగా పార్టీలు, పబ్ లు అంటూ జల్సాలు చేస్తుంటారు. దీంతో తల్లిదండ్రులు వీరిపై మండిపడతారు. డబ్బులు సంపాదించడం చేతకానివాళ్లకు సరదాలు తీర్చుకునే హక్కు లేదని కోప్పడతారు. దీంతో హర్టయిన ఈ ఇద్దరు స్నేహితులు వాళ్ల పేరెంట్స్ తో ఛాలెంజ్ చేస్తారు.

అనుకోకుండా ఓ పోలీస్ కేసులో ఇరుక్కున్న ఈ ఫ్రెండ్స్ కు ఓ నిధి మ్యాప్ దొరుకుతుంది. దాని విలువ కోట్ల రూపాయలని తెలుస్తుంది. దీంతో తమ గర్ల్ ఫ్రెండ్స్ ను వెంటబెట్టుకుని నిధి కోసం ఈ ఇద్దరు ఫ్రెండ్స్ అడవిలోకి వెళ్తారు. మరి ఫారెస్ట్ లోకి వెళ్లిన ఈ నలుగురికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? వాళ్లకు నిధి దొరికిందా? లేదా? చివరకు వారు తమ లవర్లనే ఎందుకు చంపాలనుకున్నారు? అన్న ప్రశ్నలకు సమాధానాలు కావలంటే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

ఈ సినిమా పేరు కృష్ణ అండ్ గీత. గంగనమోని శేఖర్ తెరకెక్కించిన ఈ సినిమాలో అజయ్ కథుర్వార్, ఆదిత్య, దక్షి గుత్తికొండ, వర్షు పాసం, రమ్య పొందూరి తదితరులు నటించారు. ఆర్కే టెలిషో బ్యానర్ పై దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ఈ సినిమాను నిర్మించడం విశేషం. ఈ మూవీ ప్రత్యేకత ఏంటంటే.. రన్ టైమ్ చాలా తక్కువగా ఉండడం. తక్కువ టైమ్ లోనే మంచి సస్పెన్స్ థ్రిల్లర్ చూడాలనుకున్నవాళ్లకు గోల్డ్ అండ్ గీత మంచి ఆప్షన్. మరెందుకు లేటు ఎంచెక్కా ఈటీవీ విన్ లో ఈ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీని చూసి ఎంజాయ్ చేయండి.

ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర