AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విశ్వక్ సేన్ అమ్మగారి చేతి భోజనం తిన్నా.. అర్జున్‌ మాటలు వింటే కళ్లు చెమర్చుతాయి.. వీడియో ఇదిగో

విశ్వక్ సేన్ హీరోగా అర్జున్ దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కాల్సింది. ఇందులో హీరోయిన్ గా అర్జున్ కూతురు నటించింది. అయితే కొంత షూటింగ్ జరిగాక ఉన్నట్లుండి ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు విశ్వక్ సేన్. ఈ విషయమై అప్పట్లో అర్జున్, విశ్వక్ ల మధ్య మాటల తూటాలు పేలాయి.

విశ్వక్ సేన్ అమ్మగారి చేతి భోజనం తిన్నా.. అర్జున్‌ మాటలు వింటే కళ్లు చెమర్చుతాయి.. వీడియో ఇదిగో
Vishwak Sen, Arjun Sarja
Basha Shek
|

Updated on: Feb 08, 2026 | 9:34 PM

Share

యాక్షన్ కింగ్ చాలా ఏళ్ల తర్వాత మళ్లీ మెగా ఫోన్ పట్టాడు. ఆయన దర్శకుడిగా తెరకెక్కించిన లేటెస్ట్ సినిమా ‘సీతాపయనం’. ఇందులో నిరంజన్‌ కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఇదే మూవీతో అర్జున్ కూతురు ఐశ్వర్య కూడా తెలుగులోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రేమికుల దినోత్సవం కారణంగా ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే మొదట ఈ మూవీ కోసం విశ్వక్‌ సేన్‌ హీరోగా ప్రకటించారు. షూటింగ్ కూడా ప్రారంభించారు. కానీ ఏవో కారణాలతో ఈ మూవీ నుంచి తప్పుకున్నాడు విశ్వక్ సేన్. దీనిపై అప్పట్లో అర్జున్ ఈ యంగ్ హీరోపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. విశ్వక్ సేన్ కూడా తన నిర్ణయానికి గల కారణాలను కూడా చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు యాదృచ్చికంగా, విశ్వక్ సేన్ సినిమా ఫంకీతో పాటు సీతాపయనం కూడా వాలెంటైన్స్ డే స్పెషల్‌గా విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో తన సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న అర్జున్ విశ్వక్‌ సేన్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో విశ్వక​్‌తో జరిగిన వివాదాన్ని గుర్తు చేస్తూ ఓ యాంకర్ అడిగిన ప్రశ్నకు అర్జున్‌ ఇలా ఆన్సర్ ఇచ్చారు.

‘ మా సినిమా సీతాపయనంతో పాటు విశ్వక్‌ సేన్‌ మూవీ ఫంకీ కూడా చాలా బాగా ఆడాలని కోరుకుంటున్నాను. అతనొక యువకుడు.. తనకు చాలా భవిష్యత్‌ ఉంది. ఏదో మనకు కుదరలేదని అతనిపై కోపం, ద్వేషం పెంచుకోవాల్సిన అవసరం లేదు. నేను వారి అమ్మగారి చేతి భోజనం తిన్నాను. వాళ్లు బాగుండాలని కోరుకుంటాను. కాలంతో పాటు కొన్ని విషయాలను మరిచిపోతూ సంతోషంగా ముందుకు సాగాలి. మా రెండు సినిమాలు బాగా ఆడాలని కోరుకుంటాను’ అని అర్జున్ చెప్పుకొచ్చారు. తద్వారా విశ్వక్ సేన్ తో గొడవలకు దాదాపు ఫుల్ స్టాప్ పెట్టేశారు అర్జున్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు యాక్షన్ కింగ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.’పెద్దరికం ఎలా ఉంటుందో చూపించారు సార్’ అంటూ అర్జున​్‌ను ప్రశంసిస్తూ పోస్టులు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎక్కువగా చూస్తున్నారా? మీ ఆరోగ్యానికి ముప్పు
ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎక్కువగా చూస్తున్నారా? మీ ఆరోగ్యానికి ముప్పు
ది ప్యారడైజ్‌ ఆ స్టార్ నటుడు కూడా ఉన్నడా.!!
ది ప్యారడైజ్‌ ఆ స్టార్ నటుడు కూడా ఉన్నడా.!!
ఆసిఫాబాద్‌ కలెక్టరేట్‌లో వృద్దదంపతుల ఆత్మహత్యాయత్నం
ఆసిఫాబాద్‌ కలెక్టరేట్‌లో వృద్దదంపతుల ఆత్మహత్యాయత్నం
ఆముదం ఆకుల సీక్రెట్స్ తెలిస్తే షాక్ అవుతారు..అద్భుత ఔషధ గుణాలుఇవే
ఆముదం ఆకుల సీక్రెట్స్ తెలిస్తే షాక్ అవుతారు..అద్భుత ఔషధ గుణాలుఇవే
పరగడుపున నెయ్యి, తులసి రసం తీసుకుంటే శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే!
పరగడుపున నెయ్యి, తులసి రసం తీసుకుంటే శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే!
హైదరాబాద్‌‌లో సీన్‌ ఛేంజ్‌.. కాంగ్రెస్‌ వ్యూహాత్మక అడుగులు..
హైదరాబాద్‌‌లో సీన్‌ ఛేంజ్‌.. కాంగ్రెస్‌ వ్యూహాత్మక అడుగులు..
తొలిరోజే హీటెక్కిన గొడవలు.. గాయాలతో ముగిసిన టాస్క్
తొలిరోజే హీటెక్కిన గొడవలు.. గాయాలతో ముగిసిన టాస్క్
బ్లడ్ షుగర్,అరికాళ్ల మంటలకు చెక్ పెట్టే అమృతం! మెంతుల కాంబినేషన్
బ్లడ్ షుగర్,అరికాళ్ల మంటలకు చెక్ పెట్టే అమృతం! మెంతుల కాంబినేషన్
చెడ్డీగ్యాంగ్‌ కలకలం.. అపార్ట్‌మెంట్, విల్లా కమిటీలకు కీలక సూచనలు
చెడ్డీగ్యాంగ్‌ కలకలం.. అపార్ట్‌మెంట్, విల్లా కమిటీలకు కీలక సూచనలు
రెస్టారెంట్ స్టైల్‌లో దమ్ బిర్యానీ.. ఇంట్లో ఎలా చేయాలంటే?
రెస్టారెంట్ స్టైల్‌లో దమ్ బిర్యానీ.. ఇంట్లో ఎలా చేయాలంటే?