AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Meher Ramesh: మెహర్ రమేష్ ఇంట తీవ్ర విషాదం.. కన్నీరుమున్నీరవుతోన్న టాలీవుడ్ డైరెక్టర్

టాలీవుడ్ డైరెక్టర్ మెహర్ రమేష్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన కుటుంబ సభ్యుల్లో ఒకరు కన్నుమూశారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ దర్శకుడికి సంఘీభావం తెలుపుతున్నారు.

Meher Ramesh: మెహర్ రమేష్ ఇంట తీవ్ర విషాదం.. కన్నీరుమున్నీరవుతోన్న టాలీవుడ్ డైరెక్టర్
Meher Ramesh
Basha Shek
|

Updated on: Feb 07, 2026 | 6:36 AM

Share

టాలీవుడ్ దర్శకుడు మెహర్ రమేశ్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.అతని అత్తమ్మ పద్మావతి కన్నుమూశారు. ఈ విషయాన్ని మెహర్ రమేషే స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా తన అత్తమ్మని తల్చుకుంటూ బాగా ఎమోషనల్ అయ్యాడీ డైరెక్టర్. ఇన్నాళ్లు అమ్మని తనలో చూసుకున్నానని, ఒకే తేదీన అప్పుడు అమ్మ ఇప్పుడు అత్తమ్మ చనిపోయారంటూ తన అత్తమ్మ ఫొటోలు కూడా సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నాడు. ‘ఇన్నాళ్లు మా అమ్మని తనలో చూసుకున్నాను . మా అత్తమ్మ “పద్మావతి ” శివైక్యం పొందారు. మా అమ్మ వెంకట సుబ్బమ్మ గారు 2003 7th ఫిబ్రవరి పరమపదించారు సరిగ్గా అదే తేదీ న అత్తమ్మ కి ఆఖరి వీడ్కోలు. మా కుటుంబానికి తీరని లోటు. ఓం శాంతి’ అంటూ తన అత్తమ్మకు నివాళి అర్పించారు మెహర్ రమేష్. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది. దీనిని చూసిన పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు మెహర్ రమేష్ కు సంఘీభావం తెలుపుతున్నారు. అతని అత్తమ్మకు నివాళి అర్పిస్తున్నారు.

కాగా కన్నడలో బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించాడు మెహర్ రమేష్. ఆంధ్రావాలా, ఒక్కడు సినిమాలని రీమేక్ చేసి సాలిడ్ హిట్స్ అందుకున్నాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ కంత్రి సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టాడు. ప్రభాస్ తో బిల్లా లాంటి స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను తెరకెక్కించి ప్రశంసలు అందుకున్నాడు. అయితే ఆ తర్వాత మెహర్ చేసిన సినిమాలన్నీ వరుసగా బోల్తా పడ్డాయి. శక్తి, షాడో, భోళా శంకర్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిలయ్యాయి. భోళా శంకర్ తర్వాత బయట కూడా పెద్దగా కనిపించడం లేదు మెహర్ రమేష్. అయితే మెగా ఫ్యామిలీకి దగ్గరి బంధువైన డైరెక్టర్ అప్పుడుప్పుడు మెగా హీరోల సినిమా ఈవెంట్లు, ఫంక్షన్లలో కనిపిస్తుంటాడు.

ఇవి కూడా చదవండి

డైరెక్టర్ మెహర్ రమేష్ పోస్ట్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర