AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi: మెగాస్టార్ సినిమానే రిజెక్ట్ చేసిన టాలీవుడ్ కమెడియన్ ఎవరో తెలుసా? ఇప్పుడేం చేస్తున్నాడంటే?

మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఛాన్స్ వస్తే ఎవరైనా ఎగరి గంతేస్తారు. ముఖ్యంగా యువ నటీనటులు, కమెడియన్లు బాస్ సినిమాలో నటించేందుకు తెగ ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఓ కమెడియన్ మాత్రం మెగాస్టార్ చిరంజీవి సినిమానే వద్దన్నాడు. ఇంతకీ ఎవరతను? ఎందుకిలా చేశాడో తెలుసుకుందాం రండి.

Chiranjeevi: మెగాస్టార్ సినిమానే రిజెక్ట్ చేసిన టాలీవుడ్ కమెడియన్ ఎవరో తెలుసా? ఇప్పుడేం చేస్తున్నాడంటే?
Megastar Chiranjeevi
Basha Shek
|

Updated on: Feb 05, 2026 | 9:42 PM

Share

‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు మెగాస్టార్ చిరంజీవి. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఏకంగా రూ.375 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించిందని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. తన గత సినిమాలను గుర్తు చేస్తూఈ మూవీలో కామెడీ ఇరగ దీశారు చిరంజీవి. హర్షవర్దన్, అభినవ్ గోమఠం, శరత్ సక్సేనా వంటి స్టార్స్ తో కలిసి ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించారు. చిరంజీవి పక్కన సరైన కమెడియన్ కాంబినేషన్ కుదిరితే సినిమా ఎలా ఉంటుందో అని చెప్పడానికి మన శంకరవరప్రసాద్ గారు ఒక మంచి ఉదాహరణ అని చెప్పవచ్చు. గతంలో బ్రహ్మానందం, సునీల్, అలీ లాంటి టాప్ కమెడియన్స్ చిరంజీవితో కలసి నటించారు. వీరి కాంబోలో వచ్చిన సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. అలాంటి చిరంజీవి సినిమాలో ఛాన్స్ అంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కానీ ఓ స్టార్ కమెడియన్ మాత్రం మెగాస్టార్ చిరంజీవి సినిమానే రిజెక్ట్ చేశాడు.

రాజకీయాలతో సుమారు 9 ఏళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన చిత్రం ఖైదీనంబర్ 150. వి.వి. వినాయక్ తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇందులో చిరంజీవితో పాటు అలీ, బ్రహ్మానందం వంటి స్టార్ కమెడియన్స్ నటించారు. ముఖ్యంగా చిరంజీవి- అలీ కాంబినేషన్స్ లో వచ్చిన సీన్లన్నీ సినిమాలో హైలెట్ గా నిలిచాయి. అయితే అలీ కంటే ముందు ఈ పాత్ర కోసం ఒక స్టార్ కమెడియన్ ను అడిగారట. కానీ అతను రిజెక్ట్ చేశాట. ఇంతకీ ఆ కమెడియన్ ఎవరనుకుంటున్నారా? గతంలో ఠాగూర్, స్టాలిన్, ఇంద్ర లాంటి సినిమాల్లో చిరంజీవితో కలిసి నటించాడు సునీల్. ఇదే క్రమంలో చిరంజీవి రీ ఎంట్రీ చిత్రం ఖైదీ 150 కోసం కూడా సునీల్ ను సంప్రదించారట మేకర్స్. అయితే అదే సమయంలో హీరోగా బిజీగా ఉండడంతో చిరంజీవి సినిమాను వదులుకున్నాడట సునీల్. ఈ విషయాన్ని అతనే ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టాడు.

ఓటీవీ ప్రోగ్రామ్ లో ‘చిరంజీవి గారి సినిమాని ఎందుకు రిజెక్ట్ చేశావ్ అని అలీ ప్రశ్నించగా సునీల్ ఇలా బదులిచ్చారు. అది రిజెక్ట్ చేసినట్లు కాదు. నాకు కుదరలేదు అంతే. ఖైదీ నెంబర్ 150 కోసం నన్ను ఎంపిక చేశారు. కానీ అదే టైంలో ఈడు గోల్డ్ ఎహే అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాను. అప్పటికే ఆ సినిమా షూటింగ్ చాలా ఆలస్యం అయింది. నేను ఖైదీ నెంబర్ 150 చిత్రానికి డేట్లు ఇస్తే మరోసారి నా మూవీ విడుదల వాయిదా పడుతుంది. దీనితో తప్పని పరిస్థితుల్లో ఖైదీ నెంబర్ 150 చిత్రం వదులుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ ఆ పాత్ర సేఫ్ హ్యాండ్స్ లోకి వెళ్లింది. ఆ రోల్ మీరే చేశారు కదా’ అని సునీల్ అలీతో అన్నారు.

View this post on Instagram

A post shared by Suneel (@suniltollywood)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి

Follow Us
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
రాహల్ విధ్వంసం.. సొంతగడ్డపై రాజస్థాన్‌ను చిత్తు చేసిన ఢిల్లీ!
రాహల్ విధ్వంసం.. సొంతగడ్డపై రాజస్థాన్‌ను చిత్తు చేసిన ఢిల్లీ!
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు త్వరలో శుభవార్త..!
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు త్వరలో శుభవార్త..!
ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఉంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తప్పనిసరి!
ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఉంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తప్పనిసరి!