AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss: ‘చుట్టూ బాడీ గార్డ్స్ ఉన్నా నా నడుముపై చేయి వేసి’.. బిగ్ బాస్ తెలుగు బ్యూటీకి చేదు అనుభవం

బిగ్ బాస్ తెలుగు టీవీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు వరుసగా సినిమాల్లో నటిస్తోంది. సహాయక నటిగా మెప్పిస్తోంది. అయతే తాజాగా ఈ బిగ్ బాస్ బ్యూటీకి ఒక చేదు అనుభవం ఎదురైంది. ఓ పబ్లిక్ ప్లేస్ లో..

Bigg Boss: 'చుట్టూ బాడీ గార్డ్స్ ఉన్నా నా నడుముపై చేయి వేసి'.. బిగ్ బాస్ తెలుగు బ్యూటీకి చేదు అనుభవం
Divi Vadthya
Basha Shek
|

Updated on: Feb 07, 2026 | 7:55 AM

Share

బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో దివి వైద్య ఒకరు. చదువుకునే వయసులోనే మోడలింగ్ ప్రారంభించిన ఆమె పలు ఫాషన్ సంస్థలకు మోడలింగ్ చేసింది. 2018లో తొలిసారిగా ‘లెట్స్ గో’ అనే షార్ట్ ఫిల్మ్ లో నటించింది. 2019లో మహేష్ బాబు నటించిన మహర్షి సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది. దీని తర్వాత కూడా చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో మెరిసింది. అయితే దివికి మంచి గుర్తింపు వచ్చింది మాత్రం బిగ్ బాస్ తోనే. సీజన్ 4లో కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ తన ఆటతీరు, అందంతో బుల్లితెర ఆడియెన్స్ కు బాగా చేరువైంది. హౌస్‌లో ఉన్నది కొన్ని రోజులే అయినా విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చిన దివి సినిమాలతో బిజీ అయిపోయింది. ఏ 1 ఎక్స్‌ప్రెస్, క్యాబ్‌ స్టోరీస్‌, నయీమ్ డైరీస్, జిన్నా, గాడ్ ఫాదర్, రుద్రంగి, లంబసింగి, పుష్ప 2, డాకు మహారాజ్ తదితర సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక లేటెస్ట్ గా హనీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిందీ అందాల తార. నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా శుక్రవారం (ఫిబ్రవరి 06)న థియేటర్లో విడుదలైంది. ఇదిలా ఉంటే ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన దివి తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను పంచుకుంది. అలాగే ఇటీవల తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని పంచుకుంది.

‘ఇటీవల ఒక పబ్ ఈవెంట్ కి నన్ను పిలిచారు. రక్షణగా నా చుట్టూ బాడీ గార్డ్స్ ఉన్నారు. గుంపుగా చుట్టూ ఉండి నన్ను వేదిక దగ్గరకు తీసుకెళ్తున్నారు. అయితే అంత ముంది ఉన్నప్పటికీ మధ్యలో ఒకడు నా నడుము గిల్లాడు. కానీ అదేమీ తెలియనట్టు నిల్చొని చూస్తున్నాడు. వెంటనే సీరియస్ గా చూసి తలపై గట్టిగా కొట్టి బాడకవ్ అని తిట్టి వెళ్లి పోయా. ఒకవేళ నేను అలా కొట్టి తిట్టి వెళ్లకపోతే నేను బ్యాడ్ గా ఫీల్ అవుతా. అది నా తప్పు కాదు. చుట్టూ అంత మంది బాడీ గార్డ్స్ ఉన్నా వాడు నీచంగా ప్రవర్తించాడు. అప్పటిదాకా నేను ఫ్రీగా నడిస్తే ఆ సంఘటన తర్వాత జాగ్రత్తగా చేతులు దగ్గరికి పెట్టుకొని నడవాల్సి వచ్చింది’ అని తనకు ఎదురైన షాకింగ్ అనుభవాన్ని పంచుకుంది దివి. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

బిగ్ బాస్ దివి లేటెస్ట్ ఫొటోస్..

View this post on Instagram

A post shared by Divi (@actordivi)

హనీ సినిమా ప్రమోషన్లలో..

View this post on Instagram

A post shared by Ravi Peetla (@ravipeetla)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

Follow Us