AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth: మొన్ననే పెళ్లి.. ఇప్పుడేమో బిజినెస్‌లో లక్షల నష్టం..సాయం చేయాలని జబర్దస్త్ కమెడియన్ వేడుకోలు

జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఇతను కూడా ఒకడు. చాలా ఏళ్ల పాటు ఈ కామెడీ షోలో కంటెస్టెంట్ గా చేసిన అతను మొన్ననే పెళ్లిపీటలెక్కారు. తన ప్రియురాలితో కలిసి కొత్త జీవితం ప్రారంభించాడు. అయితే తాజాగా ఈ జబర్దస్త్ నటుడు ఒక వీడియో రిలీజ్ చేశాడు.

Jabardasth: మొన్ననే పెళ్లి..  ఇప్పుడేమో బిజినెస్‌లో లక్షల నష్టం..సాయం చేయాలని జబర్దస్త్ కమెడియన్ వేడుకోలు
Jabardasth Mahidhar
Basha Shek
|

Updated on: Feb 08, 2026 | 7:41 PM

Share

జబర్దస్త్ కామెడీ షోతో ఎంతో మంది మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ కామెడీ షోలో కంటెస్టెంట్ గా, టీమ్ లీడర్స్ గా పనిచేసిన వారు ఇప్పుడు సినిమాలతో బిజీ బిజీగా ఉంటున్నారు. కమెడియన్లుగా, నటీనటులుగా, డైరెక్టర్లుగా, నిర్మాతలుగా సత్తా చాటుతున్నారు. అలా జబర్దస్త్ కామెడీ షోతోనే బాగా పాపులర్ అయిన వారిలో మహిధర్ కూడా ఒకరు. జబర్దస్ లో ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన అతను తర్వాత రైటర్ గా, టీమ్ లీడర్ గా ఎదిగాడు. అయితే ఎందుకో గానీ జబర్దస్త్ కామెడీ షో నుంచి బయటకు వచ్చేశాడు. మహీధర్ వైబ్స్’ పేరుతో సొంతంగా ఓ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాడు. సినిమాలు, బిగ్ బాస్ రివ్యూలు, ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఇతని వీడియోలకు యూబ్యూబ్ లో భారీ వ్యూస్ వస్తుంటాయి. వీటితో పాటు ఓ కేఫ్ బిజినెస్ కూడా రన్ చేస్తున్నాడు మహీధర్. అయితే ఇప్పుడీ నటుడు ‘తన యూట్యూబ్ ఛానెల్‌ ను అమ్మేస్తున్నాను.. ఎవరైనా కొనండి’ అంటూ ఒక వీడియోని రిలీజ్ చేయడం అందరినీ షాక్ కు గురి చేస్తోంది.

‘ఇక మీదట మహీధర్ వైబ్స్ యూట్యూబ్ ఛానల్ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ ఛానెల్ ని అమ్మేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఛానల్ ఉండాలి అనుకుంటే మాత్రం మీ సపోర్టు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత కొన్ని నెలల క్రితం నేను ఒక బిజినెస్ మొదలు పెట్టాను. అయితే ఈ బిజినెస్ లో రూ .55 లక్షల పైగా నష్టపోయాను. సుమారుగా రూ .65 లక్షల వరకు పెట్టుబడి పెడితే.. కేవలం రూ .10 లక్షల రూపాయలు మాత్రమే మిగిలింది.. నేను దాచుకున్న రూ .40 లక్షల రూపాయలు ఈ బిజినెస్ లోనే పెట్టాను. అలాగే బయట నుంచి ఒక రూ.25 లక్షల రూపాయల వరకు అప్పు తెచ్చి ఇన్వెస్ట్ మెంట్ చేశాను. కానీ మొత్తం మీద 60 లక్షల రూపాయల వరకు లాస్ అయ్యాను. ఇప్పుడు ఈ అప్పు తీర్చాల్సి వచ్చింది. నేను ఈ ఛానల్ ని అమ్మడానికి సిద్ధమయ్యాను.. కానీ వాళ్లు కొన్ని కండిషన్స్ పెట్టారు. అదే నన్ను ఈ వీడియో చేసేలా చేసింది. నేనే ఛానెల్ అమ్మేసి ఏదైనా పని చేసి సంపాదించాలనుకుంటున్నాను. పైగా నా ఛానెల్ కూడా మూవీస్ రిలేటెడ్ ఛానల్ కాబట్టి ఇండస్ట్రీలో చాలామంది ఇలాంటి ఛానెల్స్ ని కొంటూ ఉంటారు. వాళ్లు కూడా ముందుకు వచ్చారు. ఒక్క సబ్ స్క్రైబర్స్ కు రూ .4రూపాయలు చొప్పున ఇస్తామన్నారు. ఇప్పుడు నాకు 10 లక్షల వరకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి 40 లక్షల రూపాయల వరకు ఇస్తామని చెప్పారు. కానీ ఇక్కడే ఓ మెలిక పెట్టారు’

‘ ఒకవేళ ఈ ఛానల్ అమ్మేస్తే పూర్తిగా ఇకమీదట మరో ఛానెల్ చేయడానికి వీలు ఉండకుండా కండిషన్ పెట్టారు. ముఖ్యంగా మూవీస్ రిలేటెడ్ గా ఏది మాట్లాడకూడదన్నారు. ఇక మీదట రివ్యూస్ కానీ మూవీస్ కి సంబంధించిన విషయాలని చేయకూడదని చెప్పారు. యూట్యూబ్ కొనేవాళ్లు ఈ రూల్స్ పెట్టేసరికి తనకి అర్థం కాక ఈ వీడియో చేశాను’ అని మహిధర్ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

జబర్దస్త్ మహిధర్ రిలీజ్ చేసిన వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు
శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు
శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు!
శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు!
వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!
వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైం
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైం
బజాజ్ నుంచి అదిరిపోయే లుక్‌తో కొత్త తరహా బైక్
బజాజ్ నుంచి అదిరిపోయే లుక్‌తో కొత్త తరహా బైక్
'చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి'
'చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి'
బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఇవాళ రికార్డ్ స్థాయి పెరుగుదల
బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఇవాళ రికార్డ్ స్థాయి పెరుగుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు!
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు!
ఇంతకీ హార్దిక్ ముంబై ఇండియన్స్‌ లో ఉన్నట్లా ? లేనట్లా ?
ఇంతకీ హార్దిక్ ముంబై ఇండియన్స్‌ లో ఉన్నట్లా ? లేనట్లా ?
కాంగ్రెస్‌లో సుస్మితా వ్యాఖ్యల దుమారం..
కాంగ్రెస్‌లో సుస్మితా వ్యాఖ్యల దుమారం..
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర