AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kangana Ranaut: ‘ఆ హీరోను పడేయాలని అప్పట్లో చాలా ట్రై చేశాను కానీ’.. స్వయంగా చెప్పిన కంగనా.. వీడియో ఇదిగో

గతంలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన కంగనా రనౌత్ ఇప్పుడు పెద్దగా సినిమాలు చేయడం లేదు. బదులుగా ఇప్పుడు రాజకీయాలతో బిజీ బిజీగా ఉంటోంది. బీజేపీలో చేరిన కంగనా హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుంచి ఎంపీగా గెలిచిన విషయం తెలిసిందే.

Kangana Ranaut: 'ఆ హీరోను పడేయాలని అప్పట్లో చాలా ట్రై చేశాను కానీ'.. స్వయంగా చెప్పిన కంగనా.. వీడియో ఇదిగో
Kangana Ranaut
Basha Shek
|

Updated on: Feb 08, 2026 | 5:26 PM

Share

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. హిందీ సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిందీ అందాల తార. ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. కేవలం హిందీలోనే కాకుండా తెలుగు, తమిళ భాషల్లోనూ కంగనా సినిమాలు చేసింది. తెలుగులో ప్రభాస్ తో కలిసి ఏక్ నిరంజన్ అనే సినిమాలో యాక్ట్ చేసిందీ అందాల తార. అయితే ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉంటోంది కంగనా. ఎమర్జెన్సీ తర్వాత ఆమె మరో సినిమాలో కనిపించలేదు. బదులుగా పాలిటిక్స్ లో క్రియాశీలకంగా ఉంటోంది. బీజేపీలో చేరిన కంగనా హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుంచి ఎంపీగా గెలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పార్లమెంట్ సభ్యురాలిగా బిజీ బిజీగా ఉంటోన్న కంగనాకు సంబంధించి ఒక ఓల్డ్ వీడియో ఇప్పుడు నెట్టింట బాగా వైరలవుతోంది. ఇందులో ఆమె చెప్పిన సమాధానాలు విని చాలా మంది షాక్ అవుతున్నారు.

ఈ వీడియోలో హోస్ట్ కరణ్ జోహార్ మాట్లాడుతూ’ మీరు ఎవరితోనైనా సరసాలాడటానికి ప్రయత్నించారా’ అని కంగనాను అడగడంతో ఆమె ఏమాత్రం ఆలోచించకుండా.. ‘అవును అంటూ ధురంధర్ విలన్ అక్షయ్ ఖన్నా పేరును చెప్పింది. ‘నేను మొదట అక్షయ్‌తో మాట్లాడ్డానికి ప్రయత్నించాను. ఆ తర్వాత అతడ్ని నిజంగానే పడేయాలని ట్రై చేశాను. కానీ అతను ఎప్పుడూ నాతో మాట్లాడలేదు. నాతోనే కాదు. అతను ఎవరితోనూ పెద్దగా మాట్లాడడు’ అని చెప్పుకొచ్చింది. అక్షయ్ ఖన్నా గురించి కంగనా చేసిన ఈ కామెంట్స్ కు సంబంధించిన క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

కంగనా కామెంట్స్.. వీడియో ఇదిగో..

కాగా ధురంధర్ సినిమాలో అక్షయ్ ఖన్నా పోషించిన రెహ్మాన్ డెకాయిత్ పాత్రకు ఎంత మంచి పేరొచ్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంతకు ముందు ఛావా సినిమాలోనూ అతను పోషించిన ఔరంగజేబు పాత్ర విమర్శలకు ప్రశంసలు అందుకుంది.

ధురంధర్ సినిమాలో అక్షయ్ ఖన్నా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
రైల్వే స్టేషన్‌లో నీళ్లు సురక్షితమేనా? బ్యాక్టీరియా పరీక్షల్లో ..
రైల్వే స్టేషన్‌లో నీళ్లు సురక్షితమేనా? బ్యాక్టీరియా పరీక్షల్లో ..
'విక్రమార్కుడు'లో రవితేజ డూప్‌గా చేసిన హీరో చనిపోయాడని తెలుసా?
'విక్రమార్కుడు'లో రవితేజ డూప్‌గా చేసిన హీరో చనిపోయాడని తెలుసా?
పుదీనా మొక్కను ఇలా నాటితే గుబురుగా పెరగడం పక్కా..
పుదీనా మొక్కను ఇలా నాటితే గుబురుగా పెరగడం పక్కా..
భోజనం చేసిన వెంటనే వేడి నీటితో స్నానం చేస్తే ఏమవుతుంది?
భోజనం చేసిన వెంటనే వేడి నీటితో స్నానం చేస్తే ఏమవుతుంది?
యూపీఐ పేమెంట్ చేసేటప్పుడు ఈ విషయం మర్చిపోతే కోర్టు కేసులే..
యూపీఐ పేమెంట్ చేసేటప్పుడు ఈ విషయం మర్చిపోతే కోర్టు కేసులే..
సొంత తమ్ముడినే అతి కిరాతకంగా హత్య చేయించిన అన్న.. ఎందుకంటే?
సొంత తమ్ముడినే అతి కిరాతకంగా హత్య చేయించిన అన్న.. ఎందుకంటే?
గ్రాండ్ గా వస్తున్న కార్తిక్ జయంతి రాయవలస..
గ్రాండ్ గా వస్తున్న కార్తిక్ జయంతి రాయవలస..
రుచికరమైన పట్టా గోబీ లచ్చాపరాఠా ఎప్పుడైనా తిన్నారా? భలే ఉంటుందిలే
రుచికరమైన పట్టా గోబీ లచ్చాపరాఠా ఎప్పుడైనా తిన్నారా? భలే ఉంటుందిలే
నాని ' ది ప్యారడైజ్' సినిమాలో ఆ స్టార్ నటుడి సీన్లు కట్ చేశారా?
నాని ' ది ప్యారడైజ్' సినిమాలో ఆ స్టార్ నటుడి సీన్లు కట్ చేశారా?
భారత్, చైనాలో మనీప్లాంట్ కు ఆ పేరెలా వచ్చిందో తెలుసా?
భారత్, చైనాలో మనీప్లాంట్ కు ఆ పేరెలా వచ్చిందో తెలుసా?