AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Priyanka Chopra: మా కూతురిని హిందూ ధర్మం విలువలతోనే పెంచుతున్నాం.. ప్రియాంక భర్త నిక్ ఆసక్తికర కామెంట్స్

గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనాస్ భారతీయ సంస్కృతి సంప్రదాయాలపై ప్రశంసలు కురిపించాడు. మరీ ముఖ్యంగా హిందూ మతం తనకు చాలా విషయాలు నేర్పిందని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు తన కూతురును కూడా హిందూ ధర్మం విలువలతోనే పెంచుకున్నట్లు చెప్పుకొచ్చాడు.

Priyanka Chopra: మా కూతురిని హిందూ ధర్మం విలువలతోనే పెంచుతున్నాం.. ప్రియాంక భర్త నిక్ ఆసక్తికర కామెంట్స్
Priyanka Chopra Family
Basha Shek
| Edited By: |

Updated on: Feb 11, 2026 | 9:34 AM

Share

నిక్ జోనాస్ హాలీవుడ్‌కు చెందిన ప్రముఖ పాప్ గాయకుడు అలాగే మంచి నటుడు కూడా. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు నిక్. 2018లో వీరు వివాహం చేసుకున్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాల ప్రకారమే ఇద్దరూ వైవాహిక బంధంలోకి అడుగు పెట్టారు. నిక్ జోనాస్ ప్రియాంక కంటే 10 సంవత్సరాలు చిన్నవాడు. ఈ వయసు అంతరం కారణంగా మొదటల్లో ఈ జంటపై బాగా ట్రోలింగ్ నడిచింది. అయినా అవేవీ పట్టించుకోకుండా తమ లైఫ్ ను లీడ్ చేస్తున్నారీ లవ్లీ కపుల్. ఇప్పుడీ స్టార్ కపుల్ కు మాలతి అనే అందమైన కుమార్తె కూడా ఉంది. ఇదిలా ఉంటే ప్రియాంక నిక్ జోనాస్‌కు భారతీయ సంస్కృతి, హిందూ మతం గురించి నేర్పింది. అందుకే ఇటీవలి ఇంటర్వ్యూలో, నిక్ జోనాస్ భారతదేశం గురించి, ముఖ్యంగా హిందూ మతం గురించి గొప్పగా మాట్లాడాడు. హిందూ మతం పట్ల తనకున్న అపారమైన గౌరవాన్ని వ్యక్తం చేశాడు. ఇటీవల ఓ షోలో నిక్ జోనాస్ మాట్లాడుతూ, ‘నేను హిందూ మతం గురించి చాలా నేర్చుకుంటున్నాను. హిందూ మతం నిజంగా అద్భుతమైనది. ముఖ్యంగా హిందూ మతంలోని కర్మ సిద్ధాంతం నన్ను చాలా ప్రభావితం చేసింది. మనం ఇతరులకు మంచి చేస్తే, అది మనకే తిరిగి వస్తుంది. అలాగే మనం చెడు చేస్తే, మనకు చెడు జరుగుతుంది అనే సిద్ధాంతం నాకు నిజంగా నచ్చింది. భారతీయ పండుగలు, సంప్రదాయాలు ఇప్పుడు మా ఇంట్లో అంతర్భాగమయ్యాయి. నేను భారతీయ పండుగలను చాలా ఇష్టంగా జరుపుకుంటాను’

అలాగే ‘ధర్మ’ కూడా చాలా అద్భుతం. అందుకే మా అమ్మాయి (మాల్తీ మేరీ)ని కూడా నిజమైన హిందూ విలువలతోనే పెంచుతున్నాం. ఆమెకు వాటి అర్థం తెలిసేలా చూస్తున్నాం. ఇలాంటి బహుళ సంస్కృతులు, మతాలు ఉన్న కుటుంబం దొరకడం నా అదృష్టం’ అని నిక్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ప్రియాంక భర్త చెప్పిన ఈ మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు నిక్ జోనాస్‌ను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఇక ప్రియాంక చోప్రా ప్రస్తుతం ఎస్.ఎస్. రాజమౌళి ‘వారణాసి’ సినిమా పనిలో బిజీగా ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. మలయాళం సూపర్ స్టార్ పృథ్వీ రాజకుమార్ ఇందులో కుంభ అనే విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోన్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్ 07న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. మరోవైపు నిక్ కూడా లైవ్ కచేరీలు, కొత్త ఆల్బమ్స్, సినిమాలతో బిజీగా ఉన్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర