AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: మెల్ల కన్ను యువకుడి లవ్‌స్టోరి.. అప్పుడే ఓటీటీలోకి తెలుగు ఎమోషనల్ లవ్ స్టోరీ.. అధికారిక ప్రకటన

ఈ సినిమా కథ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మెల్లకన్ను ను కళ్ల జోడుతో కవర్ చేస్తూ అభద్రతా భావంతో బతికే హీరో ప్రేమలో పడితే ఎలా ఉంటుందన్న నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారు. ఐఎమ్ డీబీలో ఈ మూవీకి ఏకంగా 8.5 రేటింగ్ దక్కడం విశేషం.

OTT Movie: మెల్ల కన్ను యువకుడి లవ్‌స్టోరి.. అప్పుడే ఓటీటీలోకి తెలుగు ఎమోషనల్ లవ్ స్టోరీ.. అధికారిక ప్రకటన
Sri Chidambaram Garu Movie
Basha Shek
|

Updated on: Feb 13, 2026 | 6:31 PM

Share

ఈ మధ్యన మలయాళం సినిమాలు హిట్ అవ్వడానికి ప్రధాన కారణం న్యాచురాలిటీ . కథ సింపుల్ గా ఉన్నా దానిని వైవిధ్యంగా తెరకెక్కించడ మలయాళం మేకర్స్ ప్రత్యేకత. అందుకే మాలీవుడ్ సినిమాలు థియేటర్లలో కోట్లాది రూపాయల కలెక్షన్లు తెస్తున్నాయి. అలాగే ఓటీటీలోనూ మిలియన్ల కొద్దీ వ్యూస్ సొంతం చేసుకుంటున్నాయి. అప్పుడప్పుడు తెలుగులోనూ ఇలాంటి ప్రయోగాత్మక సినిమాలు వస్తున్నాయి. మెల్లకన్ను ఉన్న ఓ యువకుడి జీవితం ఆధారంగా ఇటీవలే ఒక తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గత వారమే థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా కథ, కథనాల పరంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కానీ అందరూ చిన్న నటులే ఉండడం, పెద్దగా ప్రమోషన్లు నిర్వహించకపోవడం ఈ సినిమాకు మైనస్ గా మారింది. అందుకే రెండు వారాల గ్యాప్ లోనే ఈ ఎమోషనల్ లవ్ స్టోరీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.

ఈ సినిమా కథ విషయానికి వస్తే.. హీరోకు మెల్ల కన్ను ఉండడంతో చిన్నప్పట్నుంచే ఆత్మన్యూన‌తతో బాధపడుతుంటాడు. తన లోపాన్ని కవర్ చేసేందుకు నళ్లటి క‌ళ్లద్దాలు ధ‌రించ‌డం అల‌వాటు చేసుకుంటాడు. చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో భవన నిర్మాణ కార్మికుడిగా పని చేసి తండ్రి చేసిన అప్పులను తీరుస్తుంటాడు. అదే సమయంలో అదే ఊరికి చెందిన లీల అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ ఆ విషయాన్ని ఆమెకు చెప్పడు. కానీ ఒక రోజు ధైర్యం చేసుకుని లీలకు తన ప్రేమ విషయాన్ని చెబుతాడు హీరో. మరి హీరోయిన్ హీరో ప్రేమను అంగీకరించిందా? రిజెక్ట్ చేసిందా? అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

రెండు వారాల్లోనే ఓటీటీలోకి..

ఈ సినిమా పేరు శ్రీ చిదంబరం గారు..వినయ్ రత్నం తెరకెక్కించిన ఈ సినిమాలో వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా హీరో హీరోయిన్లుగా నటించారు. వీళ్లతోపాటు గోపీనాథ్, శివకుమార్ మట్ట, కల్పలత గార్లపాటి, అరుణ్ కుమార్, తులసి, నాయుడు మోరం, శంకర్ రావు తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 06న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఈనెల 19వ తేదీ నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మేరకు ఓటీటీ సంస్థ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఏషియన్ గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన విత్యా రామ్‌రాజ్
ఏషియన్ గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన విత్యా రామ్‌రాజ్
ఈ ఒక్క యాప్ ఉంటే చాలు.. ఒకే క్లిక్‌తో పీఎఫ్ సేవలు..
ఈ ఒక్క యాప్ ఉంటే చాలు.. ఒకే క్లిక్‌తో పీఎఫ్ సేవలు..
కళ్లముందే పేకమేడలా కూలిపోయిన కొండ.. నేపాల్‌లో జల ప్రళయం..
కళ్లముందే పేకమేడలా కూలిపోయిన కొండ.. నేపాల్‌లో జల ప్రళయం..
40 కిలోల బరువు తగ్గిన నటి ఖుష్బూ.. వెయిట్ లాస్ సీక్రెట్ ఇదే
40 కిలోల బరువు తగ్గిన నటి ఖుష్బూ.. వెయిట్ లాస్ సీక్రెట్ ఇదే
ఓవర్‌థింకింగ్‌ లో బంధీ అయ్యారా? బుద్ధుడు చెప్పిన ఈ కథ మీ కోసమే
ఓవర్‌థింకింగ్‌ లో బంధీ అయ్యారా? బుద్ధుడు చెప్పిన ఈ కథ మీ కోసమే
పింఛన్లపై ఏపీ ప్రభుత్వం బిగ్ అప్డేట్.. శుభవార్త వచ్చేసింది..
పింఛన్లపై ఏపీ ప్రభుత్వం బిగ్ అప్డేట్.. శుభవార్త వచ్చేసింది..
రణబాలి డాక్యుమెంటరీ ఫస్ట్ ఎపిసోడ్ వచ్చేసింది..
రణబాలి డాక్యుమెంటరీ ఫస్ట్ ఎపిసోడ్ వచ్చేసింది..
అరెరే హోటల్‌ రూమ్‌లో సీక్రెట్‌ కెమెరాస్‌ను గుర్తించడం ఇంత సింపులా
అరెరే హోటల్‌ రూమ్‌లో సీక్రెట్‌ కెమెరాస్‌ను గుర్తించడం ఇంత సింపులా
IIT-JEEలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్.. ఇప్పుడు దోమ మెదడుపై పరిశోధన
IIT-JEEలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్.. ఇప్పుడు దోమ మెదడుపై పరిశోధన
ట్రైన్‌లో బైక్ పార్శిల్ చేయాలా? ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోవచ్చు.
ట్రైన్‌లో బైక్ పార్శిల్ చేయాలా? ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోవచ్చు.