AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ అమ్మాయినా మనం ట్రోల్ చేసింది? తొలి సినిమా పారితోషికంతో మోనాలిసా ఏం చేసిందో తెలిస్తే మెచ్చుకోక ఉండరు

మోమహా కుంభమేళాలో పూస‌ల దండ‌లు అమ్ముతూ ఓవర్ నైట్ పాపులర్ అయిపోయింది మోనాలిసా. తన ఛార్మింగ్ లుక్స్ తో సోషల్ మీడియా సెన్సేషన్ గా మారిపోయింది. ఇప్పుడీ బ్యూటీ సినిమాల్లో కూడా నటిస్తోంది. తాజాగా ఈ కుంభమేళా బ్యూటీ గురించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ అమ్మాయినా మనం ట్రోల్ చేసింది? తొలి సినిమా పారితోషికంతో మోనాలిసా ఏం చేసిందో తెలిస్తే మెచ్చుకోక ఉండరు
Maha Kumbh Mela Fame Monalisa Bhosle
Basha Shek
|

Updated on: Feb 12, 2026 | 8:28 PM

Share

మహా కుంభమేళాలో పూస‌ల దండ‌లు అమ్ముతూ ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది మోనాలిసా. తన క్యూట్ లుకింగ్ తో సోషల్ మీడియా సంచలనంగా మారిపోయింది. ఇప్పుడీ బ్యూటీ సినిమాలు, యాడ్స్ కూడా చేస్తోంది. షూటింగులతో నిత్యం బిజీ బిజీగా ఉంటోంది. తాజాగా ఈ కుంభమేళా బ్యూటీ గురించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో మొత్తం మూడు సినిమాలు ఉన్నాయి. అందులో ‘ ది డైరీ ఆఫ్ మణిపూర్’ మొదట ప్రేక్షకుల ముందుకు రానుంది. అంటే ఇదే ఆమెకు మొదటి సినిమా. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది. కాగా తనకెంతో గుర్తింపు తీసుకొచ్చిన ప్రయాగ్‌రాజ్‌ను మళ్లీ సందర్శించింది మోనాలిసా. అక్కడ గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించింది. మహా కుంభమేళాలో దండలు అమ్ముతున్న రోజుల్లో తాను ఇంత దూరం వస్తానని కలలో కూడా ఊహించలేదని ఎమోషనల్ అయ్యింది. తనకు ఇంత అందమైన జీవితాన్ని అందించిన సమాజానికి తిరిగి ఇవ్వాలనే ఆలోచనతో ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అదేంటంటే.. తన మొదటి మూవీ రెమ్యునరేషన్‌తో మధ్యప్రదేశ్‌లోని ఖార్గోన్ జిల్లాలో బాలికల కోసం ఒక పాఠశాలను ప్రారంభించాలన్నదే తన కల అని మోనాలిసా తెలిపింది.

‘ఈ ప్రాంతాల్లో అమ్మాయిలకు సరైన విద్యావకాశాలు లేవు. చదువుకోని బాలికలు జీవితంలో బాగా వెనుకబడిపోతున్నారు. బాలికల విద్య ద్వారానే సమాజంలో నిజమైన మార్పు సాధ్యమవుతుందని నా నమ్మకం. అందుకే నా సంపాదనను వ్యక్తిగత సౌకర్యాల కోసం కాకుండా, భవిష్యత్ తరాల కోసం ఉపయోగించాలనుకుంటున్నాను ‘ అని చెప్పుకొచ్చింది మోనాలిసా. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. మోనాలిసా తీసుకున్న ఈ నిర్నయం పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ముద్దుగుమ్మ మనసు అందమైనదే. ఇన్నాళ్లూ ఈ అమ్మాయినా మనం ట్రోల్ చేసిందా?’ అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మోనాలిసా లేటెస్ట్ వీడియో..

కాగా ఆ మధ్యన మోనాలిసాకు సంబంధించిన కొన్ని వీడియోలు నెట్టింట వైరలయ్యాయి. అందులో ఆమె లుక్స్, వాయిస్ డిఫరెంట్ గా ఉండడంతో కొందరు నెటిజన్లు ఈ బ్యూటీని బాగా ట్రోల్ చేశారు. అయితే అలాంటివేవీ పట్టించుకోకుండా తన లైఫ్ ను లీడ్ చేస్తోంది మోనాలిసా.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
EPFO లబ్ధిదారులకు గుడ్‌న్యూస్.. ఇకపై పీఎఫ్‌ విత్‌డ్రా మరింత ఈజీ
EPFO లబ్ధిదారులకు గుడ్‌న్యూస్.. ఇకపై పీఎఫ్‌ విత్‌డ్రా మరింత ఈజీ
వాస్తు టిప్స్: ఈ వస్తువులు కొత్త ఇంటికి తీసుకెళ్తే సమస్యలు తప్పవు
వాస్తు టిప్స్: ఈ వస్తువులు కొత్త ఇంటికి తీసుకెళ్తే సమస్యలు తప్పవు
టిఫిన్‌లో వడ రాలేదని ఆ నటుడు షూటింగ్ నుంచి వెళ్లిపోయాడు: రవిబాబు
టిఫిన్‌లో వడ రాలేదని ఆ నటుడు షూటింగ్ నుంచి వెళ్లిపోయాడు: రవిబాబు
మునక్కాయతో ఇలా వెల్లుల్లి కారం కూర చేశారంటే..
మునక్కాయతో ఇలా వెల్లుల్లి కారం కూర చేశారంటే..
కాకరకాయ ఇష్టం లేనోళ్లకి కుడా ఫేవరెట్ కర్రీ అవ్వాల్సిందే.!
కాకరకాయ ఇష్టం లేనోళ్లకి కుడా ఫేవరెట్ కర్రీ అవ్వాల్సిందే.!
Petrol: మే 15 తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు..!
Petrol: మే 15 తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు..!
పవన్ కళ్యాణ్ డ్రస్ మొత్తం రక్తం.. అయినా లెక్కచేయలేదు..
పవన్ కళ్యాణ్ డ్రస్ మొత్తం రక్తం.. అయినా లెక్కచేయలేదు..
ఎంతోమంది జీవితాన్ని మార్చిన మాల..ఇది ధరిస్తే మీ తలరాత మారడం పక్కా
ఎంతోమంది జీవితాన్ని మార్చిన మాల..ఇది ధరిస్తే మీ తలరాత మారడం పక్కా
బాసరకు కొత్త శోభ.. అంగరంగ వైభవంగా నూతన ఆలయ నిర్మాణం
బాసరకు కొత్త శోభ.. అంగరంగ వైభవంగా నూతన ఆలయ నిర్మాణం
పెళ్లిలో పొట్టు పొట్టు కొట్టుకున్న బంధువులు.. ఎందుకో తెలిస్తే..
పెళ్లిలో పొట్టు పొట్టు కొట్టుకున్న బంధువులు.. ఎందుకో తెలిస్తే..