AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ స్టార్ హీరోకు దుల్కర్ సల్మాన్ ప్రాంక్ కాల్.. ఆన్సర్ వింటే షాకే !!

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్.. "ఆకాశంలో ఒక తార" అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తెలుగమ్మాయి సాత్విక వీరవల్లి హీరోయిన్ గా పరిచయమవుతున్నారు. ఈ క్రమంలోనే మూవీ ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ దేవరకొండకు ప్రాంక్ కాల్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆ స్టార్ హీరోకు దుల్కర్ సల్మాన్ ప్రాంక్ కాల్.. ఆన్సర్ వింటే షాకే !!
Dulquer Salmaan
Korivi Jayakumar
|

Updated on: Nov 19, 2026 | 1:33 PM

Share

స్టార్ హీరో దుల్కర్ సల్మాన్.. మెగాస్టార్ మమ్ముట్టి వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించి తక్కువ కాలంలోనే స్టార్ హీరో ఇమేజ్ సంపాదించుకున్నారు. ఓ వైపు యాక్షన్ సినిమాలు చేస్తూనే.. మరోవైపు లవ్ స్టోరీస్, ఫీల్ గుడ్ మూవీలతో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఈ యంగ్ హీరోకు లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉందనడంలో సందేహం అక్కర్లేదు. మలయాళంతో పాటు ఇతర భాషల్లో సైతం నటించి దక్షిణాదినే కాకుండా దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు.

కాగా ఈ మధ్య కాలంలో మలయాళం కంటే కూడా ఎక్కువగా తెలుగు సినిమాల్లోనే కనిపిస్తున్నారు. మహానటి సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన దుల్కర్.. సీతారామం సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. రీసెంట్ గానే లక్కీ భాస్కర్ మూవీతో బాక్సాఫీస్ వద్ద భారీగానే కలెక్షన్స్ కొల్లగొట్టారు. ఇక ఇప్పుడు “ఆకాశంలో ఒక తార” అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తెలుగమ్మాయి సాత్విక వీరవల్లి హీరోయిన్ గా పరిచయమవుతున్నారు. కాగా శృతిహాసన్, రుహాని శర్మ ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషిస్తుండగా.. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా బ్యానర్లపై నిర్మిస్తున్నారు. నవంబర్ 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి విడుదలైన ట్రైలర్‌ సినిమాపై ఆసక్తిని పెంచగా.. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీరిలీజ్‌ వేడుకకు అల్లు అర్జున్‌ హాజరుకావడంతో మూవీపై మరింత బజ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే మూవీ యూనిట్ ప్రమోషన్స్ విషయంలో ఫుల్ జోష్ తో దూసుకుపోతుంది. ఈ మేరకు దుల్కర్ సల్మాన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చిన్నారులతో కలిసి రౌడీ బాయ్ విజయ్ దేవరకొండకు ప్రాంక్ కాల్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఫోన్ దొరికిందంటూ కాల్..

ఇక ఇంటర్వ్యూలో భాగంగా దుల్కర్ సల్మాన్‌తో చిన్నారులు ఓ ప్రాంక్ కాల్ చేయించారు. ఆయన విజయ్ కి కాల్ చేసి ఓ చిన్నారితో మాట్లాడించారు. ఆమె మాట్లాడుతూ.. ఈ ఫోన్ రోడ్డుపై దొరికింది. ఇందులో ఎమర్జెన్సీ నంబర్ డయల్ చేయగానే మీకు కాల్ వచ్చింది. ఎవరు మాట్లాడుతున్నారు?’ అని ప్రశ్నించింది. అందుకు విజయ్.. మీకు ఫోన్ ఎక్కడ దొరికింది? అని అడిగారు. అందుకు ఆ బాలిక హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ స్కూల్ పక్కన అని ఆన్సర్ ఇచ్చింది. దాంతో ఆయన అయితే కొద్దిసేపటి తర్వాత ఓ వ్యక్తి మీ దగ్గరకు వచ్చి ఆ ఫోన్ తీసుకుంటారని చెప్పి కాల్ కట్ చేశారు. అనంతరం దుల్కర్ మరోసారి విజయ్‌కు ఫోన్ చేసి ఇదంతా ప్రాంక్ కాల్ అని వెల్లడించడంతో అక్కడున్న వారంతా సరదాగా నవ్వుకున్నారు.

ఫోన్ వాళ్లు వచ్చి తీసుకుంటారంటూ..

Follow Us