AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi: చేతికి కట్టు.. ఏం జరిగిందో చెప్పిన మెగాస్టార్ చిరంజీవి

రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి చేతికి కట్టుతో కనిపించారు. ఈ ఫొటోలను చూసి అభిమానులు చిరంజీవికి ఏమైందోనని కాసింత ఆందోళనకు గురయ్యారు. దీంతో చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. తనకు ఏం జరిగిందో, చేతికి ఎందుకు కట్టుకున్నారో వివరించారు.

Chiranjeevi: చేతికి కట్టు.. ఏం జరిగిందో చెప్పిన మెగాస్టార్ చిరంజీవి
Chiranjeevi
Basha Shek
|

Updated on: Feb 16, 2026 | 7:47 PM

Share

అల్లు అరవింద్ తనయుడు అల్లు శిరీష్‌ వివాహం సందర్భంగా మొదటి శుభలేఖను మెగాస్టార్ చిరంజీవికి అందించారు. అల్లు అరవింద్‌ దంపతులు, అల్లు శిరీష్‌ స్వయంగా చిరు ఇంటికి వెళ్లి నూతన వస్త్రాలతో పాటు వివాహ ఆహ్వాన పత్రికను అందించి పెళ్లికి ఆహ్వానించారు.ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరలయ్యాయి. చాలా రోజుల తర్వాత అల్లు, మెగా ఫ్యామిలీలు ఒకేసారి కనిపించంతో అభిమానులు హ్యాపీగా ఫీలయ్యారు. ఇదే సమయంలో చిరంజీవి చేతికి కట్టు ఉండటం గమనించి  అభిమానులు ఆందోళన చెందారు. ఆయనకు ఏమైందంటూ ఆరా తీయడం మొదలు పెట్టారు. అంతకు ముందు ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ ను సందర్శించినప్పుడు కూడా చేతికి కట్టుతో కనిపించారు మెగాస్టార్. నొప్పిని భరిస్తూనే ఎంతో ఓపికగా తన అభిమానులతో కలిసి సరదాగా ఫొటోలు, వీడియోలు దిగారు. దీంతో మెగాభిమానులు టెన్షన్ పడ్డారు. ఈ క్రమంలో చిరంజీవి స్వయంగా తన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ పోస్ట్‌ పెట్టారు.

ఇవి కూడా చదవండి

‘‘చేతికి పట్టీ ఉండటం గమనించి పలువురు శ్రేయోభిలాషులు నా ఆరోగ్యం గురించి ఆరా తీశారు. నా భుజానికి చిన్న కీ-హోల్‌ సర్జరీ జరిగింది. ప్రస్తుతం నేను బాగానే కోలుకుంటున్నా. ఇప్పటికే నా రొటీన్ లైఫ్ కు తిరిగి వస్తున్నాను. ఈ విషయంలో ఆర్థోస్కోపీ సర్జన్‌ డాక్టర్‌ నితిన్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. సర్జరీ విషయంలో తీసుకున్న జాగ్రత్తలు, ఆయన నైపుణ్యంతో ఆ ప్రక్రియ అంతా సజావుగా, సౌకర్యవంతంగా సాగింది. నా పట్ల మీరు చూపిస్తున్న ప్రేమ, అభిమానం, అందిస్తున్న దీవెనలకు మనసు ఎంతో సంతోషంగా ఉంది’ అని చిరంజీవి రాసుకొచ్చారు.

చిరంజీవి ట్వీట్..

ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ లో చేతికి కట్టుతో చిరంజీవి.. వీడియో  ..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి

Follow Us
కొరడా చేతపట్టి వీధుల్లోకి ప్రభుత్వ బడి టీచర్‌.. అసలు సంగతి ఏమంటే?
కొరడా చేతపట్టి వీధుల్లోకి ప్రభుత్వ బడి టీచర్‌.. అసలు సంగతి ఏమంటే?
ఒకే ఓవర్‌లో 7 సిక్సర్లు.. క్రికెట్ చరిత్రలోనే తొలిసారి ఇలా..
ఒకే ఓవర్‌లో 7 సిక్సర్లు.. క్రికెట్ చరిత్రలోనే తొలిసారి ఇలా..
ఆఫ్ఘాన్ డైరెక్ట్‌గా క్వాలిఫై అయింది.. వెస్టిండీస్ కాలేదు! ఎందుకు?
ఆఫ్ఘాన్ డైరెక్ట్‌గా క్వాలిఫై అయింది.. వెస్టిండీస్ కాలేదు! ఎందుకు?
ఆ సినిమాకు ఫస్ట్ ఛాన్స్ నేనే.. కానీ రిజెక్ట్ చేయడానికి కారణం ఇదే.
ఆ సినిమాకు ఫస్ట్ ఛాన్స్ నేనే.. కానీ రిజెక్ట్ చేయడానికి కారణం ఇదే.
వరుణ యాగం.. నీటిలో కూర్చొని 11 మంది వేద పండితుల పూజలు!
వరుణ యాగం.. నీటిలో కూర్చొని 11 మంది వేద పండితుల పూజలు!
ఈ చిట్కా తో బెండకాయ వేపుడు జిగురు లేకుండా పొడిపొడిగా చేసేయండి
ఈ చిట్కా తో బెండకాయ వేపుడు జిగురు లేకుండా పొడిపొడిగా చేసేయండి
పాక్షిక సూర్య గ్రహణం తర్వాత వారి జీవితాల్లో శుభాలు..!
పాక్షిక సూర్య గ్రహణం తర్వాత వారి జీవితాల్లో శుభాలు..!
పచ్చిమిర్చి పచ్చడి ఇలా చేసి.. వేడి అన్నంలో నెయ్యితో అదిరిపోద్ది!
పచ్చిమిర్చి పచ్చడి ఇలా చేసి.. వేడి అన్నంలో నెయ్యితో అదిరిపోద్ది!
విగతజీవులుగా దంపతులు.. సెల్ఫీ వీడియోతో షాకింగ్ ట్విస్ట్!
విగతజీవులుగా దంపతులు.. సెల్ఫీ వీడియోతో షాకింగ్ ట్విస్ట్!
తొలి టెస్ట్‌ నుంచి ఆ ఇద్దరు స్టార్ బ్యాటర్లు ఔట్..?
తొలి టెస్ట్‌ నుంచి ఆ ఇద్దరు స్టార్ బ్యాటర్లు ఔట్..?