AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నూడుల్స్ లవర్స్‌కి దిమ్మతిరిగే నిజాలు.. మీకు తెలియని షాకింగ్ ఫ్యాక్ట్స్ ఇవే!

చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టపడే ఆహారం నూడుల్స్. తక్కువ సమయంలోనే ఎంతో టేస్టీగా తయారవుతోంది ఈ ఫాస్ట్ ఫుడ్. అయితే నూడుల్స్ గురించి మనందరికీ తెలియని ఎన్నో ఆసక్తికరమైన, షాకింగ్ విషయాలు ఉన్నాయి. నూడుల్స్‌ను అంతరిక్షంలోకి తీసువెళ్లడం నుంచి వాటి మ్యూజియం ఏర్పాటు వరకు ఉన్న ఆసక్తికర విషయాలు మీకోసం ప్రత్యేకంగా..

నూడుల్స్ లవర్స్‌కి దిమ్మతిరిగే నిజాలు.. మీకు తెలియని షాకింగ్ ఫ్యాక్ట్స్ ఇవే!
Noodles
Korivi Jayakumar
|

Updated on: Nov 19, 2026 | 2:22 PM

Share

చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టపడే ఆహారం నూడుల్స్. తక్కువ సమయంలోనే ఎంతో టేస్టీగా తయారవుతోంది ఈ ఫాస్ట్ ఫుడ్. అందుకే ఇది నేటి బిజీ జీవితంలో ఎంతోమందికి ఈజీ స్నాక్‌గా మారిపోయిందని చెప్పొచ్చు. దాదాపు 4 వేల ఏళ్ల క్రితం చైనాలో పుట్టిన ఈ నూడుల్స్.. నేడు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాలుగా అందుబాటులోకి వచ్చింది.  నేడు అతి తక్కువ ధరకే దొరుకుతున్న నూడుల్స్.. కొత్తలో తయారైనప్పుడు ఒక లగ్జరీ ఐటమ్. ఆ రోజుల్లో ఒక ప్యాకెట్ నూడుల్స్ ధర, ఇప్పటి ధరతో పోలిస్తే దాదాపు పది రెట్లు ఎక్కువగా ఉండేదట.

ఇక నూడుల్స్‌ను ఫాస్ట్ ఫుడ్ జాబితాలో వేసినా.. మితంగా తింటే వీటి ద్వారా శక్తితో పాటు ఐరన్, రిబోఫ్లేవిన్, నియాసిన్, థయామిన్ వంటి విటమిన్లు, ఖనిజాలు కూడా లభిస్తాయని చెబుతున్నారు.  అయితే రుచిగా ఉన్నాయని వీటిని అతిగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదని సూచిస్తారు. మైదా, అధిక సోడియం, ప్రిజర్వేటివ్స్ వల్ల జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉందని.. ఇంట్లోనే కూరగాయలు, కావాల్సిన పదార్ధాలు వేసుకొని వండుకుని తింటే ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చని సలహా ఇస్తుంటారు. అయితే నూడుల్స్ గురించి మనందరికీ తెలియని ఎన్నో ఆసక్తికరమైన, షాకింగ్ విషయాలు ఉన్నాయి. నూడుల్స్‌ను అంతరిక్షంలోకి తీసువెళ్లడం నుంచి వాటి మ్యూజియం ఏర్పాటు వరకు ఉన్న ఆసక్తికర విషయాలు మీకోసం ప్రత్యేకంగా..

చైనా, జపాన్ లలో స్పెషల్..

చైనా వంటి దేశాల్లో నూడుల్స్‌ను కేవలం ఆహారం లాగా మాత్రమే కాకుండా అదొక సంప్రదాయంగా మారింది. మరీ ముఖ్యంగా చైనీయులు వీటిని దీర్ఘాయుష్షుకు చిహ్నంగా భావిస్తారు. అందుకే పుట్టినరోజు, చైనా న్యూ వేడుకలు వంటి సందర్భాల్లో వీటిని ప్రత్యేకంగా వండుతారు. కొందరైతే బర్త్‌డే కేక్‌కు బదులుగా కూడా పొడవాటి నూడుల్స్‌నే ఆరగిస్తారని చెబుతుంటారు. కాగా సాధారణంగా తినేటప్పుడు శబ్దం చేయడాన్ని మనం తప్పుగా భావిస్తాం. కానీ జపాన్‌లో మాత్రం నూడుల్స్ తినేటప్పుడు గట్టిగా జుర్రుకుంటూ (స్లర్పింగ్) శబ్దం చేయడం అక్కడి సంప్రదాయం. అలా చేస్తే ఆ వంటకం చాలా రుచిగా ఉందని, వండిన వారిని గౌరవించినట్లుగా అక్కడివారు భావిస్తారు.

మరిన్ని ప్రత్యేకతలు..

4 వేల ఏళ్ల చరిత్ర..

కాగా నూడుల్స్ చరిత్ర ఈనాటిది కాదు. దాదాపు 4 వేల ఏళ్ల క్రితమే చైనాలో చిరుధాన్యాల (మిల్లెట్) పిండితో మొట్టమొదటిసారిగా నూడుల్స్‌ను తయారు చేశారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బియ్యం, రవ్వ, మైదా లేదా గోధుమ పిండితో తయారు చేసే నూడుల్స్‌లో 30కి పైగా రకాలు ఉన్నాయి. ఒక్క ఆసియా ఖండంలోనే దాదాపు 15 రకాలు లభిస్తాయి.

అంతరిక్షంలోకి నూడుల్స్..

2005లో జపాన్ వ్యోమగామి సోయిచి నోగుచి ఇన్‌స్టంట్ నూడుల్స్‌ను అంతరిక్షంలోకి తీసుకెళ్లారు. అంతరిక్షంలో భారరహిత స్థితిలో తినడానికి వీలుగా, ‘నిస్సిన్ ఫుడ్’ సంస్థ ప్రత్యేకంగా బంతి ఆకారంలో ఉండే నూడుల్స్‌ను తయారు చేసింది.

నూడుల్స్ కోసం ప్రత్యేక మ్యూజియం..

నూడుల్స్ ప్రియుల కోసం జపాన్‌లోని ఒసాకా నగరంలో ఒక ప్రత్యేక మ్యూజియం ఉంది. ఇందులో దాదాపు 4,560 రకాల నూడుల్స్‌ను, వాటి తయారీ విధానాలను ప్రదర్శనకు ఉంచారు. అంతే కాకుండా రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్‌లో తీవ్రమైన ఆహార కొరత ఏర్పడింది. ఆ సమయంలో సులభంగా అందుబాటులో ఉన్న ఒకే ఒక్క ఆహారం ఎండబెట్టిన నూడుల్స్. అప్పటి నుంచి అది జపాన్ ప్రజల ప్రధాన ఆహారంగా మారిపోయింది.

1958లో ఇన్‌స్టంట్ నూడుల్స్ ఆవిష్కరణ..

జపాన్‌కు చెందిన మోమోఫుకు ఆండో 1958లో ఇన్‌స్టంట్ నూడుల్స్‌ను కనిపెట్టారు. వేడినీళ్లలో వేయగానే నిమిషాల్లో ఉడికిపోయే ఈ రకం నూడుల్స్ మార్కెట్‌లో విప్లవం సృష్టించాయి.

Follow Us